NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో… పెను ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా టిడిపి నేత వర్మ ప్రచారం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు మరవక ముందే సీన్ లోకి మహాసేన రాజేష్ రంగంలోకి దిగాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కట్టప్ప గా మారిపోయాడు మహాసేన రాజేష్. జనసేన ఎక్కడ పోటీ చేసినా కూడా తాము ఓడిస్తామని ప్రకటించేశారు. పవన్ కళ్యాణ్ కంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా బెటర్ అని… 100 రేట్లు చాలా మంచోడు అంటూ కితాబ్ ఇచ్చారు. దీంతో మహాసేన రాజేష్ వ్యవహారం కూటమికి తలపోటుగా మారిపోయింది. మొన్నటి వరకు కూటమికి అనుకూలంగా పనిచేసిన మహాసేన రాజేష్… ఎన్నికల కంటే ముందే యూటర్న్ తీసుకున్నాడు.

మొన్న ప్రధాని నరేంద్ర మోడీ సభలో… జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మహాసేన రాజేష్ కు నచ్చలేదట. తమ దళిత వర్గాన్ని నొప్పించేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారట. దళితులకు అన్యాయం చేస్తున్న బిజెపికి 400 పైగా సీట్లు వచ్చేలా తాను కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం మహాసేన రాజేష్కు ఏమాత్రం నచ్చలేదట. దీంతో దళిత వర్గాలకు కీలక పిలుపు ఇచ్చాడు రాజేష్. జనసేన అభ్యర్థులు ఎక్కడ ఉన్న అక్కడ దళితులందరూ కలిసి ఓడించాలని పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశాడు మహాసేన రాజేష్. పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్న తర్వాత టిడిపి గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని… 144 సీట్లు గెలవాల్సిన టిడిపి.. ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి ఉన్నట్లు రాజేష్ చెప్పబచ్చారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదకరమంటూ వ్యాఖ్యానించారు. అయితే దీన్ని వైసిపి మాత్రం చాలా డిఫరెంట్ గా ప్రచారం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఏపీలో ఓడిపోయే పరిస్థితి నెలకొందని… అందుకే నారా లోకేష్ ఇలాంటి నాటకాలు ఆడిస్తున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది వైసిపి.

ఇప్పటినుంచే జనసేన పైన నేరం మోపాలనే ఉద్దేశంతో… మహాసేన రాజేష్ తో ఈ నాటకాలు ఆడిస్తున్నారని ప్రచారం చేస్తోంది. ఒకవేళ ఎన్నికల తర్వాత తెలుగుదేశం కూటమి ఓడిపోయిన కూడా… జనసేన కారణంగా ఓడిపోయిందని నెట్టి వేయచ్చనే ఉద్దేశంతో… ఇలా వీడియోలు చేపిస్తున్నారని వైసీపీ జోరుగా ప్రచారం చేస్తోంది. ఏది ఏమైనా తాజాగా మహాసేన రాజేష్ చేసిన వీడియో పవన్ కళ్యాణ్ పార్టీకి తీవ్ర దెబ్బ అని చెప్పవచ్చు. ఓవరాల్ కూటమి కి కూడా నష్టం చేకూర్చుతుందని అంటున్నారు. మరి దీన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా తీసుకుంటారో చూడాలి.

Related posts

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N