Brahmamudi సెప్టెంబర్ 14 ఎపిసోడ్ 201: తాతయ్య విషయం లో రాజ్ కి పీడకల : కావ్య తన ఫోన్ ముట్టుకున్నందుకు రాజ్ అరుస్తాడు, దానికి కావ్య బెట్టు చేస్తూ క్షమాపణలు చెప్పమని అంటుంది రాజ్. క్షమాపణ చెప్పడం నా నిఘంటువు లో లేదు , కావాలంటే థాంక్స్ చెప్తా తీసుకో అని అంటాడు రాజ్. ఆ తర్వాత తాతయ్య దగ్గరకి కాఫీ ఇవ్వడానికి కావ్య వెళ్ళినప్పుడు మీ మనవడు గంటకి ఒకవిధంగా ప్రవర్తిస్తున్నాడు, మూడు నెలల్లో మీరు కోరినట్టు మారడం కష్టం ఏమో తాతయ్య అని అంటుంది. అప్పుడు సీతారామయ్య మూడు నెలలు గడువు పెట్టాడా, అంటే నేను చచ్చిపోయాక నిన్ను వదిలేద్దాం అనుకుంటున్నాడా అని అంటాడు.

అప్పుడు కావ్య ఒక్కసారిగా షాక్ కి గురి అవుతుంది. ఇంతలోపే రాజ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. ఏమన్నారు తాతయ్య అని అడగగా, అబ్బే ఏమి లేదు అని అంటాడు రాజ్. లేదు తాతయ్య ఎదో అన్నాడు అంటుంది కావ్య. అప్పుడు రాజ్ తాతయ్య తో నేను కళావతి ని గర్భవతి ని చూసుకున్నంత పదిలంగా చూసుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు కావ్య అబద్దం చెప్తున్నాడు తాతయ్య అని అంటుంది, లేదు నిజం అని రాజ్ వాదిస్తాడు, అలా వాదించుకుంటూ ఉండగా ఇదంతా కల అని అర్థం అవుతుంది రాజ్ కి.

కావ్య ని అవమానించాలని చూసిన రుద్రాణి :
కలలో నుండి తేరుకున్నాక, ఇదంతా కలనా?, ఈ కళావతి తాతయ్య కి నిజం చెప్పినా చెప్పేస్తుంది అని అనుకుంటాడు. అప్పుడే టీవీ లో మీ భార్య వాళ్ళ నిద్ర పట్టడం లేదా?, పట్టినా పీడకలలు వస్తున్నాయా, మీ భార్య మీకు బూచి లాగా కనిపిస్తుందా, అయితే మీకు సులభంగా, సౌకర్యం ఉండే ఆసనం చెప్తాను చెయ్యంది అని అంటాడు. అప్పుడు రాజ్ టీవీ లో చెప్పినట్టుగా పద్మాసనం వేసుకొని, చేతులు వెనక్కి పోనిచ్చి దండం పెడుతాడు. కానీ అది తీసుకోవడం తెలియక ఇబ్బంది పడుతుంటే కావ్య వచ్చి సహాయం చేస్తుంది. మరోపక్క కావ్య కళ్యాణ్ కోసం కాఫీ చేసుకొని తీసుకొని వెళ్తుంటే రుద్రాణి ‘ఏయ్..కాఫీ ఇటు ఇవ్వు అంటుంది’. కావ్య వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు రుద్రాణి ‘ఏయ్ పిలుస్తూ ఉంటే అలా వెళ్ళిపోతావ్ ఏంటి పొగరా?’ అని అంటుంది . అప్పుడు కావ్య నాకొక పేరు ఉంది, అది పిలిస్తేనే పలుకుతాను అంటుంది.

కావ్య చెంప పగలగొట్టబోయిన అపర్ణ..కావ్య కి అండగా నిలబడ్డ రాజ్ :
అప్పుడు రుద్రాణి ఆ కాఫీ ఇలా ఇచ్చేసి వెళ్లి అని అంటుంది, అప్పుడు కావ్య ఇది మరిది గారి కోసం చేసింది. మీకు డికాషన్ ఏక్కువగా ఉండాలి కదా, పది నిమిషాలు ఆగండి పెట్టి ఇస్తాను, లేకపోతే స్టవ్ మీద పాలు ఉన్నాయ్, మీరే పెట్టుకొని త్రాగండి అని అంటుంది. అప్పుడు రుద్రాణి కోపం తో నీకు బలుపు బాగా ఎక్కువ అయిపోయింది, నీ మొగుడు నీ చుట్టూ తిరుగుతున్నాడు అనే కదా ఈ మిడిసిపాటు, ఒకప్పుడు రాజ్ నీ ముఖం చూస్తేనే చిరాకు పడేవాడు, కానీ ఇప్పుడు నీ చుట్టూ తిరుగుతున్నాడు, ఎం మందు పెట్టావో అని అంటుంది. అప్పుడు కావ్య భర్త అలా తమతో ప్రేమగా ఉండాలి అంటే, మందు పెడితే ఉండరండీ, ప్రేమగా ఉండాలి, అప్పుడు వాళ్ళు కూడా ప్రేమ చూపిస్తారు. పాపం ఈ చిన్న విషయం తెలియక ఇన్ని రోజులు నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అని అనేసి అక్కడి నుండి వెళ్తుంది అప్పుడు రుద్రాణి నన్నే అంటే మాట అంటావా, నేనెంతో చూపిస్తా నీకు అని మనసులో అనుకొని, పని మనిషి అపర్ణ ని డబ్బులు అడగడం ని గమనిస్తుంది రుద్రాణి.

కానీ అపర్ణ ఇవ్వదు, అప్పుడు పని మనిషితో నీకు డబ్బు అవసరం ఉంది కదా, నీ పని అవ్వాలంటే కావ్య ని వెళ్లి అడుగు అని అంటుంది అపర్ణ. అప్పుడు ఆ పని మనిషి వెళ్లి కావ్య ని అడగగాకావ్య రాజ్ ని అడిగి పని మనిషికి ఇస్తుంది. అప్పుడు రుద్రాణి నువ్వు డబ్బులు ఇవ్వలేదు కదా, కానీ నీ కోడలు ఇచ్చింది అని అపర్ణ కి చెప్పి రెచ్చగొడుతుంది. ఇక మరుసటి ఎపిసోడ్ లో అపర్ణ మరియు కావ్య కి మధ్య ఈ విషయం లో గొడవ జరుగుతుంది . అపర్ణ కావ్య ని చెంపదెబ్బ కొట్టబోతే రాజ్ వచ్చి ఆపుతాడు. తర్వాత ఏమి జరిగింది అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.