NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నా ఇష్టం అంటోన్న చంద్ర‌బాబు… ర‌గిలిపోతోన్న తెలుగు త‌మ్ముళ్లు…!

వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని టీడీపీ అధినేత చంద్ర బాబు నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నారు. ఇక‌, ఇప్పుడు బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌నుంది. దీనికి చంద్ర‌బాబు ఓకేగా ఉన్నారు. అస‌లు ఆయ‌న కూడా ఆది నుంచి కోరుకుంటున్న‌ది ఇదే అనే ప్ర‌చారం ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. మాన‌సికంగా చంద్ర‌బాబు సిద్ధ‌మ‌య్యారు. దీనివ ల్ల ఆయ‌న కోల్పోయే దానికంటే.. వ‌చ్చేదే(అధికారం) ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఆయ‌న భావిస్తు న్నారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, టీడీపీ ఇలా పొత్తు పెట్టుకుంటే.. త‌మ సంగ‌తి ఏంట‌నేది త‌మ్ముళ్ల మ‌ధ్య జ‌రుగుతున్న చర్చ‌. ఇది స‌హ‌జంగా వ‌స్తున్న ప్ర‌శ్న కూడా. క‌నీసంలో క‌నీసం.. 40 + స్థానాల‌ను టీడీపీ వ‌దు లుకోవాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఉన్న లెక్క ఇది. పొత్తుల ప్ర‌కారం చూసుకుంటే.. 30 స్థానాల‌ను జ‌న‌సే న‌కు ఇచ్చిన‌.. బీజేపీకి 10 స్తానాలు త‌ప్ప‌కుండా కేటాయించాల్సి ఉంటుంది. త‌ద్వారా.. 40 స్థానాల‌నైనా టీడీపీ ఆమేరకు పొత్తు పార్టీల‌కు కేటాయించాలి.

మ‌రి ఈ 40 స్తానాల్లో పార్టీని న‌మ్ముకుని.. పార్టీ కోసం అంతో ఇంతో శ్ర‌మించిన వారు.. ఉన్నారు. వారికి ఏం చెప్పాలి? ఏం చెబుతారు? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం.. కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆశిస్తున్న మాగంటి బాబుకు లేద‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. ఇక‌, పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో మార్పు ఖాయ‌మ‌ని తేలిపోయింది. ఇక్క‌డ నుంచి టికెట్ కోసం వేచి చూస్తున్న బోడే ప్ర‌సాద్ త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితిలో త‌ప్పుకోక‌త‌ప్ప‌ద‌ని అర్ధ‌మైంది.

అదేవిధంగా విజ‌య‌వాడ ప‌శ్చిమను జ‌న‌సేన‌కు ఇచ్చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలైన‌… అవ‌నిగ‌డ్డ‌, పెడ‌న‌ల్లోనూ ఇదే త‌ర్జ‌న భ‌ర్జ‌న సాగుతోంది. మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం నూజివీడులోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. మైల‌వ‌రంలో దిగ్గ‌జ నాయ‌కుడు దేవినేనికి మార్పు త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఇలా ఒక్క కృష్ణాజిల్లాలోనే ఈ ప‌రిస్థితి ఉంటే.. మిగిలిన జిల్లాల్లో ప‌రిస్థితి ఇంకా ఇబ్బందిగా ఉంది.

ఇది చంద్ర‌బాబుకు మాన‌సికంగా ఓకే అనిపించినా.. త‌మ్ముళ్లు మాత్రం లోలోన ర‌గులుతున్నారు. ముందు వారితో భేటీ అయి.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తారా? వారికి ఏదైనా హామీలు ఇస్తారా? లేక‌పోతే.. నాఇష్టం అనే విధంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. టీడీపీలో మార్పులు.. పార్టీకి ఇబ్బందిగానే ఉంది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju