Road Accident: చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో ఘార దుర్ఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మూడు ఏనుగులు మృతి చెందాయి. పలమనేరు సమీపంలో జగమర్ల అటవీ ప్రాంతం నుండి రోడ్డు దాటుతున్న ఏనుగులను కూరగాయల లోడు ఐషర్ వాహనం ఢీకొట్టింది. దీంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. మృతి చెందిన వాటిలో రెండు గున్న ఏనుగులు, ఒక పెద్ద ఏనుగు ఉన్నాయి. పలమనేను వైపు నుండి చెన్నై వైపు వేగంగా వెళుతున్న కూరగాయల లోడు వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఓ ఏనుగు రోడ్డుకు అవతల వైపునకు ఎగిరిపడగా, మరో రెండు ఏనుగులు క్రాష్ బ్యారియర్స్ కు తగిలి మృతి చెందాయి. ఈ ప్రమాదంలో కూరగాయల వాహనం పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారైయ్యాడు. ఈ ప్రమాదం కారణంగా బెంగళూరు – చెన్నై జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న వెంటనే ఫారెస్టు అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన ఏనుగులను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లీయర్ చేశారు. కౌండిన్య అభయారణ్యం నుండి ఏనుగులు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.
Janasena: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు .. ఈ సారి తప్పకుండా అసెంబ్లీలోకి అడుగుపెడతానంటూ..
