NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

భువ‌నేశ్వ‌రి ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌… వైసీపీకి పెద్ద ఛాన్స్ ఇచ్చేశారే…!

రాజ‌కీయాల్లో కీల‌క నాయ‌కులుగా ఉన్న‌వారు.. ఆచి తూచి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. ఇర‌కాటంలో ప‌డ‌క త‌ప్ప‌దు. వారు వీరు.. అనే తేడా లేదు. ఎవ‌రైనా కూడా స‌మ‌స్యే. ఎవ‌ర న్నా కూడా.. స‌మ‌స్యే. ఇప్పుడు ఇదే ప్రాబ్లం.. టీడీపీకి ప‌ట్టుకుంది. పార్టీ అధినేత చంద్ర‌బాబు.. స‌తీమ‌ణి.. నారా భువ‌నేశ్వ‌రి చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో చేసిన వ్యాఖ్య‌లు.. వైసీపీకి వ‌రంగా మారాయి. ఆ వ్యాఖ్య‌ల‌ను పార్టీ నాయ‌కులు జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు.

నారా భువ‌నేశ్వ‌రి రెండు రోజుల కింద‌ట మాట్లాడుతూ.. చంద్ర‌బాబుకు రెస్టు ఇవ్వాల‌ని అనుకుంటున్నా ను.. అని అన్నారు. అంతేకాదు.. తాను పోటీ చేయాల‌ని బావిస్తున్న‌ట్టు చెప్పారు అయితే.. ఇదంతా.. ఆమె ఉద్దేశ పూర్వ‌కంగా చెప్పింది కాదు. ఏదో స‌ర‌దాగాఆమె వ్యాఖ్యానించారు. కాని.. ఇది ఇప్పుడు స‌రిదిద్దు కోలేక పోయిన ప‌రిస్థితిని క‌ల్పించింది. ఎక్క‌డిక‌క్క‌డ వైసీపీ ఈ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌చారం చేస్తోంది. ఇటు అనుకూల మీడియాలోనూ నారా భువ‌నేశ్వ‌రి వ్యాఖ్య‌లు జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

ఇక‌, మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, ప్ర‌స్తుత మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌.. వంటివారు క్షేత్ర‌స్థా యిలో ఒక ఉద్య‌మం మాదిరిగా.. నారా భువ‌నేశ్వ‌రి వ్యాఖ్య‌ల‌ను తీసుకువెళ్తున్నారు. చంద్ర‌బాబుకు రెస్ట్ కావాల‌ని.. ఆయ‌న స‌తీమ‌ణి సైతం కోరుకుంటున్నార‌ని.. కాబ‌ట్టి మ‌నం ఆయ‌న‌కు రెస్ట్ ఇచ్చేయాల‌ని వారు చెబుతున్నారు. ఇవి వైసీపీ నాయ‌కుల నుంచి ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలోపే.. ఈ ప‌రిణామాల నుంచి టీడీపీ బ‌య‌ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. ముఖ్యంగా నారా భువ‌నేశ్వ‌రితోనే ఈ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇప్పిస్తే మ‌రీ మంచిద‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

`ఎన్నిక‌ల్లో ఏదీ చిన్న విష‌యం కాదు. నారా భువ‌నేశ్వ‌రి.. ఏ ఉద్దేశంతో అన్నారో.. అయినా.. కూడా అవి రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి ఇప్ప‌టికే న‌ష్టం తాలూకు ప‌రిణామాలు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికైనా.. పార్టీ దీనిపై క్షేత్ర‌స్థాయిలో అడ్డుక‌ట్ట వేయాలి` అని గుంటూరుకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నాయ‌కుడు వ్యాక్యానించారు. మ‌రోవైపు.. నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు కూడా.. దుమారం రేపుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎన్నికల వేళ నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

MLC Election: పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

sharma somaraju

బీఆర్ఎస్ ఫ్యూచ‌ర్‌లో ఏం క‌న‌ప‌డుతోందంటే…?

ఏపీ ఎగ్జిట్ పోల్స్‌… ఈ ఒక్క‌టి మాత్రం నిజం…!

ఆరా స‌ర్వేపై ఆరాలెందుకు… తెర‌వెనుక ఏం జ‌రిగింది..?

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

sharma somaraju

Telangana Exit Polls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ .. బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్, బీజేపీలదే హవా

sharma somaraju

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

sharma somaraju

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

sharma somaraju

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N