NewsOrbit
న్యూస్

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

 

(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

రాష్ట్రంలో, దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతునే ఉన్నాయి. కరోనా బారిన సామాన్యులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు పడుతున్నారు. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇతర రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల మాదిరిగా ఆయన కూడా తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు వెళ్లి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఇప్పటికే కరోనా బారిన పడి వైద్య చికిత్సల అనంతరం కోలుకోగా ఇంకా కొందరు  ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రెండవ సారి కరోనా సోకడంతో చెన్నై లోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అదే విధంగా చిత్తూరు ఎమ్మెల్యే కూడా కరోనా బారిన పడి చెన్నై లోని ఆసుపత్రిలోనే చేరారు. కాగా నిన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రెండవ సారి కరోనా లక్షణాలు కనబడటంతో హెలికాఫ్టర్ లో హైదరాబాదు తరలివెళ్ళి అపోలో ఆసుపత్రిలో చేరి వైద్యసేవలు పొందుతున్నారు.

ప్రస్తుతం హైదరాబాదులో చికిత్స పొందుతున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే టీటీడీ పాలకవర్గ సమావేశం జరిగింది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా నిర్ధారణ కావడంతో అక్కడి అధికారులలో, ఇటీవల కాలంలో వైవీ సుబ్బారెడ్డి ని కలిసిన నాయకుల్లో ఆందోళన మొదలైంది.

Related posts

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju