NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో తొడ కొట్టిన నాయ‌కురాలికి ఇప్పుడు టెన్ష‌న్ ప‌ట్టుకుందా…!

టీడీపీలో ఎంతో మంది నాయ‌కురాళ్లు ఉన్నారు. వారిలోనూ ఒక‌రిద్ద‌రు ఫైర్ బ్రాండ్ నాయ‌కురాళ్లు కూడా ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌, ఎస్సీ నాయ‌కురాలు.. బండారు శ్రావ‌ణి తొలి వ‌రుస‌లో ఉంటారు. అయితే.. వీరిని మించి అన్న‌ట్టుగా గ‌తంలో గుంటూరు కేంద్రంగా నిర్వ‌హించిన మ‌హానాడులో తొడ‌గొట్టి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నాయ‌కురాలు.. గ్రీష్మ ఉన్నారు. వైసీపీ నాయ‌కుల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తూ.. ఆమె అప్ప‌ట్లో తొడ‌గొట్టిన సంగ‌తి తెలిసిందే.

ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లా రాజాం ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ్రీష్మ టికెట్ ఆశిస్తున్నారు. రెండేళ్లుగా ఇక్క డ కార్య‌క్ర‌మాలు కూడా చేస్తున్నారు. మాజీ స్పీక‌ర్ కావ‌లి ప్ర‌తిభా భార‌తి కుమార్తెగా ఆమె రాజ‌కీయ అరం గేట్రం చేయాల‌నేది గ్రీష్మ కోరిక‌. దీనికి తొలి నాళ్ల‌లో పార్టీ నుంచి ఎంక‌రేజ్‌మెంట్ ల‌భించింది. దీంతో ఆమె రెచ్చిపోయారు. కానీ, తీరా ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చేస‌రికి.. దాదాపు ఆమెను ప‌క్క‌న పెట్టేశారు. ఇక్క‌డ టికెట్‌ను మాజీ మంత్రి కోండ్రు ముర‌ళికి దాదాపు ఖాయం చేసిన‌ట్టు ప్ర‌చారంలో ఉంది.

ప‌లు స‌మీక‌ర‌ణ‌లు, ఈక్వేష‌న్లు చూశాక రాజాంలో పార్టీ విజ‌యం సాధించాలంటే గ్రీష్మ కంటే ముర‌ళీయే బెట‌ర్ అని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పైగా గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ అక్క‌డ వైసీపీ వ‌రుస విజ‌యాలు సాధిస్తోంది. పైగా ఈ సారి అక్క‌డ వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులును విశాఖ జిల్లాలోని పాయ‌క‌రావుపేట‌కు మార్చేసింది. దీంతో ఇప్పుడు అక్క‌డ వైసీపీకి ప్రెష్ క్యాండెట్ ఉన్నారు. దీంతో ఈ సీటు గెల‌వాలంటే టీడీపీ మ‌రింత బ‌ల‌మైన ఈక్వేష‌న్ల‌తో పాటు బాగా క‌ష్ట‌ప‌డాలి. ఈ క్ర‌మంలోనే గ్రీష్మ‌కు అయితే ఇక్క‌డ గెలిచే స‌త్తా లేద‌న్న నిర్ణ‌యానికి పార్టీ అధిష్టానం వ‌చ్చేసింది.

తాజాగా పార్టీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారాలోకేష్ జిల్లాల ప‌ర్య‌ట‌న ప్రారంబించారు. తొలుత ఆయ‌న శ్రీకాకుళం జిల్లాలోనే ప‌ర్య‌టించ‌నున్నా రు. ఈ క్ర‌మంలో శంఖారావం పేరుతో స‌భ‌లు పెడుతున్నారు. అయితే.. ఈ స‌భ‌ల ఏర్పాటు విష‌యంలో కోండ్రు ముర‌ళికి ప్రాధాన్యం ఇస్తూ.. పార్టీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అంతా తానై ఆయ‌న రాజాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇచ్ఛాపురంలో నిర్వ‌హించే స‌భ‌కు జ‌నాల‌ను త‌ర‌లిస్తున్నారు.

ఈ ప‌రిణామంతో తొడ‌గొట్టిన గ్రీష్మ‌కు స‌ర్వం అర్థ‌మైంది. త‌న‌ను ప‌క్క‌న పెడుతున్నారంటూ.. ఫేస్‌బుక్ వేదిక‌గా. కామెంట్లు చేశారు. ఆ వెంట‌నే ఆమె డిలీట్ చేశారు. ఇప్ప‌టి వ‌రకు తాను పార్టీ కోసం చాలా ఖ‌ర్చు చేశాన‌ని.. త‌న కుటుంబాన్ని కూడా వ‌దులుకుని తిరిగాన‌ని ఆమె రాసుకొచ్చారు. దీనిలో వాస్త‌వం ఉన్న‌ప్ప‌టికీ.. స్తానికంగా మార్పు అనివార్య‌మ‌నేది.. పార్టీ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. దీంతో గ్రీష్మ‌కు టికెట్ ఇవ్వ‌ర‌నేది స్ప‌ష్ట‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆమె ప‌క్క చూపులు చూస్తున్నారనే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

YSRCP: సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన .. ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట

sharma somaraju

Kapu Ramachandra Reddy: రాజ్‌నాథ్ సింగ్ ను కలిసిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ..బీజేపీ గూటికి చేరేందుకే(గా)..!

sharma somaraju

CV Ananda Bose: దీదీ సర్కార్ కు గవర్నర్ సీవీ ఆనంద బోస్ హెచ్చరిక

sharma somaraju

Gaganyaan: గగన్‌యాన్ లో పర్యటించే వ్యోమగాముల పేర్లు ప్రకటించిన ప్రధాని మోడీ

sharma somaraju

చేతులు క‌లిసినా మ‌న‌సులు క‌ల‌వ‌ని జ‌న‌సేన – టీడీపీ.. ఇంత‌క‌న్నా ఫ్రూప్స్ కావాలా…!

Top 10 OTT Movies: ఓటీటీలో బెస్ట్ మూవీస్ గా కొనసాగుతున్న తెలుగు సినిమాలు ఇవే..!

Saranya Koduri

జ‌గ‌న్ ఓడితే ఏంటి.. చంద్ర‌బాబు ఓడితే ఏంటి… దెబ్బ ప‌డేది ఎవ‌రికంటే…!

Chandrababu: హనుమ విహారి వివాదంపై స్పందించిన చంద్రబాబు

sharma somaraju

Dear Kavya: యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్న “డియర్ కావ్య ” వెబ్ సిరీస్.. నటీనటుల వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీతో టీడీపీ – జ‌న‌సేన స్నేహం ఉందా.. ఉండీ లేదా… !

ఈ సిట్టింగ్ సీట్ల‌లో వైసీపీ ఓట‌మి ఎవ్వ‌రూ ఆప‌లేరా.. జ‌గ‌న్ చేతులెత్తేసిన‌ట్టే..!

ఆ 22 సీట్ల‌లో టీడీపీని గెలిపిస్తోన్న ప‌వ‌న్‌.. ఆ సీట్లు.. ప‌క్కా లెక్క‌లివే…!

ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు.. ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేరా…!

The Kerala story: OTT ని షేక్ చేస్తున్న ది కేరళ స్టోరీ..!

Saranya Koduri

Krishna Mukunda Murari February 27 2024 Episode 404: మురారి ముకుంద ఒక్కటి అవుతున్నారని విన్న కృష్ణ.. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella