Paluke Bangaramayenaa అక్టోబర్ 16 ఎపిసోడ్ 48: నాకు ఏ కష్టం వచ్చినా మనసుకు బాధనిపించిన మా అమ్మతో చెప్పుకునేదాన్ని కానీ ఇప్పుడు అమ్మ నా మాట నమ్మడం లేదు ఆ దుర్మార్గుడ్ నుండి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి నువ్వే నన్ను రక్షించు కృష్ణయ్య అని స్వర అంటుంది. ఏంటమ్మా స్వరా మీ నాన్న మినిస్టర్ అయ్యాడని సంతోషంతో దేవుడికి నమస్కారం చేసుకోవాలి గాని బాధతో దండం పెట్టుకుంటున్నావేంటి అని పూజారి అంటాడు. ఇవి ఆనందంతో వచ్చే కనీళ్లు అని స్వర అంటుంది. అవునా నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు అమ్మ పైకి చెప్పుకోలేని బాధతో మదన పడుతున్నావు అని అనిపిస్తుంది అని పూజారి అంటాడు. ఇంతలో విశాల్ ఫోన్ చేసి ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు ఫోన్ ఎత్తట్లేదు అని అంటాడు. గుడికి వెళ్లాను అని స్వర అంటుంది. అవునా గుడికి వెళ్లేటప్పుడు చాలా ట్రెడిషనల్ గా తయారై ఉంటావే ఏది ఒకసారి వీడియో కాల్ చేయి అని విశాల్ అంటాడు.

నాది టచ్ ఫోన్ కాదు నార్మల్ ఫోన్ అని చెప్పాను కదా అని స్వర అంటుంది. ఏంటి నాతో మాట్లాడడానికి అసహ్యించుకుంటున్నావా అని విశాల్ అంటాడు. నాకు ఆఫీసుకు టైం అవుతుంది నేను ఉంటాను అని స్వర అంటుంది.అయితే నీ పక్కన ఉన్న వాళ్లకి చెప్పు నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళమని అని విశాల్ ఫోన్ కట్ చేస్తాడు. నేను అబి సార్ తో వచ్చానని అనుకుంటున్నాడు ఇంత అనుమానపు రాక్షసున నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది అని స్వర అనుకుంటుంది. కట్ చేస్తే పిల్లిని ఒక గదిలో పెట్టి తాళం వేస్తే అది కూడా తిరగబడుతుంది అభి అలాగే స్వర కూడా ధైర్యంతో తిరగబడితే తనను ఎవరు ఆపలేరు తను ధైర్యం గా విశాల్ లాంటి వాళ్ళని ఎదుర్కొంటుంది అని ఝాన్సీ అంటుంది. నువ్వు స్వర అంత కష్టపడడం ఎందుకు ఝాన్సీ నేను రంగులోకి దిగుతాను అని అబి అంటాడు.

ఇంతలో స్వర అక్కడికి వస్తుంది. స్వర నిన్న నీకు ఫోన్ ఇస్తానని చెప్పాను కదా ఇదిగో ఫోన్ వాడడం నేర్చుకో టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో నేర్చుకో ఇందులో ఆడియో రికార్డు వీడియో రికార్డు అన్నీ ఉన్నాయి వశాల్ మాట్లాడే ప్రతి మాట దీంట్లో రికార్డ్ చెయ్ అని అంటుంది ఝాన్సీ. ఏంటి స్వర భయపడుతున్నావా నువ్వు భయపడితే నాకు చెప్పు నేను చూసుకుంటాను విశాల్ సంగతి అని అభిషేక్ అంటాడు.ఆడవాళ్లు అంటే ఆ వెధవకి ఎంత చిన్నచూపో రోజురోజుకీ నాకు అర్థం అవుతుంది మేడం ఇందుకోసం నాకోసం నేనే పోరాడుతాను ఇకపై ఎవరి సహాయం నేను తీసుకోను నేను తెచ్చే సాక్షాలతో మీరు కేసును గెలవండి వాడిని ఉరికంభం ఎక్కించండి నేను జీవితాన్ని గెలుస్తాను అని స్వర అంటుంది. నీలో ఈ ధైర్యం కోసమే స్వరా మేము ఇన్నాళ్లు ఎదురు చూసింది అని అభిషేక్ ఝాన్సీ చప్పట్లు కొట్టి తనని మెచ్చుకుంటారు.

కట్ చేసే జయంతి వాళ్ళ పెదనాన్న ఇంటికి వచ్చి పెదనాన్న నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు 30 ఏళ్లు రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యేగా పరిపాలన చేశావు కానీ పెద్దమ్మ నిన్ను ఉన్నదాంట్లో చూసుకుంటుంది ఏం లాభం అధికారంలో ఉండి కూడా ఏమీ ఎనకేసుకోలేదు ఈరోజుల్లో వార్డ్ నెంబర్ గా గెలిచిన వాడు కూడా మూడంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు పెదనాన్న చిన్నప్పుడు నేను స్కూలుకు వెళ్తే ఎమ్మెల్యే గారి అమ్మాయి అని అందరూ పొగుడుతుంటే నేను ఎంతో సంతోషించేదాన్ని కానీ నువ్వు నా కూతుర్ని అలా చూడొద్దు అందరితో పాటే చూడండి అని నా ఆనందాన్ని పోగొట్టే వాడివి కానీ పవర్ ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవాలి పెదనాన్న నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రెండో పెళ్లి వాడిని కూతురు ఉన్న వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావు పెదనాన్న అధికారం కోసం రేపు ఎమ్మెల్యే నవ్వుతాను ఆ తరువాత మినిస్టర్ అవుతాను ఆ తర్వాత సీఎం కూడా అవుతాను అధికారం కోసం నేను ఏమైనా చేస్తాను పెదనాన్న అని జయంతి అంటుంది.

జయంతి నీకు ఇష్టం ఉంటే నీకు నచ్చినట్టు బ్రతుకమ్మ లేదంటే చచ్చిపో నిన్ను ఎవరు అడగరు కానీ ఒక్క పని మాత్రం చేసి పెట్టమ్మా నీ భర్త మొదటి భార్య కూతురు ఉంది కదా ఆ పిల్లకి అన్యాయం చేయకమ్మా ఆ అమ్మాయిని చేసుకోబోయే వాడు దుర్మార్గుడు ఇంతకుముందే వాడికి పెళ్లయింది ఆ అమ్మాయిని చంపేశాడు ఆ అమ్మాయి ఎవరో కాదు నా ప్రాణ స్నేహితుడైన విశ్వం కూతురు అ కేసు బయటికి రాకుండా ఇద్దరు లాయర్లు పెట్టుకొని వాడు తిరుగుతున్నాడు అలాంటి వాడిని ఉరికoభo ఎక్కించాలి కానీ అమాయకురాలైన ఆ అమ్మాయి గొంతు కొయ్యకు నువ్వు ఈ ఒక్క మంచి పని చెయ్ నువ్వు చేసే పాపాలకు ఇది ఒక్కటే పరిష్కారం అని వాళ్ళ పెదనాన్న అంటాడు. అలాగే పెదనాన్న వస్తాను అని జయంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.కట్ చేస్తే స్వర విశ్వం వాళ్ళ ఇంటికి వెళ్లి ఇందు గురించి తెలుసుకోవాలి ఇక్కడ తనకు కావలసినవి ఏమైనా ఉన్నాయా బాబాయ్ అని అంటుంది. తనకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ ఏమీ లేవమ్మా అని విశ్వం అంటాడు. బీరువాలో ఉన్నాయేమో అని స్వర బీరువా ఓపెన్ చేస్తుంది అందులో స్థలానికి సంబంధించిన దస్తా విధులు కనిపిస్తాయి బాబాయ్ ఈ దస్తా వీధులు ఏంటి ఇక్కడ పడేసావ్ అని అంటుంది స్వర. ఇవి నా కూతురికి కట్నం కింద రాసించిన ఆ స్థలం దస్తావేజులమ్మ ఇక్కడికి ఎలా వచ్చాయి వాళ్ళ అత్తగారింట్లో ఉండాలి కదా అని విశ్వం అంటాడు. ఇందు ఇక్కడికి వచ్చినప్పుడు తెచ్చిందేమో బాబాయి అని మళ్లీ బీరువా చూస్తుంది స్వర దాంట్లో లెటర్లు దొరుకుతాయి. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.