NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

Arya: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్య. ఈ సినిమా విడుదలై నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆర్య సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీనే ఆర్య. సుకుమార్ కు దర్శకుడుగా ఆర్య మొదటి సినిమా కాగా.. అల్లు అర్జున్ కు హీరోగా రెండో చిత్రం. వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ తో ఈ మూవీని రూపొందించారు. మొదట `నచికేత` అనే టైటిల్ పెట్టాలని అనుకున్నా కూడా చివరకు ఆర్య ను ఫిక్స్ చేశారు.

హీరోయిన్ గా అనురాధ మెహతా పిక్స్ అయ్యింది. శివ బాలాజీ, రాజన్‌ సి దేవ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దిల్ మూవీ హిట్ అనంతారం దిల్ రాజు నిర్మించిన ఆర్య సినిమా 2004 మే 7న అంటే సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజు 99 ప్రింట్స్ తో విడుదల అయింది. మార్నింగ్ షో డివైడ్ టాక్ వచ్చింది. కానీ సాయంత్రానికి అదే టాక్ పాజిటివ్ గా మారింది. ‌ అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్, దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాను ఓ రేంజ్ లో లేపాయి. సాంగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.

ఆర్య చిత్రంలో ప్ర‌తి సాంగ్ హిట్ అయింది. అలాగే రూ. 4 కోట్లతో నిర్మితమైన ఆర్య చిత్రం ఫుల్ ర‌న్ లో ఏకంగా రూ. 30 కోట్ల రేంజ్ లో వసూళ్లను అందుకుంది. అప్పట్లో ప్రేమ కథా చిత్రాల్లో ఆర్య ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తెలుగులో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన ఈ సినిమాను మలయాళం లో డ‌బ్‌ చేసి విడుదల చేయగా అక్కడ సైతం హిట్ గా నిలిచింది. రూ. 30 లక్షల వరకు వసూళ్లను రాబట్టడమే కాకుండా అల్లు అర్జున్ కు ఫ్యాన్ బేస్ ఏర్పడేలా చేసింది.

మ‌రోవైపు తొలి సినిమాతోనే సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఆర్య సినిమాలో హీరో క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ అల్లు అర్జున్ కాదు. నిజానికి సుకుమార్‌ ఈ సినిమా కథను మరో హీరో కోసం రాసుకున్నారట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు అల్లరి నరేష్. అల్లరి మూవీలో నరేష్ యాక్టింగ్ కు ఫిదా ఆయన సుకుమార్ ఆయన దృష్టిలో పెట్టుకుని ఆర్య కథను రాసుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆర్య స్టోరీ అల్లరి నరేష్ వద్దకు వెళ్లలేదు. అల్లు అర్జున్ హీరోగా ఖ‌రారయ్యాడు. గతంలో ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ స్వయంగా పంచుకున్నారు. అలాగే ఆర్యగా అల్లు అర్జున్ కంటే ఇంకెవరు బాగా చేయలేరని కూడా అల్లరి న‌రేష్ ప్ర‌శంస‌లు కురిపించారు.

Related posts

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N