NewsOrbit
రాజ‌కీయాలు

బాబూ.. లోకేశ్, ఎన్నికలకు రెడీ నా..??

chandrababu naidu and lokesh in dilemma for ghmc elections

జవసత్వాలు పూర్తిగా కోల్పోయిన పార్టీకి కొత్త జోష్ రావాలంటే ఎన్నికలు రావాల్సిందే. ఆ సమయంలో ప్రతి చిన్న పార్టీలో కూడా ఉత్సాహం వచ్చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజకీయాల్లో టీడీపీ తన హవా కొనసాగించింది. రెండు రాష్ట్రాలయ్యాక తెలంగాణలో మాత్రం టీడీపీ ఉనికి కోల్పోయింది. అయినా.. తెలంగాణలో అతి త్వరలో జరగబోయే ఎన్నికలకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. కోరలు పీకేసినా.. ఎముకలు విరిచేసినా.. ఒళ్లు గుళ్ల చేసినా.. పసుపు చొక్కా తీసేసినా తెలుగు తమ్ముళ్లకు పార్టీ పట్ల అభిమానం ఉంది. పార్టీ జెండా చూస్తే పూనకాలు తెచ్చుకునే కార్యకర్తలు ఉన్నారు. వారికి చంద్రబాబు, లోకేశ్ మద్ధతుగా నిలుస్తారా అనేదే ప్రశ్న. ఇదంతా ఎందుకంటే.. హైదరాబాద్ లో త్వరలో జరుగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల కోసమే.

chandrababu naidu and lokesh in dilemma for ghmc elections
chandrababu naidu and lokesh in dilemma for ghmc elections

కార్యకర్తలు సిద్ధమవుతున్నారు..

తెలంగాణ ప్రభుత్వం త్వరలో బల్డియా ఎన్నికలు జరిపే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందుకు పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. అధికార టీఆరఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇందుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ అధినాయకత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. కానీ.. స్థానిక నాయకత్వం, కార్యకర్తలు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయాలనే తలంపులో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు. తెలంగాణలో దాదాపు కనుమరుగైన టీడీపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు ఒప్పుకోకపోతే ఏం చేయాలనే అంశంపై ఆలోచిస్తున్నారని అంటున్నారు. 2016లో జరిగిన బల్దియా ఎన్నికల్లో టీడీపీ ఒక సీటుకే పరిమితమైంది.

అందుకే చంద్రబాబు జంకుతున్నారా..

తెలంగాణ ఏర్పడ్డాక టీడీపీలో కార్యకర్తలు తప్ప నాయకులు మిగల్లేదు. చాలామంది కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి టీఆర్ఎస్ హవా తట్టుకోలేక తన బద్ద శత్రువైన కాంగ్రెస్ తో చేతులు కలిపింది టీడీపీ. చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పిదాల్లో ఒకటిగా నిలిచిపోయింది. దీంతో అసలు బలం లేని చోట ఎందుకు పోటీకి వెళ్లడం అని అధినాయకత్వం భావిస్తున్నటు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో సున్నా సీట్లు సాధించిన టీఆర్ఎస్ 2016లో ఏకంగా 99 సీట్ల సాధించింది. కాంగ్రెస్ రెండు, టీడీపీ 1 స్థానాలకు పరిమితమయ్యాయి. టీఆర్ఎస్ అధికారంలో ఉంది. దీంతో బల్దియా ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ కు నల్లేరు మీద నడకే అనే వార్తలు వస్తున్నాయి.

Related posts

Amit Shah: తిరుమల శ్రీవారి అభిషేక సేవలో అమిత్ షా దంపతులు

sharma somaraju

ఫ‌స్ట్ టైం నంద‌మూరి కుటుంబం ఇలా చేసిందా…?

చివ‌రి కోరిక తీరుతుందా.. ఏపీలో కురువృద్ధుల‌కు టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

టీడీపీ ఆశ‌ల‌న్నీ… ఈ ఓట్ల‌పైనే.. ఏం జ‌రుగుతుందో..!

YSRCP: ‘సజ్జల’పై కేసు నమోదు

sharma somaraju

ఆ మంత్రి గెలుపు ఆశ‌లు వ‌దులుకున్నారా… వైసీపీలో ఒక్క‌టే చ‌ర్చ‌..!

ఏపీ ఉద్యోగులు రెచ్చిపోయారు.. జ‌గ‌న్‌కు ఎఫెక్టేనా..!

YSRCP: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్

sharma somaraju

AP Election 2024: కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే జైలుకే: సీఈవో ముకేష్ కుమార్ మీనా

sharma somaraju

KTR: రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలు: కేటీఆర్

sharma somaraju

YCP MLA Pinnelli: మరో సారి హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి .. కీలక వినతి

sharma somaraju

`జ‌గ‌న్ అనే నేను`కు ఐదేళ్లు పూర్తి… సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ వెన‌క‌..?

ఆ టీడీపీ టాప్ లీడ‌ర్‌కు చివ‌రి సారి అయినా ప‌రువు ద‌క్కుతుందా… ఉన్న‌ది కూడా పోతుందా ?

ఏపీలో ఎన్న‌డూ లేని టెన్ష‌న్‌.. ఉద్యోగాల‌ను వ‌దిలేసే ప‌రిస్థితి ఎందుకు..?

టీడీపీ బీకాంలో ఫిజిక్స్‌ లెక్క ఇదీ.. ఎన్నిక‌ల వేళ ఇంత పెద్ద డ్రామా చేశారా ?