NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు అంటే… మోడీ పెట్టిన టార్గెట్ ఇదే..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుని కేంద్రంలో కొలువు దీరాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న టార్గెట్ 370 స్థానాల‌ను పెట్టుకున్నారు. దేశ‌వ్యా ప్తంగా 370 పార్ల‌మెంటు స్థానాల్లో బీజేపీనే ఒంట‌రిగా 370 సీట్లు ద‌క్కించుకోవాల‌న్న‌ది మోడీ ప్లాన్. ఈ క్ర‌మం లో దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పార్ల‌మెంటు సీట్ల‌ను గుండుగ‌త్త‌గా గెలుచుకోవాల‌ని ప్ర‌ధాని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 80 పార్ల‌మెంటు స్థానాలు ఉన్న‌యూపీలో గెలుస్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు.

తాజాగా ఢిల్లీలో రెండు రోజుల పాటు నిర్వ‌హించిన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌తి రాష్ట్ర బీజేపీ చీఫ్‌తోనూ ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప‌రిస్థితిని తెలుసుకున్నారు. అదేస‌మ‌యంలో ఆయ‌న త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పేశారు. మీమీ రాష్ట్రాల్లో నాకు ఇన్ని సీట్లు కావాలి.. మ‌న‌కు ఇన్ని సీట్లు రావాలి.. అని తేల్చిచెప్పారు. క్ర‌మంలో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్‌లతోనూ మోడీ ప్ర‌త్యేకంగా రెండేసి నిమిషాల‌పాటు భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ సార‌థి.. కేంద్ర మంత్రికిష‌న్ రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పుంర‌దేశ్వ‌రిలతోనూ మోడీ చ‌ర్చ‌ల‌కు దిగారు.

ఈ క్ర‌మంలో తెలంగాణ‌, ఏపీల‌లో క‌లిపి మొత్తంగా 20 పార్లమెంటు స్థానాలు నాకు గిఫ్టుగా ఇవ్వాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చెప్పిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. `మీరు ఏమైనా చేయండి. ప్ర‌జ‌ల్లోకి వెళ్లండి. మీ చ‌రిష్మా, నా చ‌రిష్మా ఏది వినియోగించినా ఫ‌ర్వాలేదు. 20 సీట్లు కావాలి` అని మోడీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ‌లో ఎక్కువ‌గా దృష్టి పెట్టాల‌ని కిష‌న్ రెడ్డికి హిత‌వు ప‌లికిన‌ట్టు స‌మాచారం. గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఇచ్చామ‌ని, రైల్వే లైన్ల‌ను పెంచామ‌ని.. అనేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నామ‌ని.. వీటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌ని ఆయ‌న సూచించారు.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. పొత్తుల విష‌యాన్ని ప్ర‌స్తావించ‌కుండా.. పురందేశ్వ‌రికి గ‌ట్టి టార్గెట్ పెట్టిన‌ట్టు స‌మా చారం. ఏపీలో 25 పార్ల‌మెంటు స్థానాల్లో 12 నుంచి 10 గెల‌వ‌లేరా? అని ప్ర‌శ్నించిన మోడీ పురందేశ్వ‌రిని డిఫెన్స్‌లో కి నెట్టేసిన‌ట్టు తెలిసింది. దీనికి ఆమె ఔన‌న‌లేక‌.. కాద‌న‌లేక‌.. స‌రేన‌ని త‌లూపార‌ని స‌మాచారం. తెలంగాణ‌లో 17, ఏపీలో 25 స్థానాలు ఉన్నాయ‌ని.. వీటిలో త‌న‌కు గిఫ్టుగా 20 స్థానాలు ఇవ్వాల‌ని తేల్చి చెప్పిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒక్క రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా ఇదే టార్గెట్ పెట్టిన‌ట్టు తెలిసింది. మ‌రి తెలుగు రాష్ట్రాల‌బీజేపీ నేత‌లు ఏం చేస్తారో చూడాలి.

Related posts

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

sharma somaraju

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ..అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణీకుల దించివేత

sharma somaraju

వైవీ. సుబ్బారెడ్డి VS బొత్స‌.. ఇలా జ‌రిగితే పేద్ద ర‌చ్చ రంబోలానే..?

‘ పిన్నెల్లి ‘ ఎపిసోడ్ వైసీపీకి ఎంత దెబ్బ కొట్టిందంటే…?

బాబుకు-జ‌గ‌న్‌, జ‌గ‌న్‌కు-ష‌ర్మిల మామూలు దెబ్బ కొట్ట‌లేదుగా…?