Bigg Boss 7 Telugu: ప్రముఖ యూట్యూబర్ తెలుగు ట్రావెలర్ ప్రపంచయాత్రికుడు నా అన్వేష్ అందరికీ సుపరిచితుడే. తెలుగు ట్రావెలర్ గా యూట్యూబ్ ఫీల్డ్ లో చాలా కష్టపడి ప్రస్తుతం ఉన్నత శిఖరాలు చేరుకుంటూ.. అత్యధిక రాబడి రాబడుతున్నాడు. ఒకపక్క ప్రపంచ అందాలను చూపిస్తూ మరోపక్క ఏ దేశానికి వెళ్తాడో.. అక్కడి మంచి చెడులు చక్కగా ఎంటర్టైన్మెంట్ రీతిలో వివరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో విద్యార్థులకు ఉపయోగపడే విషయాలు కూడా ఏదైనా ఉంటే కచ్చితంగా.. అన్వేష్ చెబుతూ ఉంటాడు. ఏ ప్రదేశానికి వెళ్ళిన అక్కడి రోజులు మరియు వారి సంస్కృతి వివరిస్తూ ఉంటాడు.
దాదాపు నాలుగు సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొని… ఎవరు గుర్తించకపోయినా కానీ లాభాలకు పోకుండా.. జెన్యూన్ తెలుగు ట్రావెలర్ గా కొన్ని లక్షల మంది అభిమానాన్ని అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించాడు. ఈ క్రమంలో మనోడు ఎక్కడికి వెళ్ళినా గాని.. ఆయా దేశాలలో ఉండే తెలుగువారు ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తూ ఆహ్వానిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా తను అభిమానులతో అన్వేష్ జూమ్ మీటింగ్ లో మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ పై సీరియస్ గా సేటారికల్ కామెంట్లు చేయడం జరిగింది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు పల్లవి ప్రశాంత్. అన్వేష్ అతని గురించి మాట్లాడుతూ…బిగ్ బాస్ లోకి వెళ్లకముందు తనని సపోర్ట్ చేయాలని ప్రశాంత్ కోరినట్లు చెప్పుకొచ్చాడు.
రైతు బిడ్డను అన్న..బిగ్ బాస్ షోలోకి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్లి పేరు సంపాదించాలని భావిస్తున్నాను.. అని కోరాడు. హౌస్ లోకి వెళ్తే నువ్వు నష్టపోతావని నేను చెప్పాను. అయితే ప్రశాంత్ హౌస్ లోకి వెళ్తే రైతుల గురించి అందరికీ తెలుస్తుంది అని నాతో అన్నాడు. నాకు నచ్చక నేను సపోర్ట్ చేయలేదు అని.. అన్వేష్ స్పష్టం చేశాడు. కానీ ఇప్పుడు షో చూస్తే రైతు గురించి చెబుతానని చెప్పి హౌస్ లో అమ్మాయిలు చుట్టూ తిరుగుతున్నాడు. అతని ముఖంలోనే దొంగ బుద్ధులు కనపడుతున్నాయి అంటూ.. పల్లవి ప్రశాంత్ పై తెలుగు ట్రావెలర్ ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.