NewsOrbit
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

Gorantla Bucchayya: గోరంట్ల బుచ్చయ్య ఒక స్క్రిప్ట్ – మైండ్ గేమ్ – నల్ల మెయిలింగ్ ..!? టీడీపీలో ఇది జరగాల్సిందే..!

Gorantla Bucchayya: Resignation Drama by ABN

Gorantla Bucchayya: గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీని వీడనున్నారు.. ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వనికి రాజీనామా చేయనున్నారు..!? ఇదీ నిన్నటి నుండి ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారిన వార్త. దీనిలో చాలా కథలున్నాయి. చాలా మలుపులున్నాయి. కొన్ని ఆసక్తికర వ్యూహాలున్నాయి.. ఉత్తుత్తిగా రాజీనామా అంటూ హడావిడి చేయడానికి ఆయనేమి తక్కువ నాయకుడు కాదు.. ఆ వార్తని హైలైట్ చేయడానికి ఏబీఎన్ కి ఏమీ పని లేక కాదు… దీనిలో అసలు కథ వేరు..!

అసలే ఫక్తు కమ్మ.. ఆపై సీనియర్ ఆరుసార్లు గెలిచినా ఎమ్మెల్యే.. అందులోకి తాను మొదటి నుండి ఉన్న పార్టీ ఆపదల్లో ఉన్న వేళ… పైగా తనకు మొదటి నుండి తగిన గుర్తింపు లేదాయె.. ఎందుకనేది ఆ పార్టీ అధినేతకు తెలుసు, తనకు తెలుసు. ఆ వర్గం ఎమ్మెల్యేలు అందరికీ తెలుసు. కానీ గుర్తింపు, గౌరవం అంటూ హడావిడి చేయడం గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇప్పుడు అవసరమైంది. ఆయన వెనుక ఉంటూ నడిపిస్తున్న వారికి అవసరమైంది..!

Gorantla Bucchayya: Resignation Drama by ABN
Gorantla Bucchayya: Resignation Drama by ABN

Gorantla Bucchayya: రాజీనామా డ్రామానే..! ఎందుకంటే..!?

బుచ్చయ్య చౌదరి ఒక కమ్మ సామాజికవర్గ నాయకుడు. సామాజికవర్గం అన్నా.., ఆ పార్టీ అన్నా పడిచచ్చే నేతల్లో ఆయన ఒకరు. 1983 నుండి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. మధ్యలో చాల సార్లు అవమానాలు ఎదుర్కొన్నారు, పదవులు ఆశించి భంగ పడ్డారు. కానీ ఏనాడూ ఇలా రాజీనామా డ్రామాకు తెరతీయలేదు. కానీ ఇప్పుడే ఎందుకంటే పార్టీ ఆపదల్లో ఉంది, పార్టీకి తనలాంటి సీనియర్ల అవసరం ఉంది.. ఇప్పుడు ఇలా చేస్తేనే తన మాటకు విలువ పెరుగుతుంది.., తనకు గౌరవం పెరుగుతుంది.. తనకు గుర్తింపు వస్తుంది.. తాను ఆశించిన బుజ్జగింపులు వస్తాయి..!
* 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు బుచ్చయ్య చౌదరి మంత్రి పదవి ఆశించారు. చంద్రబాబు ఇవ్వలేదు. తన కంటే చాలా జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు. బుచ్చయ్యకు కనీసం విప్, సలహాదారు లాంటి పదవులు కూడా ఇవ్వలేదు.. కానీ ఆ నాడు పార్టీని వీడలేదు. అలగలేదు. ఎవర్నీ ఏమి నిందించ లేదు. అప్పుడు గుర్తుకు రాని గౌరవం, అప్పుడు ఆశించని గుర్తింపు ఇప్పుడే ఎందుకు ఆశిస్తున్నట్టు..!? అది అధికారం.. తన దగ్గర కావాల్సినన్ని వనరులున్నాయి. అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే.., సొంత సామాజికవర్గం.., సో మంత్రి కంటే పవర్ ఫుల్ గా ఉంటూ చక్రం తిప్పుతూ దోపిడీకి తీసారు. 2014, 2015, 2016 లో టీడీపీ ఎమ్మెల్యేలు బాగా అక్రమార్జనకు రుచి మరిగిన ఇసుక సంపదలో గోరంట్ల ముందు వరుసలో ఉండేవారు. బుచ్చయ్య చౌదరి, సహా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు.., పశ్చిమ గోదావరిలోని అప్పటి నిడదవోలు ఎమ్మెల్యే శేషారావు, కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పోలవరం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు లాంటి వారు ఇసుకలో లక్షలు పిండుకున్నారు. వీరందరికీ నాయకుడు మాత్రం బుచ్చయ్య చౌదరి మాత్రమే.. ఇది మొత్తం అప్పటి సీఎం చంద్రబాబుకి తెలుసు.., లోకేష్ కీ తెలుసు..

Gorantla Bucchayya: Resignation Drama by ABN
Gorantla Bucchayya: Resignation Drama by ABN

ఇప్పుడు తన అవసరాన్ని ఇలా మలుచుకున్నారా..!?

గతం గడిచింది. కథ మారింది. అధికారం దూరమయింది. అక్రమార్జన పోయింది. ఇప్పుడు గుర్తింపు, గౌరవం గుర్తొచ్చింది. అందుకే గొంతు లేచింది. రాజీనామా అంటూ అస్త్రం బయటకు వచ్చింది. నిజానికి టీడీపీ ఇపుడున్న పరిస్థితుల్లో గోరంట్ల కాదు.. ఆయన నియోజకవర్గంలోని ఒక మండల స్థాయి నాయకుడు పార్టీ మారిపోతాను అని చెప్పినా పార్టీ కంగారు పడుతుంది. బలాన్ని పెంచుకోవాల్సిన దశలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే పార్టీని వీడుతాను అంటే కచ్చితంగా చంద్రబాబు, లోకేష్ లు ఎంతో కొంత లొంగుతారు. తన డిమాండ్లకు అంగీకరిస్తారు. అందుకే బుచ్చయ్య ఈ డ్రామాకు తెరతీసి ఉండవచ్చు.. కొన్ని రోజులుగా బుచ్చయ్య మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.. తన పార్టీ ఆపదల్లో ఉన్నప్పటికి.., అధికార పార్టీ దూకుడుగా ఉన్నప్పటికీ తాను మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఆ సమయంలో కూడా లోకేష్ లాంటి కొత్త బుల్లి నాయకులు ఈ సీనియర్ ఎమ్మెల్యే ఫోన్ ఎత్తకపోతే ఇలాంటి గేమ్స్ ఆడాల్సి వస్తుంది. సో… పైగా ఈ వార్తని ప్రసారం చేసింది మొదటి ఏబీఎన్ .. సో.., ఆ ఛానెల్ అధిపతికి ఇటువంటి ఆటలు కొత్త కాదు. చంద్రబాబు, లోకేష్ లు తన మాట వినట్లేదు, తనను పట్టించుకోవట్లేదు అనుకున్న ప్రతీసారి ఇలాంటి ఆయుధాలు వదులుతూనే ఉంటారు..! కాబట్టి టీడీపీ శ్రేణులు కంగారు వలదు.. అంతా ఒక ప్రణాళిక మాత్రమే..!!

Related posts

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

వైవీ. సుబ్బారెడ్డి VS బొత్స‌.. ఇలా జ‌రిగితే పేద్ద ర‌చ్చ రంబోలానే..?

‘ పిన్నెల్లి ‘ ఎపిసోడ్ వైసీపీకి ఎంత దెబ్బ కొట్టిందంటే…?

బాబుకు-జ‌గ‌న్‌, జ‌గ‌న్‌కు-ష‌ర్మిల మామూలు దెబ్బ కొట్ట‌లేదుగా…?

కుప్పంలో చంద్ర‌బాబు గెలుపుపై ఈ ట్విస్ట్ చూశారా… మామూలు టెన్ష‌న్ కాదు..!

కృష్ణాలో ఆ వైసీపీ టాప్ లీడ‌ర్‌కు… కాపు నేత చేతిలో ఓట‌మి ప‌క్కానా..?

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ పై తీర్పు రిజర్వ్

sharma somaraju

Graduate MLC Election 2024: తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

sharma somaraju

ఏపీ ఎన్నిక‌లు: ప్ర‌మాదంలో ఎగ్జిట్ పోల్స్ ఎందుకు… ?

Swati Maliwal: కోర్టులోనే కన్నీళ్లపర్యంతమైన రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ .. బిభవ్ కుమార్ బెయిల్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

Arvind Kejriwal: బెయిల్ పొడిగించాలంటూ కేజ్రీవాల్ పిటిషన్

sharma somaraju