NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు, సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు అయిన డాక్టర్ మీనాక్షి అనుపిండి సుస్వర మ్యూజిక్ అకాడమీని స్థాపించి దాదాపు 21 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్ గా ఈ సంస్థ యొక్క వార్షికోత్సవాలను నిర్వస్తున్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా సంస్థ వార్షికోత్సవాలను మే 5న (ఆదివారం) డల్లాస్ లోని గ్రాండ్ సెంటర్ ఆడిటోరియంలో ఘననంగా నిర్వ‌హించారు. ఈ కార్యమానికి వ్యాఖ్యాతలుగా కుమారి సంహిత అనిపిండి, శ్రీమతి ప్రత్యూష వ్యవహరించారు.

Suswara Music Academy's 21st Anniversary...Dallas abounds with lavish celebrations
Suswara Music Academy’s 21st Anniversary…Dallas abounds with lavish celebrations

అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి డల్లాస్ నగరంలోని ప్రముఖులు, తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన సినీ ప్రముఖులు అతిధులుగా హాజరై విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర గారు, డల్లాస్ లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ గోపాల్ పోనంగి గారు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల గారు, శ్రీమతి శారద సింగిరెడ్డి గారు, శ్రీ ప్రకాష్ రావు గారు అతిధులగా హాజరయ్యారు.

Suswara Music Academy's 21st Anniversary...Dallas abounds with lavish celebrations
Suswara Music Academy’s 21st Anniversary…Dallas abounds with lavish celebrations

అంతేకాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్. పి. పట్నాయక్ గారు, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వి. ఎన్‌. ఆదిత్య‌ గారి తో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా వార్షిక సంబరాల్లో మీనాక్షి అనిపిండి గారు తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో 30కి పైచిలుకు సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శించి అలరించారు. విరామం లేకుండా 10 గంటల పాటు సాగిన ఈ సాంస్కృతిక గాన ప్రదర్శన వీక్షకులందరినీ ఉర్రూతలూగించిందనడంలో సందేహం లేదు.

Suswara Music Academy's 21st Anniversary...Dallas abounds with lavish celebrations
Suswara Music Academy’s 21st Anniversary…Dallas abounds with lavish celebrations

ఇదే క్రమంలో సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షిక సంబరాల వేదికపై, చంద్రబోస్ గారికి “సుస్వర సాహిత్య కళానిధి” అనే బిరుదునిచ్చి సత్కరించడం చిత్ర పరిశ్రమకి గర్వకారణం. అంతేకాదు, చంద్ర‌బోస్ గారు త‌న స్వ‌గ్రామం అయినటువంటి చల్లగరిగెలో ప్రారంభించిన ఆస్కార్ గ్రంధాల‌య నిర్మాణానికి, ఈ కార్య‌క్ర‌మం ద్వారా దాదాపు 15 వేల డాల‌ర్స్ కు పైగా విరాళం రావ‌డం ఆసక్తికరమైన మరో విషయం. ఈ వార్షిక సంబరాల్లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఆర్. పి. పట్నాయక్ గారు త‌న మాట‌ల‌తో , పాట‌ల‌తో ప్రేక్ష‌కులను బాగా అల‌రించారు. ఈ సందర్భంగా ఆర్. పి. పట్నాయక్ గారికి “సుస్వర నాద‌నిధి” అనే బిరుదుతో మీనాక్షి అనిపిండి గారు సత్కరించారు. ఇక సుస్వర మ్యూజిక్ అకాడమీ లోని విద్యార్థినీ, విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఆధ్యంతం ర‌క్తిక‌ట్టించారు.

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N