NewsOrbit
న్యూస్

నేరం ఎన్నటికి దాగదు

చెన్నై, ఫిబ్రవరి 7: తల లేని మొండెం శరీర భాగలపై ఉన్న పచ్చబొట్టు, గాజుల అధారంగా కేసు దర్యాప్తు చేసి హత్య కేసు నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. హత్య జరిగిన రెండు వారాల్లోనే పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది.

చెన్నైలో సినీ నిర్మాత బాలకృష్ణకు 2000సంవత్సంలో సంధ్య (37) అనే మహిళతో వివాహం జరిగింది. ఏడాది నుంచి వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. భార్యపై అనుమానం పెంచుకున్న బాలకృష్ణ జనవరి 19వ తేదీన అతి కిరాతకంగా భార్యను హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టి చెన్నైలోని వివిధ ప్రదేశాల్లో పడవేశాడు. తల లేకుండా మొండెం పోలీసులకు దొరికినా తాను పట్టుబడడం జరగదని ఆతని భావన.

పోలీసులు గత నెల డంపింగ్ యార్డ్‌లో ఒక మహిళకు సంబంధించిన శరీర భాగాలు తల లేకుండా కనుగొన్నారు. ఆ మృతదేహం ఎవరిది అనేది తెలుసుకునేందుకు పోలీసులు  తీవ్రంగా శ్రమించారు. వారికి శరీర భాగాలపై శివ, పార్వతుల ఆకృతిలో ఉన్న పచ్చబొట్టు, అక్కడ లభించిన గాజుల ఒక్కటే ఆధారం. ఆ మాత్రం క్లూ చాలనుకుని మహిళ ఎవరో గుర్తించే పనిలో పడ్డారు.

పోలీసుల దర్యాప్తులో సినీ నిర్మాత బాలకృష్ణ భార్య సంధ్య రెండు వారాలుగా కనిపించకుండా పోయిన విషయం బయటకు వచ్చింది. అనుమానంతో బాలకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిదైన పద్ధతిలో విచారణ చేశారు. చేసిన నేరాన్ని బాలకృష్ణ పోలీసుల ముందు అంగీకరించాడు. సంధ్య తల పడవేసిన ప్రదేశం దగ్గరకు కూడా తీసుకువెళ్లాడు. పోలీసులు తలను కూడా సేకరించి కేసు తేల్చారు. బాలకృష్ణను బుధవారం అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు.

గతంలో బాలకృష్ణ నిర్మాణ దర్శకత్వం వహించి ‘కాదల్ ఇలావనం’ అనే సినిమా తీశారు. మరో చిత్ర నిర్మాణం చేసేందుకు పుట్టింటి నుండి పెద్ద ఎత్తున డబ్బు తీసుకురావాలని భార్య సంధ్యను డిమాండే చేశాడు. దీనిపై సంధ్య ఇంటి నుండి బయటకు వెళ్లి గృహహింస చట్టం కింద గత ఏడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి పంపారు.

 

Related posts

ష‌ర్మిల గెలిస్తే క‌ష్ట‌మే… వైసీపీలో ఇదో కొత్త‌ టెన్ష‌న్‌…!

హిందూపురంపై బెట్టింగులు.. బాల‌య్య‌పై కాదు బ్రో..?

గ‌న్న‌వ‌రం ‘ వంశీ ‘ మాస్ట‌ర్ ప్లాన్‌.. ఇంత పెద్ద స్కెచ్ వేసుకుని రెడీ అయ్యారా ?

వైసీపీలో తండ్రి – త‌నయుల ఫైట్‌.. ఎవరు గెలుస్తారు? ఎవ‌రు ఓడతారు?

BSV Newsorbit Politics Desk

వైసీపీ ఆశ‌లు.. మ‌హిళ‌లు + అవ్వాతాత‌లు = గెలిచేనా.. ?

CM Revanth Reddy: కీరవాణి స్టూడియోకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి .. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు

sharma somaraju

Poll Violence In Tadipatri: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీపై వేటు

sharma somaraju

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Leave a Comment