NewsOrbit
Entertainment News సినిమా

Devara: రెండు భాగాలుగా రాబోతున్న “దేవర” స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన కొరటాల శివ..!!

Devara: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “దేవర” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. “RRR” వంటి అతిపెద్ద హిట్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావటంతో “దేవర” విషయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో రాజమౌళి సినిమా చేసిన తర్వాత వరుస పెట్టి పరాజయాలు ఎదురయ్యాయి. సింహాద్రి, యమదొంగ సినిమాలు చేసిన తర్వాత నెక్స్ట్ హిట్ అందుకోవడానికి ఎన్టీఆర్ కింద మీద పడ్డారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా తారక్.. “దేవర” ప్రతి సన్నివేశం విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు.

Koratala Siva released the special video of Devara which is coming in two parts

ఆల్రెడీ కొరటాల శివ దర్శకత్వంలో 2016వ సంవత్సరంలో ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలో ఇప్పుడు “దేవర” చేస్తూ ఉండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో ఏప్రిల్ 5వ తారీఖు సినిమా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా “దేవర” సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ తెలియజేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

Koratala Siva released the special video of Devara which is coming in two parts

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర చేస్తున్నారు. అదేవిధంగా దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ డబల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో “దేవర” రెండు భాగాలుగా తీస్తున్నట్లు కొరటాల శివ ప్రకటించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మొదటి భాగం ఏప్రిల్ నెలలో విడుదల కానుండగా రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

Related posts

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N