Madhuranagarilo September 14th Episode: ఇదిగోరా మనవడా నీకు చాక్లెట్ తెచ్చాను మరి నాకేమీ ఇస్తావు అని వాళ్ళ తాతయ్య అంటాడు. నీకు ఒక ముద్దు ఇస్తాను అని పండు అంటాడు. రా తాత నా ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను అని పండు అంటాడు. అలాగే పదరా అని పండు వాళ్ళ తాతయ్య బయటికి వస్తారు. ఇటువంటి సార్ నేను తీసుకు వెళ్తాను అని రాదా అంటుంది. ఎందుకులే రాధా ఇంటిదాకా వచ్చిన వాడిని ఇంట్లోకి రాలేనా నేను తెస్తానులే అని శ్యామ్ అంటాడు ఏం వద్దులేండి సార్ అని రాదా అనగానే శ్యామ్ వెళ్లిపోతాడు. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి అమ్మ రాదా బాగున్నావా అని అంటాడు. బాగానే ఉన్నా నాన్న అమ్మ ఎలా ఉంది అని రాదా అంటుంది. అదిగో నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు పిలుసుకొస్తాను ఉండు తాతయ్య అని పండు అంటాడు.

ఆగు ఎందుకురా అని రాధా అంటుంది.తాతయ్యకి మా ఫ్రెండ్ ను పరిచయం చేయాలమ్మా తీసుకొస్తా ఉండు అని పండు అంటాడు. ఇప్పుడెందుకు రా మళ్లీ వస్తాడుగా అప్పుడు పరిచయం చేదులే పదా అని రాధా అంటుంది. పదరా మనవడా మళ్లీ రేపు వస్తాడు కదా అని వాళ్ళ తాతయ్య అంటాడు. ఇప్పుడు చెప్పండి నాన్న ఎందుకు మీరు వచ్చారు అని రాదా అంటుంది. ఏముందమ్మా నీ పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను కానీ పండు గురించి ఆలోచించి నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు నేను పెళ్ళికొడుకు వాళ్ళతో ముందే పండు గురించి చెప్పి ఒప్పిస్తాను వాళ్లు ఒప్పుకున్నాక ఈ పెళ్లి జరుగుతుంది నువ్వు ఏమంటావు అని వాళ్ళ నాన్న అంటాడు.

పక్క ఇంటి నుంచి సంయుక్త వాళ్ళ నాన్నని చూస్తుంది అంటే రుక్మిణి కొడుకా పండు ఈ విషయం శ్యామ్ కి తెలిస్తే నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది అని అనుకుంటుంది సంయుక్త. ఏమంటావ్ అమ్మ ఏం మాట్లాడవ్ ఏంటి అని వాళ్ళ నాన్న అంటాడు.ఏం మాట్లాడమంటావ్ నాన్న నాకు ఇష్టం లేదు అని చెబుతున్నా మీరు మళ్ళీ అదే మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్పగలను అని రాదా అంటుంది. పక్కనే ఉండి వింటున్న సంయుక్త నువ్వు ఇంకెవరిని పెళ్లి చేసుకోవే శ్యామ్ ని వెనకాల తిరుగుతుంటే నువ్వు ఇంకొకరిని ఎలా చేసుకుంటావు అని తన మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వు పండు గురించి ఆలోచించి అలా మాట్లాడుతున్నావ్ కానీ మా గురించి ఒక్కసారి ఆలోచించమ్మా ఒక కూతుర్ని పోగొట్టుకొని ఉన్నాను నీకు పెళ్లి చేసి నువ్వు ఆనందంగా ఉంటే చూసి ఆనందించాలని మేము అనుకుంటున్నాము అని వాళ్ళ నాన్న అంటాడు.

నాన్న ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నా పెళ్లి గురించి కాదు పండు ఆరోగ్యం గురించి రెండు రోజుల్లో బావ గారి అడ్రస్సు చెప్తామన్నారు ముందు అతని కలిసి పండు గురించి చెప్పి పండు ఆరోగ్యం బాగుపడేలా చేసి ఆ తర్వాత ఆలోచిద్దాం అని రాదా అంటుంది. కట్ చేస్తే పండు శ్యామ్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తాడు. దూరం నుంచి చూసిన శ్యాము పండు ఏంటి అక్కడే నిలబడి చూస్తున్నావ్ లోపలికి రా అని అంటాడు. వద్దులే నేను లోపలికి వస్తే నాని బాధపడుతుంది నువ్వే కిందికి రా అని పండు అంటాడు. సరే వస్తున్నా ఉండు అని శ్యామ్ కిందికి దిగి పండు దగ్గరికి వస్తాడు ఏంట్రా పండు ఇప్పుడు చెప్పు అని శ్యామ్ అంటాడు. నిన్ను మా తాతయ్యకు పరిచయం చేద్దామని వచ్చాను అని పండు అంటాడు. సరే పద మీ తాత ని చూద్దాం అని శ్యామ్ అంటాడు ఇద్దరూ కలిసి వస్తూ ఉండగా వీరు బాబు వచ్చి శ్యామ్ బాబు రేపు కృష్ణాష్టమి కథ విగ్రహం ఎక్కడ పెట్టాలి అని అంటాడు. ప్రతి సంవత్సరం విగ్రహం అక్కడ పెడతాం కదా ఈ సంవత్సరం ఇక్కడ పెడదాము ఎందుకంటే పండు వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉంటుంది కదా అని శ్యామ్ అంటాడు.

నా కోసమే మా ఇంటికి ఎదురుగా పెడుతున్నావా ఫ్రెండు అని పండు అంటాడు. అవును నీకోసమే పెడుతున్నాను సరే మీరు వెళ్లి ఆ ఏర్పాట్లు చూడండి అని వాళ్లను పంపించేస్తాడు. రా ఫ్రెండు మనం వెళ్దాము పద అని పండు వల్ల తాతయ్యని తాతయ్య అని పిలుస్తాడు. రాధా బయటికి వచ్చి ఏంటి మీరు ఈ టైంలో అని అడుగుతుంది. ఏమీ లేదు మీ నాన్నని కలుద్దామని వచ్చాము అని శ్యామ్ అంటాడు. మా నాన్నని కలుస్తారా ఎందుకు అని రాదా అంటుంది. ఏంటి రాధా పెళ్లి చూపుల గురించి అడుగుదామ ని వచ్చాను అనుకుంటున్నావా అదేం కాదులే ఊరికే చూసి వెళ్దామని వచ్చాను అని శ్యామ్ అంటాడు. ఆయన ఇప్పుడే నిద్రపోయారు ఇప్పుడు చూడాల్సిన పనిలేదు రేపు మాట్లాడు అని రాదా అంటుంది. సరేలే పండు మీ తాతయ్య పడుకున్నాడంట రేపు పొద్దున్నే కలుద్దాం అని శ్యామ్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే సంయుక్త వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి పండు ఎవరి కొడుకో కాదు ఆ శ్యామ్ కొడుకే ఈ విషయం ఆంటీకి తెలిస్తే మన బ్రతుకులు ఏమవుతాయో నీకు తెలుసా అని అంటుంది. అలా జరగడానికి వీలు లేదు అందరికీ ఆ విషయం తెలిసేలోపే నువ్వు రాదని ఆ ఇంటి నుంచి పంపించేసేయ్ అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇంటి నుంచి పంపించేయడం కాదు అమ్మ రాదని ఈ లోకం నుంచే పంపించేయాలి శ్యామ్ ని దక్కించుకోవడం కోసం ఏదైనా చేస్తాను ఎంతకైనా తెగిస్తాను రేపే కృష్ణాష్టమి ఆ కృష్ణుడు పుట్టిన రోజే ఈ రాధ చావు అవుతుంది అని సంయుక్త అంటుంది.

ఇంతలో తెల్లవారింది రాధా ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది ఏం మెసేజ్ ఎవరు పెట్టారు అనే రాదా చూస్తుంది అది కొత్త నెంబర్ నుంచి వచ్చింది కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందని ఆలోచిస్తున్నావా బయటికి వస్తే కనిపిస్తాను అని ఫోన్ లో మెసేజ్ మళ్లీ వస్తుంది అది చదివిన రాదా బయటికి వచ్చి చూస్తుంది ఈ క్కడ ఎవరూ లేరేంటి ఆ ఫోన్లో మెసేజ్ పెట్టింది ఎవరు అనే రాదా ఆలోచిస్తూ ఉంటుంది ఎవరు లేరేంటి అని చూస్తున్నావు కదా అలాగే గేటు ఓపెన్ చేసుకొని బయటికి రా నేను కనిపిస్తాను అని మళ్లీ మెసేజ్ వస్తుంది అక్కడికి వచ్చి చూస్తే ఎవరూ లేరు ఇక్కడ ఎవరూ లేరు నాతో ఆడుకుంటున్నారు కదా అని నువ్వు అనుకుంటున్నావు కదా ఒక పది అడుగులు ముందుకు వేసి రా నీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని మళ్ళీ మెసేజ్ వస్తుంది రాధా ఆ మెసేజ్ చదివి మళ్ళీ పది అడుగులు ముందుకు వేసి వస్తుంది అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది ఎవరు రాశారు ఈ లెటర్ అని అటు ఇటు చూస్తూ ఉండగా శ్యామ్ కనిపిస్తాడు శ్యామ్ సార్ మీరా ఈ మెసేజ్ లు పెట్టింది మీరేనా అని రాదా అంటుంది. అవును అని శ్యామ్ అంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది