NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo: నిజం తెలిసిన తర్వాత షాక్ అయిన రుక్మిణి….

Madhuranagarilo Today Episode February 11 2024 Episode 284 Highlights

Madhuranagarilo : రాధ ప్రెగ్నెంటో కాదో అని రుక్మిణికి అనుమానం వచ్చినట్టుంది అందుకే చెకప్ కి తీసుకెళ్లినట్టుంది అని శ్యామ్ అనుకుంటాడు. అయితే నేను కూడా రాధ దగ్గరికి వెళ్తాను అని శ్యామ్ అంటాడు. రుక్మిణి వెళ్ళింది కదరా నువ్వెందుకు అని మధుర అంటుంది. రుక్మిణి వెళ్ళింది కాబట్టే నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు శ్యామ్. శ్యామ్ కృష్ణ కి ఫోన్ చేసి రాధ మీ హాస్పిటల్ కి వచ్చిందా అని అడుగుతాడు. ఏం జరిగింది అని కృష్ణ అడుగుతుంది. చెకప్ కోసం రాధని మీ హాస్పిటల్ కి తీసుకు వచ్చిందని రుక్మిణి చెప్పింది మీ హాస్పిటల్ కి రాలేదంటే కచ్చితంగా రాధని వేరే హాస్పటల్ కి తీసుకెళ్లి ప్రెగ్నెంట్ టెస్ట్ చేపిస్తుంది అని అంటాడు శ్యామ్. మనం చెప్పింది అబద్ధం అని తెలిస్తే రాధ వెంటనే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని శ్యామ్ చెప్తాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటుంది. కృష్ణ రాధకి ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతుంది.

Madhuranagarilo Today Episode February 11 2024 Episode 284 Highlights
Madhuranagarilo Today Episode February 11 2024 Episode 284 Highlights

హాస్పటల్లో ఉన్నాను అని రాధ చెప్తుంది. హాస్పిటల్ కి ఎందుకు వెళ్లావు అని అడుగుతుంది కృష్ణ. నేను ప్రెగ్నెంట్ అయిన విషయం నిజమా అబద్దమా అని తెలుసుకోవడానికి వచ్చాను అని అంటుంది రాధ. ఏ హాస్పిటల్ కి వెళ్లావు అని అడుగుతుంది కృష్ణ. ఏ హాస్పిటల్ అయితే నీకెందుకు రిజల్ట్ వచ్చాక నేనే చెప్తాను అని ఫోన్ కట్ చేస్తుంది రాధ. శ్యామ్ రుక్మిణికి ఫోన్ చేసి ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. నేనేం చేశాను అని అడుగుతుంది రుక్మిణి. రాధని చెకప్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్లావ్ అంట అని అంటాడు శ్యామ్. రాధకే తెలియకుండా తను ప్రెగ్నెంట్ అయింది అని చెప్పగానే నమ్మడానికి నేను రాధను అనుకున్నావా నువ్వు చెప్పింది అబద్ధం అని తెలియజేయడానికే తనని చెకప్ కి తీసుకొచ్చాను ఇప్పుడే రాధా ల్యాబ్ లోకి వెళ్ళింది కాసేపటి తర్వాత రిజల్ట్ వస్తుంది నీ బండారం బయటపడుతుంది కేవలం రాధని ఆపటం కోసమే నువ్వు ఈ ప్రెగ్నెన్సీ నాటకం ఆడావని తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా ఆ పరిణామం దగ్గర నుంచి అనుభవించడానికి రెడీగా ఉండు అని రుక్మిణి ఫోన్ కట్ చేస్తుంది.

Madhuranagarilo Today Episode February 11 2024 Episode 284 Highlights
Madhuranagarilo Today Episode February 11 2024 Episode 284 Highlights

ఈ ప్రెగ్నెన్సీ నాటకం రాధకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని అనుకుంటాడు శ్యామ్. రాధ ల్యాబ్ లో నుండి బయటికి వస్తుంది. రాధ ఏమైంది ఏమన్నారు అని అడుగుతుంది రుక్మిణి. టైం పడుతుందన్నారు కొంచెంసేపు కూర్చుందాము అని అంటుంది రాధ. శ్యామ్ రాధ వాళ్లు వచ్చిన హాస్పిటల్ కి వస్తాడు. శ్యామ్ ని చూసి రుక్మిణి షాక్ అవుతుంది. ఏంటి అంత కోపంగా చూస్తున్నారు రాననుకున్నారా రాలేను అనుకున్నారా అని శ్యామ్ అడుగుతాడు.రాకూడదు అనుకున్నాను అని రుక్మిణి తన మనసులో అనుకుంటుంది. తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ కృష్ణ చెప్పింది గుడ్డిగా నమ్మేయడం మా చెల్లెలికి ఇష్టం లేదు అందుకే నీకు తెలియకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని ఈ హాస్పిటల్ కి వచ్చాం అని రుక్మిణి చెప్తుంది. డాక్టర్ రాధ వాళ్ళని లోపలికి పిలుస్తారు. మీరెవరు అని అడుగుతుంది డాక్టర్ శ్యామ్ ని. తను నా భర్త అని రుక్మిణి చెప్తుంది.మీ భార్య లాగా మీరు కూడా మీ మరదలు ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం కంగారు పడుతున్నట్టు ఉన్నారు అని అంటుంది డాక్టర్. తను నా మరదలు కాదు నా భార్య అని చెప్తాడు శ్యామ్. ఇవన్నీ మీకు ఎందుకు రిపోర్ట్స్ గురించి చెప్పండి అని అంటుంది రుక్మిణి. తను గర్భవతి అని డాక్టర్ చెప్తుంది.

Madhuranagarilo Today Episode February 11 2024 Episode 284 Highlights
Madhuranagarilo Today Episode February 11 2024 Episode 284 Highlights

అది విన్న రుక్మిణి షాక్ అయిపోతుంది. డాక్టర్ రాధని జాగ్రత్తగా ఏ పని చేయకుండా బరువులు మోయకుండా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండమని చెప్తుంది. రెండు వారాల తర్వాత మళ్లీ చెకప్ చేయడానికి రావాలి అని చెప్తుంది డాక్టర్. రుక్మిణి నువ్వు ఆటోలో వెళ్ళు నేను రాధ తర్వాత వస్తాము అని శ్యామ్ అంటాడు. నేను ఎందుకు వెళ్లడం ముగ్గురం కలిసి వెళ్దాం అని అంటుంది రుక్మిణి. నాకు కొంచెం పనుంది చూసుకొని వస్తాను అని అంటాడు శ్యామ్.అయితే నువ్వు వెళ్ళు నేను రాధ ఇంటికి వెళ్ళిపోతాం అని అంటుంది రుక్మిణి.ఏం పని సార్ అని అడుగుతుంది రాధ. కొన్ని పనులు చేయకముందు చెప్పాలి కొన్ని చేసిన తర్వాత చెప్పాలి ఇంకొన్ని చేసేటప్పుడు చెప్పాలి అని అంటాడు శ్యామ్.

Madhuranagarilo Today Episode February 11 2024 Episode 284 Highlights
Madhuranagarilo Today Episode February 11 2024 Episode 284 Highlights

ఇది చేయకముందు చెప్పాల్సిన పనా చేసేటప్పుడు చెప్పాల్సిన పనా అని అడుగుతుంది రుక్మిణి. అది రాధకు తెలిస్తే చాలు నీకు అవసరం లేదు నువ్వు ఆటోలో వెళ్లిపో అని అంటాడు శ్యామ్. ఒక ఫోన్ కాల్ చేసుకొని వస్తాను మీరు పదండి అని శ్యామ్ పక్కకు వెళ్లి కృష్ణకు ఫోన్ చేస్తాడు. నీకు రాధ వాళ్ళు ఈ హాస్పిటల్ లో ఉన్నారని ఎలా తెలుసు అని అడుగుతాడు శ్యామ్.

Madhuranagarilo Today Episode February 11 2024 Episode 284 Highlights
Madhuranagarilo Today Episode February 11 2024 Episode 284 Highlights

మా ఆయన పోలీస్ ఆఫీసర్ వాళ్ళు వెళ్లిన బండి నెంబర్ చెప్తే ట్రేస్ చేసి వాళ్ళు ఏ హాస్పిటల్ కి వెళ్లారో చెప్పారు అని కృష్ణ చెప్తుంది. డాక్టర్ కాత్యాయని గారు నాకు తెలుసు కాబట్టి విషయం అంత చెప్పాను అని కృష్ణ చెప్తుంది. నువ్వు గనక ఆ పని చేసి ఉండకపోతే ఈరోజు మన పని అయిపోయేది కృష్ణ చాలా థాంక్స్ అని శ్యామ్ ఫోన్ కట్ చేస్తాడు.రాధ శ్యామ్ కారులో వెళ్లిపోతారు.

Related posts

Krishna Mukunda Murari May 30 Episode 483: మీరానే ముకుందా అన్న నిజం ప్రభాకర్ కి తెలియనుందా? ఆదర్శ్ మీద భవాని కోపం.. మురారి కోసం రంగంలోకి పోలీసులు..

bharani jella

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri