Ariyana: అర్యానా.. ఈ పేరు వింటే చాలు అమ్మాయి అంటే ఎలా ఉండాలి.. అబ్బాయిలతో పోటీ ఎలా పడాలి? వాళ్లకి దీటుగా టాస్కులు ఎలా ఆడాలి? అనే దానిని చూపించింది బిగ్ బాస్ సీజన్ 4 లో. ఈమెకి హౌస్ లో ఎవ్వరు పెద్దగా సపోర్ట్ చేయలేదు. కానీ ఒక్కదే తన టాలెంట్‌ను మరియు తన గట్స్‌ను ప్రూవ్ చేసుకుంటూ ఫైనల్స్ వరకు వచ్చింది. అయితే విన్నర్ మాత్రం కాలేదు కానీ.. ప్రేక్షకుల హృదయాలను మాత్రం గెలుచుకుంది. జనవరి 25, 1993న జన్మించింది ఈ బ్యూటీ. ఈమె తండ్రి పేరు నీల్. ఈయన వృత్తిరీత్యా వ్యాపారవేత్త. ఇక ఈమెకి ఇద్దరు తోబుట్టులు ఉన్నారు. ఒక తమ్ముడు ఒక సోదరీ ఉన్నారు. ఈ బ్యూటీ మధ్యతరగతి క్రైస్తవ కుటుంబంలో పెరిగింది. ఒక గ్రాడ్యుయేషన్ మొత్తం హైదరాబాదులోనే కంప్లీట్ చేసింది.
అలా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన అనంతరం యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో మొదట మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి అనంతరం యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చింది. పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం అర్యానా కి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదనే చెప్పుకోవచ్చు. టాలీవుడ్ బాడ డైరెక్టర్స్ లో ఒకరైన ఆర్జీవి తో ఈ ముద్దుగుమ్మ కొంతకాలం ఎఫైర్ నడిపింది అంటూ వార్తలు కూడా వినిపించాయి. వాటికి తగ్గట్లుగానే ఈమె సైతం ఆర్జీవితో రాసుకుని పూసుకుని ఉండడంతో వీరి మధ్య ఏదో జరుగుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు.
ఇక బిగ్‌బాస్ కి వెళ్ళకముందు అర్యానా అంటే ఎవరో కూడా పెద్దగా ఎవరికి తెలియదు. కానీ బిగ్ బాస్ అనంతరం స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. బిగ్ బాస్ లో లేడీ టైగర్ గా పోరాడి మంచి పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకుంది. ఇక ఒకప్పుడు ఎంతో సన్నగా ఉండే ఈమె ప్రస్తుతం తన గ్లామర్ డోస్ ను పెంచడమే కాకుండా ఫిజిక్ ని కూడా పెంచేసింది. అద్భుతమైన అందాలను కలిగిన ఈ బ్యూటీ అదిరిపోయే డ్రెస్ లో తాజాగా దర్శనమిచ్చింది. పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ ఓవరాల్ గా డ్రెస్ సైజు తగ్గించేసింది.
ఒకప్పుడు నిండు దుస్తులలో కనిపించిన ఈమె ఇప్పుడు మాత్రం డ్రెస్ వేసుకోవాలా అనే ఫీలింగ్ లో ఉంటుంది. ప్రస్తుతం షబీగా మారుతూ బాడీ షేప్స్ ను చూపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవ్వడంతో..” చదవకముందు కాకరకాయి చదివిన తర్వాత కేకరగాయి అన్నట్లు.. పాపులారిటీ రాకముందు వరకు నిండు దుస్తుల్లో ఉండి పాపులారిటీ వచ్చిన వెంటనే ఇలా ఎలా చేంజ్ అవుతారు. అయినా ఇంత పొట్టి దుస్తులు ధరిస్తే మీకు సిగ్గుగా అనిపించదా. పోనీ ధరించారే అనుకో దానికి మళ్ళీ ఫోజులు ఇస్తూ మీ బాడీ షేప్స్ ని ప్రతి ఒక్కరికి చూపించాలా. ప్రస్తుత కాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ” అంటూ గోరంగా మండిపడుతున్నారు.