NewsOrbit
Entertainment News సినిమా

Devara: రెండు భాగాలుగా రాబోతున్న “దేవర” స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన కొరటాల శివ..!!

Devara: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “దేవర” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. “RRR” వంటి అతిపెద్ద హిట్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావటంతో “దేవర” విషయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో రాజమౌళి సినిమా చేసిన తర్వాత వరుస పెట్టి పరాజయాలు ఎదురయ్యాయి. సింహాద్రి, యమదొంగ సినిమాలు చేసిన తర్వాత నెక్స్ట్ హిట్ అందుకోవడానికి ఎన్టీఆర్ కింద మీద పడ్డారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా తారక్.. “దేవర” ప్రతి సన్నివేశం విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు.

Koratala Siva released the special video of Devara which is coming in two parts

ఆల్రెడీ కొరటాల శివ దర్శకత్వంలో 2016వ సంవత్సరంలో ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలో ఇప్పుడు “దేవర” చేస్తూ ఉండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో ఏప్రిల్ 5వ తారీఖు సినిమా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా “దేవర” సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ తెలియజేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

Koratala Siva released the special video of Devara which is coming in two parts

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర చేస్తున్నారు. అదేవిధంగా దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ డబల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో “దేవర” రెండు భాగాలుగా తీస్తున్నట్లు కొరటాల శివ ప్రకటించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మొదటి భాగం ఏప్రిల్ నెలలో విడుదల కానుండగా రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

Related posts

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri