టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) గత కొంత కాలంగా వైసీపీ వ్యతిరేక వర్గాలైన టీడీపీ, జనసేన నేతలపై వ్యంగ్యంగా విమర్శలు సంధిస్తూ ట్వీట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ యువనేత నారా లోకేష్ పై ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకు విషయం ఏమిటంటే.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమలో ఇటీవల పూర్తి అయిన సంగతి తెలిసిందే.

అయితే రాయలసీమలో పాదయాత్ర ముగియడంతో అక్కడి నేలకు నమస్కరించిన ఫోటోను లోకేష్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనపై ఆర్జీవీ తన దైన శైలిలో స్పందిస్తూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. ఆస్కార్ అవార్డు రావాల్సింది ఆర్ఆర్ఆర్ సినిమా, రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కు కాదు.. ఈ పురస్కారం కచ్చితంగా నారా లోకేష్ కు దక్కాల్సిందని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
దూసుకువస్తున్న బిపోర్‌జాయ్ .. ఎనిమిది రాష్ట్రాలపై ప్రభావం
And the OSCAR goes to not #RRR , not to @ssrajamouli , not to @mmkeeravaani not to @AlwaysRamCharan , not to @tarak9999 ..IT GOES TO @naralokesh 😘😘😘😍😍😍😍 pic.twitter.com/dctyNTEAdq
— Ram Gopal Varma (@RGVzoomin) June 14, 2023