NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 20 2023 Episode 1130: అక్కి  అభాయ్ కి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఎవరో తెలిసిపోతుందా?..

Prema Entha Madhuram Today Episode December 20 2023 Episode 1130 Highlights

Prema Entha Madhuram December 20 2023 Episode 1130: అక్కి అభయ్ స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ ఉంటారు. దారిలో జోగమ్మ ఒకరికి సోది చెప్తూ కనిపిస్తుంది. అన్నయ్య ఈవిడ చుస్తే అందరికీ మంచి చెప్తుంది మనం కూడా మన నాన్న గురించి అడుగుదామా ఏమైనా చెప్తుందేమో అని అక్కి అంటుంది. అలాగే అక్కి వెళ్లి పూలు తీసుకొని ఆ జోగమ్మని మన నాన్న ఎక్కడ ఉన్నాడో అడుగుదాము అని ఆభయ్ అంటాడు. పిల్లలు ఒక పూల ప్యాకెట్ తీసుకొని వెళ్లి రేణుక ఎల్లమ్మ తల్లి దగ్గర పూలు పెడతారు. అమ్మ మా నాన్న ఎక్కడ ఉన్నాడు మేము తెలుసుకునేలా చేయి అని నమస్కారం పెట్టుకుంటారు. ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి అని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంది జోగమ్మ అందులో  ఆర్య అను ఈ పిల్లల తండ్రి అని జోక్ అమ్మకి కనిపిస్తారు. కళ్ళ ముందు కనపడుతున్న గమనించలేకపోతున్నారు మీరు వెతుకుతున్న మీ తండ్రి మీకు కనపడతాడు తండ్రి కోసం తల్లడిల్లుతున్నారా అని జోగమ్మ అంటుంది. అవును మా నాన్న ఎక్కడ ఉన్నాడో చెప్పమ్మా అని అక్కి అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 20 2023 Episode 1130 Highlights
Prema Entha Madhuram Today Episode December 20 2023 Episode 1130 Highlights

మీ తండ్రి ఎక్కడ ఉన్నాడో మీరే కనిపెడతారు చల్లగా ఉండండి అని ఆశీర్వదిచ్చి బొట్టు పెడుతుంది జోగమ్మ. అంటే నిజంగానే మా నాన్న మాకు దొరుకుతాడా అని అభయ్ అక్కి అడుగుతారు. అమ్మ ఆజ్ఞ ఇచ్చింది ఇక మీ ప్రయత్నం మీరు చేయండి మీ నాన్న కచ్చితంగా దొరుకుతాడు అని జోగమ్మ చెప్తుంది. పిల్లలిద్దరూ ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కట్ చేస్తే, అయ్యప్ప స్వామి మాల వేసుకుని అనువల నాన్న రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అతని చూసి అభాయ్ అక్కి దగ్గరికి వెళ్లి తాతయ్య నీకేమైంది లే అని లేపుతారు. ఆ స్వామి కళ్ళు తెరవక పోయేసరికి అభాయ్ తన దగ్గర ఉన్న నీళ్లు తీసి మొహాన చల్లుతాడు. స్వామి కళ్ళు తెరుచుకొని మీరెవరమ్మా నన్ను కాపాడినందుకు మీకు చాలా థాంక్స్ అని అంటాడు సుబ్బు. తాతయ్య ఎందుకిలా కింద పడిపోయారు నీకు ఒంట్లో బాగోలేదా అని అడుగుతుంది అక్కి. ఏమీ లేదమ్మా అయ్యప్ప మాల వేసుకున్నాను కదా ఉపవాసం ఉన్నాను గుడికి వెళ్ళొస్తుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయాను నాకు ఆరోగ్యం బాగానే ఉంది అని సుబ్బు అంటాడు. సరే తాతయ్య మీ ఇల్లు ఎక్కడో చెప్పండి మిమ్మల్ని అక్కడిదాకా తీసుకువెళ్తాము అని పిల్లలు అంటారు.

Prema Entha Madhuram Today Episode December 20 2023 Episode 1130 Highlights
Prema Entha Madhuram Today Episode December 20 2023 Episode 1130 Highlights

వద్దులే అమ్మ నేను ఒక్కని వెళ్లగలను మీరు ఇంటికి వెళ్ళండి అని సుబ్రహ్మణ్యం అంటాడు. అయ్యో తాతయ్య ఇప్పటికే మీరు నీరసంగా ఉన్నారు మళ్లీ దారిలో కళ్ళు తిరిగి పడిపోతే ఎలాగా మీ ఇంటి  దాకా వస్తాము పదండి అని పిల్లలు తీసుకుని వెళ్తారు. కట్ చేస్తే, సుబ్బు స్వామి పొద్దున అనగా గుడికి వెళ్ళాడు ఇంకా రాలేదు అని పద్మావతి ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో పిల్లలు స్వామిని తీసుకొని వస్తారు. స్వామి ఎక్కడికి వెళ్లారు ఇంతసేపు గుడికి వెళ్లారా అని అంటుంది పద్మావతి. అయ్యో స్వామి కళ్ళు తిరిగే కింద పడిపోయాడు మేము తీసుకొస్తున్నాము అని అక్కి అంటుంది. అవునా స్వామి మీకేం దెబ్బలేమి తగలలేదు కదా అని కంగారు పడుతూ అడుగుతుంది పద్మావతి. నాకేం కాలేదు లే మాత నువ్వేం కంగారు పడకు అని సుబ్రహ్మణ్యం అంటాడు. స్వామిని అలాగే నిలబెట్టి మాట్లాడుతున్నారు తనకు ఏదైనా టిఫిన్ పెట్టొచ్చు కదా పెద్దవాళ్ళు మీరు మీకు కూడా నేనే చెప్పాలా అని అంటుంది అక్కి. అచ్చం నువ్వు మా అమ్మాయి లాగానే మాట్లాడుతున్నావు అమ్మ మా బుజ్జమ్మ కూడా కోపం వస్తే ఇలాగే మాట్లాడేది కదా అండి అని అంటుంది పద్మావతి.

Prema Entha Madhuram Today Episode December 20 2023 Episode 1130 Highlights
Prema Entha Madhuram Today Episode December 20 2023 Episode 1130 Highlights

ఇంకా అలాగే మాట్లాడుతున్నారు ముందు తాతయ్యకి టిఫిన్ పెట్టండి అని అక్కి అంటుంది. అయ్యో పర్వాలేదు నేను తెస్తాను కానీ మీరు కూర్చోండి మా స్వామిని కాపాడినందుకు చాలా థాంక్స్ అని పద్మావతి అంటుంది. మనిషి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయాలని మా అమ్మ చెప్పింది దానికి ఎందుకండి మీరు థాంక్స్ చెప్పడం అని అభయ్ అంటాడు. ఇంత చిన్న వయసులోనే అంత సంస్కారం నేర్పిన మీ అమ్మ ఎంత అదృష్టవంతురాలు అని పద్మావతి అంటుంది. పద్మావతి పిల్లలకి ఏదన్నా స్వీట్ పెట్టు అని సుబ్రహ్మణ్యం అంటాడు. అలాగే అని పద్మావతి కిచెన్ లోకి వెళుతుంది. పిల్లలు అక్కడ కూర్చొని అంతా చూస్తూ ఉంటారు. ఇంతలో పద్మావతి సున్నుండలు తీసుకువచ్చి పిల్లలకు ఇస్తుంది. నాకు సున్నుండలు అంటే చాలా ఇష్టం ఇంకొకటి ఇవ్వు అని అక్కి అంటుంది. పద్మావతి అక్కి అన్న మాటకి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావ్  ఇంకో సున్నుండ ఇవ్వమన్నందుకా అని అక్కి అంటుంది. మా అమ్మాయికి కూడా సున్నుండలు అంటే చాలా ఇష్టం అందుకే అలా బాధపడుతుంది అమ్మ మీరు ఏమీ అనుకోకండి అని సుబ్రహ్మణ్యం అంటాడు. అంటే మీ అమ్మాయి మితో పాటు లేదా అని అడుగుతుంది అక్కి.

Prema Entha Madhuram Today Episode December 20 2023 Episode 1130 Highlights
Prema Entha Madhuram Today Episode December 20 2023 Episode 1130 Highlights

లేదమ్మా మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయింది మేము అనాధల్లా ఉంటున్నాం అని పద్మావతి అంటుంది. చిన్నప్పుడు మా బుజ్జమ్మ కూడా నీలాగే మాట్లాడేది అచ్చం నువ్వు మా అమ్మాయి లాగే మాట్లాడుతున్నావ్ మా అమ్మాయి లాగే ఉన్నావు అని పద్మావతి అంటుంది. మా అమ్మ లాగా ఉంటానని అందరూ అంటారు మీ అమ్మాయిలాగా నేనెందుకు ఉంటాను అని అక్కి అంటుంది. అయితే మీ అమ్మే మా అమ్మి లాగా ఉందేమో అని పద్మావతి అంటుంది. మీ అమ్మాయి ఫోటో ఒకసారి చూపించండి మా అమ్మ లాగా ఉందో లేదో చెప్తాను అని అక్కి అంటుంది. అదిగో మా అమ్మాయి ఫోటో అని చూపెడతారు పద్మావతి. అను ఫోటో ని చూసి అభయ్ అక్కి షాక్ అయిపోతారు.అక్కి మా అమ్మని చెప్పబోతూ ఉండగా అభయ్ అక్కి అమ్మ మన విషయాలు ఎవరికీ చెప్పొద్దు అన్నది కదా అమ్మ కు  మాట ఇచ్చావు చెప్పకు అని అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 20 2023 Episode 1130 Highlights
Prema Entha Madhuram Today Episode December 20 2023 Episode 1130 Highlights

అంటే మీ అమ్మాయి ఎక్కడ ఉందో ఏం చేస్తుందో మీ అమ్మాయి పిల్లల్ని మీరు ఇంతవరకు చూడలేదా అని అడుగుతుంది అక్కి.చూడలేదమ్మా మా అమ్మాయి పిల్లలు కూడా మీ అంత వయసే ఉంటుంది అని పద్మావతి ఏడుస్తుంది. ఊరుకో పద్మావతి ఏదో ఒక రోజు భగవంతుడు మనల్ని పిల్లల్ని కలుపుతాడు అని సుబ్రహ్మణ్యం అంటాడు. అన్నయ్య వీళ్లు మనకి అమ్మమ్మ తాతయ్య అవుతారు అనుకుంటా వీళ్ళ దగ్గర నాన్న ఫోటో ఉందేమో అడుగుదామా అని అక్కి అంటుంది. మీ అమ్మాయి ఫోటోలు ఇంకా ఏమైనా ఉన్నాయా నాకు చూపిస్తారా అని అక్కి అంటుంది. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మా అమ్మాయిని ఫోటో దించే వాళ్ళ మామ చాలా ఉన్నాయి అని పద్మావతి ఆల్బమ్ తెచ్చి ఇస్తుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

bharani jella

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella