NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ ట్రాప్‌ నుంచి బ‌య‌ట‌ప‌డే ప్లాన్‌లో జ‌గ‌న్‌…!

ఢిల్లీ స్థాయిలో జ‌రుగుతున్న రాజకీయాలు.. వైసీపీకి ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నాయి. బీజేపీ పొత్తుల విష యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు వైసీపీకి మింగుడు ప‌డ‌డం లేదు. ఒక‌వైపు త‌మ‌తో చెలిమి చేస్తూ.. త‌మ నుంచి స‌హ‌కారం తీసుకుంటున్న బీజేపీ (ఒక రాజ్య‌స‌భ‌సీటు ఇచ్చారు. ఏ బిల్లు పెట్టినా నిస్సందేహంగా స్వాగ‌తించారు. ఇటీవ‌ల కాంగ్రెస్‌ను రాజ్య‌స‌భ‌లో వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ఏకేశారు) ఇప్పుడు అనూహ్యంగా త‌మ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను అక్కున చేర్చుకునేందుకు రెడీ అయింద‌న్న వాద‌నే వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంద‌ని అంటున్నారు.

`రాజ‌కీయాల్లో మార్పులు స‌హజం. కానీ, ఈ సంకేతాలు మాకు ఒకింత ఇబ్బందిగానే ఉంటాయ‌ని అంటు న్నారు. మా అధినేత ఏం చేసినా.. మాకు ఇష్ట‌మే` అనేది వైసీపీ నేత‌లు చెబుతున్న మాట‌. అంటే.. టీడీపీతో క‌లిసి బీజేపీ ముందుకు వెళ్లాల‌నే భావ‌న‌లో ఉండ‌డాన్ని వైసీపీ జీర్ణించుకోలేక పోతోంద‌న్న విష‌యం వీరి మాటల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అలాగ‌ని నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఇదే జ‌రిగితే మైనారిటీ ఓటు బ్యాంకు దెబ్బ‌తింటుంద‌నే అంచ‌నా వేస్తున్నారు.

అదే స‌మ‌యంలో బీజేపీ త‌మ‌ను విశ్వ‌సించ‌క‌పోవ‌డానికి కూడా కార‌ణం ఇదేన‌నే చ‌ర్చ సాగుతోంది. వాస్త వానికి ఇప్ప‌టికే.. మీరు ఒంటరిగా పోటీ చేయండి.. ఆ స్థానాల్లో మా బ‌లాన్ని త‌గ్గించుకుంటామ‌నే సంకేతా లు.. వైసీపీ నుంచి బీజేపీకి వెళ్లాయి. కానీ, ఎందుకో బీజేపీ ఒంట‌రి పోరుకు సిద్ధంగా లేదు. ఈ నేప‌థ్యం లోనే టీడీపీతో చేతులు క‌ల‌పాల‌ని క‌మ‌ల‌నాథులు రెడీగా ఉన్నార‌ని జాతీయ స్థాయిలో మీడియా కూడా వెల్ల‌డిస్తోంది. అయితే.. పొత్తులు పెట్టుకోవ‌డం బాగానే ఉన్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ సంపాదించుకున్న క్రెడిట్‌పై ఇది ప్ర‌భావం చూపుతుంద‌నే చ‌ర్చ సాగుతోంది.

వైసీపీపై న‌మ్మ‌కం లేకే.. బీజేపీ మాతో పొత్తు పెట్టుకుంద‌ని రేపు టీడీపీ ప్ర‌చారం చేస్తే.. ఇది హిందూ సామా జిక వ‌ర్గంలో ప్ర‌భావం చూపుతుందనేది వైసీపీ నేత‌లు వేస్తున్న అంచ‌నా. అస‌లు న‌మ్మ‌కం, విశ్వ‌స‌నీయ తపైనే త‌మ పార్టీ అడుగులు వేస్తున్న‌ద‌రిమిలా.. ఇలాంటి ప‌రిణామాలు ఇబ్బందిగా ఉంటాయ‌నేదివారి మాట కూడా. అలాగ‌ని నేరుగా బీజేపీతో త‌ల‌ప‌డే ప‌రిస్థితి లేదు. స‌ర్దుకు పోయే అవ‌కాశం లేదు. దీంతో బీజేపీ వ్య‌వ‌హార శైలి నుంచి బ‌య‌ట ప‌డేందుకు నానా తిప్ప‌లు ప‌డుతున్నార‌నేది వైసీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju