Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ నుండి టేస్టీ తేజ ఎలిమినేట్ కావడం జరిగింది. 9 వారాలపాటు హౌస్ లో సందడి చేసిన తేజ ఆదివారం ఎలిమినేట్ అయ్యాడు. ఈ క్రమంలో బయటకు వచ్చిన తేజ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొని తన జర్నీ గురించి తోటి కంటెస్టెంట్ ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. హౌస్ లో మూడు వారాలు ఉంటే చాలని ప్రారంభంలో అనుకున్న కానీ 60 రోజులకు పైగా ఉండటం ఆడియన్స్ వల్లే సాధ్యమైందని అన్నారు. బిగ్ బాస్ ఒక మంచి గొప్ప ప్లాట్ఫారం. నాలాంటి వాడికి అవకాశం దొరుకుతుందని అనుకోలేదు. ఒకవేళ దొరికిన రెండు మూడు వారాలకు వచ్చేస్తాను ఏమో అని అనుకునేవాడిని.
ఇదే సమయంలో హౌస్ లో ఉన్న వారితో పరిచయం పెంచుకొని బయటకు రాగానే వాళ్లతో ఫుడ్ వ్లాగ్ వీడియోలు చేద్దామని ఆలోచన కూడా పెట్టుకున్నాను. కానీ నా ఆలోచనలు తలకిందులు చేసి తొమ్మిది వారాలు ఇంట్లో ఉండేలా ఆడియన్స్ సపోర్ట్ చేశారు. హౌస్ లో నా శక్తిమేరకు గేమ్ ఆడటం జరిగింది. ఈ క్రమంలో పూజాతో గొడవ గురించి మాట్లాడుతూ నాగార్జున గారు చేసిన సూచన మేరకు కెప్టెన్ ఆమెకు చెప్పిన పనులన్నీ నన్ను చేయమని చెప్పింది. ఈ క్రమంలో ఒక రోజంతా నాకు పనిష్మెంట్ ఇవ్వమని చెప్పారు.
అందుకు మీకు హక్కు ఉంది. ఐదు రోజులు చేయటం కుదరదని చెప్పా.. దీంతో అక్కడ మా మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత నేనే ఆమె దగ్గరికి వెళ్లి ఎన్ని రోజులైనా మీరు చెప్పింది చేస్తానని అన్నాను అంటూ పూజతో గొడవ పై టేస్టీ తేజ క్లారిటీ ఇవ్వటం జరిగింది. నేను నామినేట్ చేయడం వల్ల నలుగురు బయటకు వెళ్లారు అనటం కూడా సరికాదు. ఈ క్రమంలో సందీప్ మాస్టర్ నామినేషన్స్ పై కూడా టేస్టీ తేజ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. సడన్ గా నామినేషన్ లోకి వెళ్తే.. బెటర్ అనే అభిప్రాయం ఆయన తన వద్ద డిస్కషన్ చేసినట్లు చెప్పుకొచ్చారు.