Krishna Mukunda Murari:స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుందా మురారి’. విజయవంతంగా 183 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 184 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో ముకుంద మురారి లాంటి వాళ్లని, ప్రేమిస్తున్నట్లుగా కృష్ణకు చెప్తుంది.మురారి మనసులో ఎవరున్నారో తెలుసుకోమని కృష్ణ ముకుందని అడుగుతుంది.అదే టైం కి రేవతి వచ్చి ముగ్గురిని లోపలికి వెళ్ళమంటుంది. హోమమాపడానికి కృష్ణ,మురారి ఇద్దరు ప్రయత్నిస్తారు. కానీ హోమం జరగాల్సిందే అని రేవతి గట్టిగా చెబుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో,మురారి డైరీ రాస్తుండగా కృష్ణ లోపలికి వస్తుంది. డైరీ చూడకుండా, మురారి సోఫా కింద పెట్టేస్తాడు. కృష్ణ నిన్ను ఒక మాట అడగొచ్చా అని అంటాడు. అడుగు అని అంటుంది కృష్ణ. నువ్వు కోపంలో ఉంటే బాగుంటావ్ అని ఎవరైనా చెప్పారా అని అంటాడు. నేను ఇంతవరకు ఎవరి మీద కోపం చూపించలేదు అని అంటుంది కృష్ణ. అంటే నీకు కోపం చూసి అదృష్టం నాకు అక్కడికే ఇచ్చావా అని అంటాడు మురారి. బిస్కెట్ వేసింది చాల్లే అని అంటుంది కృష్ణ. ప్రామిస్ నిజంగానే అన్నాను అని అంటాడు. అంటే కోపంలో ఉంటే నీ అందం చూసి అదృష్టం నాకే కలిగింది. నువ్వు నవ్వితే ఇంకా బాగుంటావ్ కొంచెం నవ్వవా అంటాడు మురారి. ఆ మాట కృష్ణ కూడా నవ్వొస్తుంది. అత్తయ్యకి ఎందుకో పెద్దత్తయి లాగా చెప్పింది చేయకపోతే కోపం వచ్చేస్తుంది. ఈ మధ్యనే ఈ మార్పు స్పష్టం గా కనిపిస్తుంది. మీరు అత్తయ్య నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని అడుగుతుంది. ఏం చెప్పను కృష్ణ అమ్మకు నిజం తెలిసింది ఇలా చేస్తుందని నీతో ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటాడు. నువ్వు ఒకసారి నేను అంటే ఇష్టమని చెప్తే, ఈ ప్రయత్నాలన్నీ ఏమీ అవసరం లేదు నేను కృష్ణ బాగున్నాను అని అమ్మతో చెప్పొచ్చు అని మనసులో అనుకుంటాడు. ఏంటి ఏం మాట్లాడరేంటి, అని అంటుంది కృష్ణ. ఇప్పుడే వస్తాను కృష్ణ అని బయటికి వెళ్తాడు. ఎసిపి సార్ ఏసిపి సార్ అన్న పలకడు. నాకు మీ సంగతి అర్థం కావట్లేదు అని కృష్ణ అనుకుంటుంది. మురారి బయటికి వెళ్లిన తర్వాత కృష్ణ డైరీ సోఫా కింద చూస్తుంది. ఆ డైరీ ని తీసి, అంతకుముందు చదివిన పేజీని మళ్ళీ చూడాల్సి వస్తుందని బాధపడుతుంది. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, ఏ ప్రపంచ సుందరి వచ్చినా నేను నిన్నే చేసుకుంటాను అన్నమాటలు కృష్ణ గుర్తొస్తాయి. అందుకే డైరీలో మురారి ఇప్పుడు రాస్తున్న పేజీని చూద్దామన్న ధైర్యం చాలక, డైరీ చూడకుండానే మూసేస్తుంది. మీ డైరీ చదవకపోతే ఈ డైరీ అమ్మాయికి ఏబిసిడిలు అబ్బాయికి లవ్వుందన్న విషయం నాకు తెలిసేది కాదు. స్ట్రైట్ గా నా ప్రేమ గురించి అడిగేదాన్ని ఫటాఫట్ విషయం తెలిసిపోయేది. మురారి కృష్ణగురించి ప్రేమగా రాసిన మాటల్ని, చూడకుండానే డైరీ మూసేస్తుంది. మళ్లీ అదే ప్లేస్ లో అట్లానే పెట్టేసి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ముకుంద బాధ..
బంధానికి బాధ్యతకి విలువిచ్చినవాడు, ఆ బంధాన్ని కట్టుబడుతున్నాడా, తన మనసులో నేను మాత్రమే ఉన్నాను ఇంకొక అమ్మాయికి స్నానం లేదు అని నాకు మాట ఇచ్చిన మురారినిలబెట్టుకుంటాడా లేదా,ఇది మురారి కి నాకు సంబంధించిన విషయమే కాదు మా ముగ్గురు జీవితాలకు సంబంధించిన విషయం. రేవతి అత్తయ్య చెప్పింది కదా అని నువ్వు హోమల్లో కూర్చుంటే, నాకు ఇచ్చిన మాటలు తప్పినట్టే కృష్ణుని భార్యగా అంగీకరించినట్టే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురారి ఇంతకన్నా మంచి అవకాశం రాదు. నీ అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పేస్తే మంచిది. మహా అయితే ఏం చేస్తారు నాలుగు మాటలు అంటారు. మన ప్రేమను గెలిపించుకుందాం మురారి. నిజం చెప్తావా తలవంచుతావా, ఈ హోమం మనకి చాలాఇబ్బందిని కలిగిస్తుంది అని మురారి గురించి ముకుందా ఆలోచిస్తూ ఉంటుంది.

Brahmamudi Serial జూన్ 15th 123 ఎపిసోడ్:
అలేఖ్య అనుమానం..
మధు అలేఖ్య ఇద్దరు రూమ్ లో ఉంటారు. మధుకి పంచ కట్టడం రాదని అలేఖ్య తిడుతూ ఉంటుంది. అప్పుడే ప్రసాద్ వచ్చి మధుకి పంచ కడతాడు. అలేఖ్య ఇప్పుడే వస్తాను ముకుంద దగ్గరికి వెళ్లి వస్తాను అని వెళుతుంది.ముకుంద నా ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉంటుంది ఇలాంటి హోమాలు ఎన్ని జరిగినా మా ప్రేమని ఆపలేరు. అని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అలేఖ్య వస్తుంది. సారీ నువ్వేదో ఆలోచిస్తుంటే డిస్టర్బ్ చేసానా అంటుంది. లేదు అనొద్దులే కానీ నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు కదా అంటుంది. ఏర్పాట్లు అన్ని అయ్యాయా అంటుంది ముకుంద. ఏంటి ముకుందా టెన్షన్ గా ఉన్నావ్ అంటుంది. ఇంతకీ నేను ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా, చెప్పు అంటుంది ముకుంద. అది రేవతాత్తయ్య, ఆ రేవతాత్తయ్య అంటుంది ముకుంద. ఏంటి రేవతి అత్తయ్యని గాని ఇంత ఉలిక్కి పడుతుంది. అరే ముకుందా ఎందుకు టెన్షన్ పడుతున్నావు నిన్ను కూడా హోమానికి రమ్మని, కూర్చోడానికి మాతోపాటు రమ్మంటుంది. అలేఖ్య మురారి కృష్ణ ఇద్దరు హోమానికి వచ్చారా అంటుంది ముకుంద. పెళ్లికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారా అన్నట్టుంది నీ ప్రశ్న వాళ్ళు రాకుండా హోమం ఎలా జరుగుతుంది అంటుంది అలేఖ్య. కచ్చితంగా మురారి ముకుంద మధ్య ఏదో ఉంది అని అలాగే మనసులో అనుకుంటుంది. ఈరోజు ఎలాగైనా వీళ్ళ మధ్య ఏ బంధం ఉందో తెలుసుకోవాలి అనుకుంటుది.

Nuvvu Nenu Prema: విక్కీ మనసు బాధ పెట్టిన పద్మావతి… ఇక ప్రేమకి ప్రపంచానికి దూరంగా విక్కి..
కృష్ణ ని రెడీ చేసిన, రేవతి..
మా ఇష్టత తో సంబంధం లేకుండా దైవ బలంతో విహనం జరుగుతుంది. మా కోడలు అని కాదులే కానీ నువ్వు మణిరత్నం సినిమాలో హీరోయిన్ లా ఉంటావు అని రేవతి, కృష్ణుని పొగుడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మురారి వస్తాడు. నువ్వేంటి రా సీరియల్ చూసినట్టు అలా చూస్తున్నావు. ఏంటి ఎలా ఉన్నావు అని అంటుంది. ఏంటి వీళ్లిద్దరిలో ఏ మూమెంట్ కనిపించట్లేదు ఇద్దరు బాధగా ఉన్నారు అని రేవతి మనసులో అనుకుంటుంది. ఒకసారి బాగుంటారు ఒకసారి అయోమయం ఉంటారు వీళ్ళ ఇద్దరి తీరు అంటే నాకు అర్థం కావట్లేదుఅని మనసులో అనుకుంటుంది.ఏంటి ఇద్దరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది.హోమల్లో కూర్చోవడం ఇద్దరికి ఇష్టం లేదా అని అంటుంది. ఇష్టం లేకపోయినా కూర్చుని తీరాల్సిందే అని అంటుంది రేవతి. మా వదిన పూజలకి బ్రాండ్ అంబాసిడర్ రా, అని రేవతి గురించి ప్రసాద్ అంటాడు. పూజలు హోమాలు మనకు ఇష్టం లేకపోయినా చేయాలిరా అవి మన బంధాన్ని నిలుపుతాయి అని అంటాడు ప్రసాదు. మన ఇష్టాన్ని పక్కనపెట్టి హోమం చేయడం చాలా మంచిది. వదిన మా మగధీర్ రెడీ మీరు రాని అలంకారం అయిపోయిందా అని అంటాడు. అందరూ హోమానికి వెళ్తారు.

హోమానికి రెడీ…
మధు అలేఖ్య ఇద్దరు హోమం దగ్గర ముందే వచ్చి నిలబడతారు. మధు ఇక రేపు నుంచి మనం కలిసి పోతాము అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఎనీ హోమాలు చేసిన నాలుగు మార్పు రాదు అంటుంది అలేఖ్య. పిచ్చిదానా అక్కడ ఉంది ఆదిదంపతులు వాళ్ళు మార్చాలనుకుంటే ఏదైనా మారుస్తారు అని అంటాడు మధు. అవునా అయితే రేపటి నుంచి నేను ఎలాగో కొట్టలేను కదా చివరిసారి ఒకసారి కొడతాను అని గట్టిగా, మధుకి ఒకదెబ్బ వేస్తుంది అలేఖ్య.పంతులు గారు ఇంకా ఏమైనా కావాలా అంటుంది సుమలత. అత్తయ్య మామయ్య కూడా ఉన్నట్టు అయితే బాగుండేది నిండుతనం వచ్చేదిఅని అంటుంది కృష్ణ.పెద్దత్త లేదు కదా బిజినెస్ వ్యవహారాలన్నీ, ఆయనే చూసుకోవాలి కదా అందుకే రావడం కుదరలేదు అని అంటుంది రేవతి. నీ మాటల్లో ఇంటికోడల్ని అని స్పష్టత నాకు కనిపిస్తుంది దాని కోసమే నా ప్రయత్నం అంతా దాని నిలబెట్టడానికే అని రేవతి అనుకుంటుంది మనసు. అందరూ హోమానికి వెళ్తారు. కృష్ణ మురారి ఇద్దరూ మెట్లు దిగుతూ హోమానికి వస్తూ ఉండగా, ముకుంద చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. కృష్ణ ప్లేస్ లో ముకుందని ఊహించుకుంటూ ఉంటుంది. నేను ఇష్టపడి మనసిచ్చి ప్రేమించిన మురారి నాకు దూరం అవుతుంటే నేను ఈ బాధను భరించలేకపోతున్నాను. ఈ దౌర్భాగ్యానికి బాధపడాలో కృష్ణ అదృష్టాన్ని చూసి బాధపడాలో నాకు అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటుంది ముకుంద. కృష్ణ పీటల మీద కూర్చోమనగాని వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు మురారి కి అప్పగించిన, మాటలన్నీ గుర్తోస్తూ ఉంటాయి. హోమం జరగడానికి దైవం మేము కలవాలని ఇలా అనుకుంటుంది. మురారి సార్ అంతా ఆపిన హోమం ఆగలేదు అంటే దీనికి దైవబలం ఉంది అనుకుంటుంది కృష్ణ. మురారి ఎన్ని జన్మలైనా కృష్ణ నా భార్య గానే ఉండాలి అని అనుకుంటాడు. పంతులుగారు రెండు జంటలని పీట ల మీద కూర్చోమంటాడు. మధు అలేఖ్య కూర్చుంటారు. రేవతి కృష్ణా మురారిని కూడా కూర్చోమంటుంది వాళ్లు కూర్చుంటారు.
హోమం మొదలు ముకుంద ప్లాన్ అమలు.
మురారి కృష్ణకి ఇద్దరికీ పంతులుగారు కంకణాలు కట్టుకోమని ఇస్తారు. ఆ కంకణం కడుతూ, మురారి కృష్ణను చూసి సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. వీళ్ళిద్దరినీ ముకుంద చూసి, ముకుందా ఆ ప్లేస్ లో నేను లేను అని బాధపడుతూ ఉంటుంది. హోమం జరిపిస్తూ ఉంటారు. ముకుంద ఆలోచనలో పడుతుంది. ఈ హోమల్లో ముకుంద లేకపోయినట్టు అయితే నేను ఇంకా మనస్ఫూర్తిగా ఈ హోమం చేసే వాడిని అని మురారి అనుకుంటాడు. తను నా ఎదురుగా నిలబడి ఉంటే, నేను హోమం చేయలేకపోతున్నాను. కృష్ణ మహల్ లో ఉన్న సంతోషం వీడు మొహం లో లేదు. వీడే అగ్రిమెంటు పెట్టి ఉంటాడు ఈ వయ్యారిని ప్రేమించాడు కదా, చెప్తా మీ ఇద్దరు సంగతి అని రేవతి మనసులో అనుకుంటుంది. అమ్మ రేవతి గారు పూలమాలలు ఇవ్వండి వధూవరులు ఇద్దరికీ అని అంటాడు పంతులుగారు. కృష్ణ మురారిలకు ఇద్దరికీ పూలదండలు ఇస్తుంది రేవతి. బాబు దండలు మార్చుకోండి అంటాడు పంతులుగారు. ఇద్దరు దండలు మార్చుకుంటారు. ఒకరి మనసులో ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది కానీ బయటపడకుండా, ఒకరంటే ఒకరికి ఇష్టం లేదనుకుంటూ మనసులో దండలు మార్చుకుంటారు. మురారి చాలా సంతోషంగా దండలు మారుచుకుంటాడు అది చూసి ముకుందా చాలా కోపంగా ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటుంది. మీ భార్యాభర్తలు ఇద్దరు నేను చేసిన ప్రమాణాలని చెప్పండి అని అంటాడు. కృష్ణ మురారి చెప్తే చాలు అంటాడు పంతులుగారు. మధు వీడియో తీసుకోవచ్చా అని అడుగుతాడు. ప్రసాద్ అరుస్తాడు. పంతులుగారు నేను చెప్పింది చెప్పండమ్మా అంటాడు మురారితో.మురారి అనే నేను కృష్ణ అనే అమ్మాయిని ఏడు జన్మలకి నా భార్యగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ప్రమాణం చేయి అని అంటాడు. మురారి సగంలోనే ఆపేస్తాడు. పూర్తిగా చెప్పు నాయనా అంటాడు. ఏడేడు జన్మలకి కృష్ణ నా భార్యగా రావాలి అని మురారి ప్రమాణం చేస్తాడు. ముకుందా షాక్ అవుతుంది. ఇది హోమం జరుగుతున్నట్లు లేదు కృష్ణ మురారి లకి మళ్ళీ పెళ్లి జరుగుతున్నట్టు ఉంది అని ముకుందా కళ్ళు తిరుగుతున్నట్టు ఆడ్ చేస్తుంది. అంటే ఒకసారిగా కళ్ళు తిరిగి పడిపోయినట్టు పడుతుంది. చూడాలి రేపటి ఎపిసోడ్ లో కృష్ణ చేత కూడా ప్రమాణం చేయించి హోమం పూర్తి చేయిస్తుందా రేవతి.. ముకుంద పడిపోయినందుకు మురారి అక్కడి నుంచి లేచి హోమాన్ని మధ్యలో ఆపేస్తాడా..తెలియాలంటే, రేపటి దాకా ఆగాల్సిందే…