NewsOrbit
జాతీయం న్యూస్

Mamata Benerjee: బెంగాల్ సీఎం మమత బెనర్జీకి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అహ్వానం

Mamata Benerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఆహ్వానించింది. తమ యూనివర్శిటీలో వచ్చే ఏడాది జూన్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రొ – వైస్ ఛాన్సలర్ జోనాథన్ మిచీ ఆహ్వానించారు. బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో మిచీ ఈ విషయాన్ని ప్రకటించారు. తమ అహ్వానానికి సీఎం అంగీకరించారని ఆయన తెలిపారు.

Mamata Banerjee

బెంగాల్ బిజినెస్ సమ్మిట్ లో సీఎం ప్రధాన సలహాదారు అమిత్ మిశ్రా .. మిచీని వేదికపై అహ్వానించగా ఆయన మాట్లాడారు. సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన పోరాటాలు, విజయాల గురించి తమ యూనివర్శిటీలో ఉపన్యాసం ఇవ్వడానికి అహ్వానించామని మిచీ తెలిపారు. తమ విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారని చెప్పారు.  సీఎం సందేశాన్ని తమ విద్యార్ధులు మరియు అధ్యాపకులు బాగా స్వీకరిస్తారని అన్నారు. అక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పూర్వ విద్యార్ధి అయిన లక్ష్మీ గ్రూప్ ఎండీ, పారిశ్రామికవేత్త రుద్ర చటర్జీ తనను సీఎంకి పరిచయం చేశారని మిచీ తెలిపారు.

అంతకు ముందు సీఎం మమతా బెనర్జీ తన చిన్నతనంలో తండ్రి మరణించిన తర్వాత చదువు కోసం పడిన ఇబ్బందులు, పోరాటాల గురించి మాట్లాడారు. ఇక్కడ పాల్గొన్న చాలా మంది మాదిరిగా తనకు ఇంగ్లీష్ లో మాట్లాడటం లాదని కానీ చాలా బాషలు తెలుసునని అన్నారు. రెండేళ్ల క్రితం కూడా మమతా బెనర్జీ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ప్రసంగానికి ఆహ్వానం అందింది. అయితే నాడు వర్చువల్ పద్దతిలో కార్యక్రమాన్ని ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగించాల్సి ఉండగా, చివరి నిమిషంలో రద్దు అయ్యింది. దానిపై నాడు టీఎంసీ అక్షేపణ కూడా వ్యక్తం చేసింది. తాజాగా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ మరో సారి మమతా బెనర్జీని ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Millets: పోషకాహార ప్రియులకు గుడ్ న్యూస్ .. ఇక బియ్యం ఆకారంలో మిల్లెట్‌లు

Related posts

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

sharma somaraju

Telangana Exit Polls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ .. బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్, బీజేపీలదే హవా

sharma somaraju

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

sharma somaraju

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

sharma somaraju

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్

sharma somaraju

Lok Sabha Election 2024: ఈవీఎంలను నీటి గుంటలో పడేసిన గ్రామస్థులు .. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

sharma somaraju

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N