NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

దూసుకువస్తున్న బిపోర్‌జాయ్ .. ఎనిమిది రాష్ట్రాలపై ప్రభావం

బిపోర్‌జాయ్ తుఫాను గురువారం తీరాన్ని దాటుతున్న వేళ ఆరేబియా సముద్రంలో భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో భారీ స్థాయిలో గాలులు వీస్తున్నాయి. వర్షాలు సైతం భారీగా గురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించారు.  బుధవారం గుజరాత్ లోని కచ్, దక్షిణ పాకిస్థాన్ వైపుగా బిపోర్‌జాయ్ తుఫాను.. తన దిశను మార్చుకుందని ఐఎండీ తెలిపింది. అది జఖౌ పోర్టుకు సమీపంలో తీరాన్ని దాటనుందని పేర్కొంది. తుఫాను గమనం మందగించిందని, దీనిని బట్టి అది దిశ మార్చుకుంటోందనే విషయం అర్ధమవుతుందని ఐఎండీ చెప్పింది. బిపోర్ జాయ్ గురువారం (ఇవేళ) సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సౌరాష్ట్ర, కచ్ లను బిపోర్ జాయ్ తాకి .. మాండవి, కరాచీల మధ్య జఖౌ సమీపంలో తీరాన్ని దాటనుందని పేర్కొంది. కచ్ కు 290 కిలో మీటర్ల దూరంలో తుఫాను ఉందని తెలిపింది.

Biporjoy cyclone latest news

 

బిపోర్ జాయ్ తుఫాను ప్రభావంతో  గుజరాత్ తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా రాష్ట్రాలతో పాటు దమణ్ దీప్, లక్షద్వీప్, దాద్రా నగర్ హావేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. తుఫాను ముప్పుతో గుజరాత్ తీర ప్రాంతాల్లో ఉన్న సుమారు 74వేల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని భారత సైన్యం వెల్లడించింది. తీర ప్రాంత జిల్లాల్లో సహాయక చర్యలకు 18 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్ డీ ఆర్ ఎఫ్, 115 రోడ్లు – భవనాల సిబ్బంది, 397 విద్యుత్ బృందాలతో అప్రమత్తమంగా ఉన్నామని అధికారులు తెలిపారు.   అటు మహారాష్ట్రలోనూ 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. నేవీ సిబ్బందిని కూడా సిద్దంగా ఉంచినట్లు వారు తెలిపారు.

తుఫాను పరిస్థితులపై గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి మున్ సుఖ్ మాండవీయ వేరువేరుగా సమీక్షలు నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Road Accident: ఏనుగుల గుంపును ఢీకొన్న వాహనం … మూడు ఏనుగులు మృతి

Related posts

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

sharma somaraju

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ..అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణీకుల దించివేత

sharma somaraju

వైవీ. సుబ్బారెడ్డి VS బొత్స‌.. ఇలా జ‌రిగితే పేద్ద ర‌చ్చ రంబోలానే..?

‘ పిన్నెల్లి ‘ ఎపిసోడ్ వైసీపీకి ఎంత దెబ్బ కొట్టిందంటే…?

బాబుకు-జ‌గ‌న్‌, జ‌గ‌న్‌కు-ష‌ర్మిల మామూలు దెబ్బ కొట్ట‌లేదుగా…?