Madhuranagarilo October 16th ఎపిసోడ్ 184: వాళ్లకి బాగా బుద్ధి చెప్పావు శ్యామ్ అలాంటి వాళ్ళకి అలానే చెప్పాలి అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. సరే పదండి కేక్ కట్ చేద్దాం అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే అల్లుడు గారి మాటలు వింటుంటే మనసు చాలా మంచిదిలా అనిపిస్తుంది కదండీ అని రాధ వాళ్ళ అమ్మ అంటుంది. స్వప్న పండు ఇందాక ఆడుకుంటానని బయటికి వెళ్లాడు కదా వాడి ఫ్రెండ్ ని వాడిని తీసుకురా అని ధనంజయ్ అంటాడు.అలాగే అంకుల్ అన్ని స్వప్న వెళ్లి పండు ని తీసుకువస్తుంది. రాధా ఇంకా ఎందుకు లేటు ఇంకెవరైనా రావాలా అని శ్యామ్ అంటాడు. అవునండి మా ఫ్రెండ్ శైలజ రావాలి అని రాదా అంటూ ఉండగా శైలజ ఫోన్ చేసి మేము ఇక్కడికి వచ్చాము ఎక్కడ మీ ఇల్లు అని అంటుంది శైలజ. రాధ వెళ్లి వాళ్ళని లోపలికి తీసుకువస్తుంది. రాధా మీరు వెళ్లి కేక్ కట్ చేయండి మేము ఇక్కడ నుంచే చూస్తాము అని శైలజ అంటుంది.

సరే అని రాధ వెళ్లి పండు చేత కేక్ కట్ చేస్తుంది అందరూ హ్యాపీ బర్త్డే టూ యు అని పాట పాడు చప్పట్లు కొడతారు. రాధ పక్కనే శ్యామ్ ను చూసిన శైలజ రాదా మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి ఇలా పక్కకు రండి అని తీసుకువెళ్తుంది. ఏంటి శైలజ ఏదో మాట్లాడాలన్నావ్ ఏంటి చెప్పు అని రాదా అంటుంది. ఇంతలో మధుర వచ్చి రాదా పండు కోసం మనం బట్టలు తెచ్చాము కదా నువ్వు వెళ్లి తీసుకురా అమ్మ అని మధుర అంటుంది. అలాగే అత్తయ్య అని రాధా వెళ్లిపోతుంది. ఏంటమ్మా ఫంక్షన్ అక్కడ జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తున్నావ్ రా అని మధుర వెళ్ళిపోతుంది. రాధా శైలజ తో మాట్లాడదామని వెళ్ళగానే శ్యామ్ వచ్చి రాదా ఇలా రా అని తీసుకెళ్లి ఈయన నాగేశ్వరరావు గారు నా చిన్నప్పుడు స్నేహితుడి వాళ్ళ నాన్న అని పరిచయం చేస్తాడు. మీ జంట చూడముచ్చటగా ఉంది నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని ఆయన ఆశీర్వదిస్తాడు.శైలజ అనే గమనిస్తున్నారాద వాళ్ల అమ్మ శైలజ దగ్గరికి వచ్చి రాధకు ఏదో చెప్పాలని చూస్తున్నావ్ ఏంటమ్మా అని అంటుంది. ఆంటీ మీరు రాధ వాళ్ళ అమ్మగారు అన్ని శైలజ అంటుంది. అవునమ్మా అని రాధ వాళ్ళ అమ్మ అంటుంది.

అంటే రుక్మిణి మీ పెద్ద కూతురా మీ పెద్ద కూతురిని పెళ్లి చేసుకున్నావా ఆడికి మళ్ళీ మీ చిన్న కూతురు అతనికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేశారు అని శైలజ అంటుంది. అనుకోకుండా అది దైవ నిర్ణయం గా జరిగిపోయిందమ్మ మెల్లగా అల్లుడు గారిని అడిగి రుక్మి విషయాలో ఏం జరిగిందో తెలుసుకుందాం అప్పటిదాకా నువ్వు రాధకి ఏమి చెప్పకమ్మా చూస్తూ చూస్తూ తన జీవితాన్ని పాడు చేయడం ఎందుకు అని రాధ వాళ్ళ అమ్మ అంటుంది. రాధ వచ్చి శైలజ ఇందాకే ఏదో చెప్తానన్నావ్ ఏంటి అని అడుగుతుంది. ఏమీ లేదు రాదా మీ జంట చూడముచ్చటగా ఉంది అని శైలజ అంటుంది. థాంక్యూ అని రాదా అంటుంది. ఇక నేను వెళ్తున్నాను ఆఫీసులో పని ఉంది అని శైలజ వెళ్ళిపోతుంది. రాధా నీకు ఒక విషయం చెప్పాలి ఇలా రా అని తీసుకెళ్లి డాక్టర్లని ముగ్గురిని పరిచయం చేసి ఎలాంటి జబ్బునైనా నయం చేసే వాళ్ళు వీళ్ళు ముగ్గురు పండు సంగతి వీళ్ళు చూసుకుంటారు రాధా అని శ్యామ్ అంటాడు.

శ్యామ్ సార్ నిజంగానే పండు గురించి ఎంతలా ఆరాటపడుతున్నాడు తనని నేను దూరం పెడుతున్నాను అని మనసులో పశ్చాత్తాప పడుతుంది. రాధ కూడా అల్లుడు గారిని ఇష్టపడుతున్నట్టు ఉంది కదండి అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇష్టపడేలా చేసి ఉంటాడు ఆ దుర్మార్గుడు అని వాళ్ళ నాన్న అంటాడు. నిజానిజాలు తెలుసుకోకుండా అలా మాట్లాడకండి మన కళ్ళతో చూసేవని నిజాలు కావు కొన్నాళ్ళు మీరు ఓపిక పట్టండి మీకు దండం పెడతాను అని రాధ వాళ్ళ అమ్మ అంటుంది. చ అని రాధ వల నాన్న కోపంగా వెళ్ళిపోతాడు.

స్వప్న వచ్చి చాలా థాంక్స్ పండు కోసం శ్యామ్ ఒక డాక్టర్ని ఏర్పాటు చేసినందుకు అలాగే ఇంకో ట్యాంక్స్ కూడా శామ్ సార్ ని నీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నందుకు అని స్వప్న అంటుంది.నేనెప్పుడూ అలా ఒప్పుకున్నాను అని రాదా అంటుంది. నేను చూశానులే పదిమంది ఉన్నారని చూడకుండా హగ్ చేసుకోవడం ఇంకా ఎందుకే దాస్తున్నావు మనం ప్రేమించే వాళ్ళ కంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టం ఇంకా అతని దూరం పెట్టకు అని స్వప్న వెళ్ళిపోతుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది