Prema Entha Madhuram October 28 Episode 1085: అను అందరి ఇళ్ళ ముందుకు వెళ్లే భవతి భిక్షాందేహి అని యచిస్తుంది. సూర్య అను వాళ్ళ ఇంట్లో ఈ రోజు పూజకి వంటలు చేసి తొందరగా పంపించాలి ఇప్పుడు మొదలు పెడితే కానీ మధ్యాహ్నం వరకు అయిపోవు నాన్న అను ఎంత మంచిదంటే అలాంటి అమ్మాయి ఇంకా ఎక్కడ ఉండదు రా తనను చేసుకున్న వాడు చాలా అదృష్టవంతుడు ఈరోజు మీ అమ్మ ఇలా బ్రతికి ఉంది అంటే ఆ అమ్మాయి వాళ్ళనే తను బిక్షకు వస్తానన్నది ఇంకా రాలేదేంటి అని సుగుణ అంటుంది.

అమ్మ ఇక ఆపుతావా ఆవిడను పొగడడం ఈ లోకంలో ఇంకెవరూ లేనటు అంతలా పొగుడుతున్నావు అని దివ్య అంటుంది. అదేంటే దివ్య అలా మాట్లాడుతూ మనకు ఇంత సహాయం చేసిన ఆవిడని పొగిడితే తప్పేముంది అని జ్యోతి అంటుంది. తప్పేమీ లేదక్కా కానీ పదే పదే ఎందుకు ఆవిడని తలుచుకుని పోవడం కృతజ్ఞత చెప్పాం కదా డబ్బులు ఇస్తానంటే తనే వద్దన్నది కదా అని దివ్య అంటుంది. దివ్య అలా మాట్లాడకమ్మ ఆ అమ్మాయిని చూస్తే అభిమానం గల దానిలా ఉంది చాలా గొప్పింటి బిడ్డలా కనిపిస్తుంది అందుకే నలుగురికి సహాయం చేసే గుణం ఉంది ఇంకెప్పుడూ తన గురించి తప్పుగా మాట్లాడకు నాకు కోపం వస్తుంది అని సుగుణ అంటుంది.

అన్నయ్య ఈరోజు వాళ్ళింట్లో పూజ ఉంది కదా అక్కడ తననే పరిచయం చేస్తాను నువ్వు తనకి థాంక్స్ చెప్పాలి అన్నయ్య అని ఉష అంటుంది. అలాగే అమ్మ అమ్మకు ఇంత సహాయం చేసిన ఆవిడకి థాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటాను అని ఆర్య అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అను వాళ్ళ ఇంటి ముంగిడికి వచ్చి భవతి భిక్షాందేహి అని అంటుంది. అదిగో అను మాటల్లోనే వచ్చేసింది తనని నీకు పరిచయం చేస్తాను ఉండు నాన్న అని సుగుణ బయటికి వెళుతుంది. అను మళ్లీ భవతి భిక్షాందేహి అని అంటుంది. సుగుణ బయటికి వచ్చి అను రామ నిన్ను మా సూర్యకి పరిచయం చేస్తాను అని అంటుంది. లేదండి నేను బిక్ష కోసం వచ్చాను తర్వాత వచ్చి కలుస్తాను లే అని అను అంటుంది.

అవును కదా మరిచిపోయానమ్మ ఉండు ఉషా ని పిలుస్తాను అని ఉషని పిలిచి అనుకి బిక్ష తీసుకురా అని అంటుంది సుగుణ. అమ్మ పిలుస్తుంది నేను బిక్షేసి వస్తాను అని జ్యోతి అంటుంది. ఏంటి వీళ్లు ఇంతసేపు అయినా బయటికి రావట్లేదు అనిమళ్లీ సుగుణ సూర్య అని పిలుస్తుంది. అన్నయ్య అమ్మ పిలుస్తుంది నువ్వు వెళ్ళు నేను ఇక్కడి పనులు చూసుకుంటాను అని ఉషా అంటుంది. ఇక్కడ పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది కాదమ్మా నీకు చెయ్యి కాలుతుంది చేతకాదు నిన్ను తర్వాత కలుస్తాను లే అని ఆర్య అంటాడు. మరేం పర్వాలేదు అన్నయ్య కొద్దిసేపగా నేను చూసుకుంటాను నువ్వు వెళ్లి రా అని ఉషా అంటుంది. అలాగే అని ఆర్య వెళ్ళిపోతూ ఉండగా ఉషాకి చెయ్యి కాలుతుంది.

ఆర్య పరిగెత్తుకొచ్చి ఉష అందుకే నేను వెళ్ళను ఈ పని నీకు చేతకాదు ఇటు వైపు రాకు అని చెప్పాను కదా అమ్మ ఇప్పుడు చూడు చెయ్యి కాలిపోయింది అని ఆర్య అంటాడు. పిలుస్తుంటే ఇంకా ఎవరు బయటకు రావట్లేదు ఉండమ్మా నేను వెళ్లి తీసుకొస్తాను అని సుగుణ లోపలికి వెళుతుంది. ఆంటీ ఎలాగో పూజ కోసం మా ఇంటికి వస్తారు కదా అక్కడ పరిచయం చేసుకుంటాను లే లేట్ అయిపోతుంది పూజకి వెళ్ళాలి అని వెళ్ళిపోతుంది. అలాగేనమ్మా నువ్వు వెళ్ళు మేము వంటలు తీసుకుని మధ్యాహ్నం వరకు వస్తాము అని సుగుణాలు లోపలికి వెళ్ళిపోతుంది. ఆర్య ఉషాకి చెయ్ కాలిందని మెడిసిన్ షాపుకు వెళ్లి ట్యూబ్ తీసుకొద్దామని వెళ్తాడు. ఏంటమ్మా అన్నయ్య ని పిలుస్తుంటే రావట్లేదు అనుకి పరిచయం చేద్దామనుకున్నాను ఏడి అన్నయ్య ఎక్కడికి వెళ్లాడు అని సుగుణ అంటుంది.

ఉషాకి చెయ్యి కాలితే అన్నయ్య బయటికి వెళ్లి ఆయింట్మెంట్ తెస్తానని వెళ్ళాడు అని దివ్య అంటుంది. కట్ చేస్తే జలంధర్ సుగుణ వాళ్ళ ఇంటికి రౌడీలను పంపిస్తాడు. వాళ్లు వచ్చి ఒసేయ్ ముసలిదానా ఎక్కడే నీ కొడుకు మా సార్ తో ఏవేవో అన్నావంట పిలువు నీ కొడుకుని అని గట్టిగా అరుస్తూ ఉంటారు. సుగుణ బయటికి వచ్చి నా కొడుకు ఇప్పుడే బయటికి వెళ్లాడు రా ఉండండి వాడు వచ్చాక చూద్దురుగాని అని అంటుంది. ఏంటే వాడు వచ్చేదాకా ఆగేది అని ఆ రౌడీ తన మీదికి చెయ్యి లేపుతాడు. అప్పుడు ఆర్య తన చెయ్యి పట్టుకుని చితక్కొడతాడు.రేయ్ నువ్వేనా రా ఈ ముసలి దాని కొడుకువి ఈరోజు నువ్వు అయిపోయావురా అని ఇంకో రౌడీ అంటాడు. ఇంకోసారి మా అమ్మ మీద చెయ్యి లేపారంటే ని తల లేచిపోతుంది రా అని ఆర్య వాళ్ళ ముగ్గురిని బాగా తన్ని తరిమేస్తాడు.

ఆ దెబ్బలకు తట్టుకోలేక రౌడీలు పారిపోతారు. ఈ దెబ్బతో ఆర్యాన సూర్యన అనేది బయటపడిపోతుంది అని జలంధర్ అంటాడు. నేను కళ్ళారా చూశాను అంటే మళ్ళీ రౌడీలను ఎందుకు పంపించారు నా మాట మీద నమ్మకం లేదా అని మానస అంటుంది. కళ్ళతో చూసింది చెవులతో విన్నది కూడా ఒక్కోసారి నమ్మలేము మానస ఇప్పుడు రౌడీలు వెళ్లారు కదా తెలిసిపోతుందిలే ఎందుకు తొందర అని ఛాయా అంటుంది.ఇంతలో రౌడీలు ఫోన్ చేసి సార్ ఆ ముసలావిడ కొడుకు నిజంగానే ఉన్నాడు సార్ మమ్మల్ని బాగా కొట్టి పంపించేశాడు సార్ వాడి సంగతి మీరే చూసుకోండి అని రౌడీలు అంటారు. అంటే షూటర్ చెప్పినటే సూర్య నిజంగానే చనిపోయాడు కానీ అతని డెడ్ బాడీ ఎక్కడ ఉన్నట్టు అది తెలుసుకోవాలి ముందు అని జలంధర్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది