NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

Supreme Court: సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట లభించింది. ఈవీఎం – వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నమోదైన ఓట్లతో వంద శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు  వెలవరించింది.  

ఈ పిటిషన్ లపై ఇటీవల సుప్రీంకోర్టులో విస్తృతంగా విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రోటోకాల్ లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి ధర్మాసనం పలు ప్రశ్నలను సందించింది. ఈసీ నుండి సమగ్ర వివరణ తీసుకుంది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం .. పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్లు సహా అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

ఈ  సందర్భంగా ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ ను సీల్ చేయాలని తెలిపింది. దాన్ని కనీసం 45 రోజుల  పాటు భద్రపరచాలని సూచించింది. పలితాల విడుదల తర్వాత అభ్యర్ధులు ఏడు రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంది. అప్పుడు ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమోరీని తనిఖీ చేయాలని తెలిపింది. ఈ వెరిఫికేషన్ కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్ధులే భరించాలని వెల్లడించింది. ఒక వేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే ..ఖర్చులు తిరిగి ఇవ్వాలని సూచించింది.

ఈ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం..అనవసర అనుమానాలకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక కౌంటింగ్ సమయంలో పేపర్ స్లిప్ లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మెషిన్ ను ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని జస్టిస్ ఖన్నా ఈసీకి తెలిపారు. అంతే కాకుండా ప్రతి పార్టీ పక్కన  గుర్తుతో  పాటు బార్ కోడ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

ప్రస్తుతం ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో అయిదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది సులభం కాదని ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది.

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

Related posts

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ పై తీర్పు రిజర్వ్

sharma somaraju

Actress Hema: బెంగళూరు పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా .. హజరుకాలేనంటూ లేఖ

sharma somaraju

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి

sharma somaraju

Graduate MLC Election 2024: తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

sharma somaraju

ఏపీ ఎన్నిక‌లు: ప్ర‌మాదంలో ఎగ్జిట్ పోల్స్ ఎందుకు… ?

Swati Maliwal: కోర్టులోనే కన్నీళ్లపర్యంతమైన రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ .. బిభవ్ కుమార్ బెయిల్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Road Accidents: ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు .. 11 మంది మృతి

sharma somaraju

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

ఏపీ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి

sharma somaraju

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Arvind Kejriwal: బెయిల్ పొడిగించాలంటూ కేజ్రీవాల్ పిటిషన్

sharma somaraju

ష‌ర్మిల గెలిస్తే క‌ష్ట‌మే… వైసీపీలో ఇదో కొత్త‌ టెన్ష‌న్‌…!