NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ బ‌లం ముందు మ‌నం వీకే… ఒప్పేసుకున్న చంద్ర‌బాబు, ప‌వ‌న్‌..!

అవును.. ఈ మాట సోష‌ల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. వాస్త‌వానికి ర‌హ‌దారులు బాగోలేవ‌ని.. ప‌రిశ్ర‌మ లు తీసుకురాలేద‌ని, నిరుద్యోగుల‌కు కూడా.. ఎలాంటి ఉపాధీ చూపించ‌లేక పోయార‌ని.. ఈ ఐదేళ్ల కాలం లో దోచుకోవ‌డం, దాచుకోవ‌డం చందంగానే పార్టీ పాల‌న సాగింద‌ని ప్ర‌తిప‌క్షాలు చెబుతూ వ‌చ్చాయి. ఇది క్షేత్ర‌స్థాయిలో నిజ‌మేన‌న్న‌ది మెజారిటీ ప్ర‌జ‌ల అభిప్రాయంగా కూడా ఉంది. మ‌రి ఇంత‌గా వ్య‌తిరేక‌త ఉన్న‌ప్పుడు.. జ‌గ‌న్‌కు బ‌లం ఎలా ఉంటుంది? అనేది ప్ర‌శ్న‌.

కానీ, జ‌గ‌న్ బ‌లవంతుడ‌నేలా.. ప్ర‌తిప‌క్షాలే వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌నేది మేధావులు చెబుతున్న మాట‌. దీనిని అర్ధం చేసుకోవ‌డం కొంత మేర‌కు క‌ష్ట‌మే అయినా.. నిజ‌మేన‌ని చెబుతున్నారు. `పొత్తులు పెట్టుకుంటు న్నారు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? జ‌గ‌న్ బ‌ల‌వంతుడు కాద‌నేది అంద‌రూ చెబుతున్న మాట‌. ఆయ న సోద‌రి ష‌ర్మిల చేస్తున్న ప్ర‌చారంలోనూ వాస్త‌వం ఉంద‌ని ప్ర‌తిప‌క్షాలే చెబుతున్నాయి. అలాంటప్పుడు .. ఆయ‌న‌ను ఓడించేందుకు పొత్తులు పెట్టుకుంటే.. ఎలాంటి సంకేతాలు వ‌స్తాయి?` అనేది మేథావుల ప్ర‌శ్న‌.

రాజ‌కీయాల్లో పొత్తులు ఎట్టుకోవ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌రు. కానీ, వీటి అవ‌స‌రాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం లోనే ప్ర‌తిప‌క్షాలు ముందుకు సాగాలి. అలా కాక‌పోతే నెగిటివిటీ ఎక్కువ‌గా ప్ర‌చారంలోకి వ‌స్తుంద‌ని అంటు న్నారు. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా.. ఇలానే వ్యాఖ్యానించారు. `బ‌ల‌వంతుడై న జ‌గ‌న్‌ను ఓడించేందుకు పొత్తులు త‌ప్ప‌డం లేదు` అని చెప్పుకొచ్చారు. అయితే.. ఇది జ‌నంలోకి వేరేగా అర్ధం కావ‌డంతో ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ఈ మాట ఎత్త‌డం లేదు. మంచిదే.. అలాగ‌ని తాము ఎందుకు చేతులు క‌లిపార‌నేది వేరే కోణంలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సి ఉంటుంది.

గ‌తంలో 2009తో ఇలానే మ‌హాకూట‌మి పేరుతో ఉమ్మ‌డి రాష్ట్రంలో పార్టీలు క‌లిసి పోటీ చేశాయి. అప్ప‌ట్లో కూడా.. ఇదే స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింది. అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. ఎన్నిక‌ల్లో దీనిని ప్ర‌చారం చేసుకున్నారు. `కాంగ్రెస్ ఎంతో బ‌లంగా ఉంది. మేం తెచ్చిన ప‌థ‌కాలు ప్ర‌జ‌లు మేళ్లు చేస్తున్నాయి. మేం బ‌లంగా ఉన్నాం కాబ‌ట్టే.. మ‌మ్మ‌ల్ని ఓడించ‌డం చేత‌కాక‌.. వీళ్లంతా చేతులు క‌లిపారు` అని చేవెళ్ల ప్ర‌చారంలో చేశారు.

వైఎస్ నోటి నుంచి వ‌చ్చిన ఈ వ్యాఖ్య‌లు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఫ‌లితంగా .. పొత్తులు చిత్తై.. వైఎస్ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇలాంటి ప‌రిస్థితి ఇప్పుడు రాకూడ‌దంటే.. పొత్తుల విష‌యంలో కార‌ణాలు.. అవ‌స‌రాల‌ను.. జ‌గ‌న్ బ‌లంతో సంబంధం లేకుండా, రాకుండా వివ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది మేధావుల మాట‌. మ‌రి పొత్తు పార్టీలు ఈ విష‌యంపై దృష్టి పెడ‌తాయో లేదో చూడాలి.

Related posts

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

sharma somaraju

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ..అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణీకుల దించివేత

sharma somaraju

వైవీ. సుబ్బారెడ్డి VS బొత్స‌.. ఇలా జ‌రిగితే పేద్ద ర‌చ్చ రంబోలానే..?

‘ పిన్నెల్లి ‘ ఎపిసోడ్ వైసీపీకి ఎంత దెబ్బ కొట్టిందంటే…?

బాబుకు-జ‌గ‌న్‌, జ‌గ‌న్‌కు-ష‌ర్మిల మామూలు దెబ్బ కొట్ట‌లేదుగా…?