Aishwarya: ప్రపంచాన్ని ఏలిన ముద్దుగుమ్మ ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుత కాలంలో కూడా ఈ ముద్దుగుమ్మ కి ఉన్న క్రేజ్ మరే హీరోయిన్ కి ఉండదని చెప్పొచ్చు. అంతటి పాపులారిటీని సంపాదించుకుంది మరి ఐశ్వర్య రాయ్. ఇక తాజాగా ఐశ్వర్య గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఈమెకి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ఘోర అవమానం జరిగిందట.
ఇప్పటివరకు అనేక భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. 1999లో రిలీజ్ అయిన నాగార్జున రావోయి చందమామ సినిమాలో ఓ పాటలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. కానీ హీరోయిన్ గా మాత్రం తెలుగులో అస్సలు నటించలేదు. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.
అయితే వెంకటేష్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మూవీలలో ప్రేమించుకుందాం.. రా సినిమా ఒకటి. ఈ మూవీను దాదాపు అందరూ చూసే ఉంటారు. ఇక ఈ సినిమా హీరోయిన్గా అంజలా కంటే ముందు ఐశ్వర్య రాయిని అనుకున్నారట దర్శకుడు జయంత్ సి. పరాన్జీ. ఇదే విషయాన్ని నిర్మాత తో పాటు చిత్ర యూనిట్ కి తెలియజేశారు.
కానీ ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ఎవ్వరూ ఓకే చెప్పలేదట. ఎందుకంటే ఆ సమయంలో ఐశ్వర్య నటించిన ఇరువురు మూవీ దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఈ క్రమంలోనే అలాంటి ఫ్లాప్ హీరోయిన్ తో ఈ సినిమాని తీయవద్దు అని ఆమెని రిజెక్ట్ చేశారట. ఇక ప్రస్తుతం ఈమె రేంజ్ చూసి వాళ్లకి కళ్ళు చెదురుతాయేమో.. అప్పుడు రిజెక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వాళ్లని రిజెక్ట్ చేసే స్థాయికి ఎదిగింది.