NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమిత్ షా కండీష‌న్ల‌తో చంద్ర‌బాబులో భ‌యం మొద‌లైందే…!

చంద్ర‌బాబు ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నారు. అదే ఉత్సాహంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వ‌స్తుంది.. అందుకే ఎన్డీయేలో చేరిపోవాల‌ని ఢిల్లీ వెళ్లి అమిత్ షాను క‌లిసి వ‌చ్చారు. అమిత్ షాను క‌లిసి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చంద్ర‌బాబు ఏం మాట్లాడ‌డం లేదు. అస‌లు అమిత్ షా చంద్ర‌బాబు ముందు ఏం డిమాండ్లు పెట్టారు ? అన్న‌ది బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అదే చంద్ర‌బాబు మాట అమిత్ షా ద‌గ్గ‌ర చెల్లుబాటు అయ్యి ఉంటే చంద్ర‌బాబు ఈ పాటికే ప్ర‌చారాన్ని ఊద‌ర‌గొట్టేసేవారు. అయితే అక్క‌డ డిమాండ్లు చూస్తే బాబు గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిన చందంగా ఉంద‌ని ఇన్‌సైడ్ టాక్ ?

ఇప్ప‌టికే బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన ఇటు టీడీపీతో కూడా క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళుతున్న‌ట్టు చెప్పేసింది. ఈ కూట‌మిలోకి బీజేపీని కూడా చేర్చాల‌న్న‌ది ప‌వ‌న్ ఆశ‌, ఆలోచ‌న‌. ఇటు జ‌న‌సేన ఇప్ప‌టికే 25- 30 అసెంబ్లీ, 3 – 5 లోక్‌స‌భ సీట్లు అడుగుతున్న విష‌యం తెలిసిందే. పైగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల కోసం అటు టీడీపీ, ఇటు జ‌న‌సేన రెండు పార్టీలు గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతున్నాయి. ఈ టైంలో అమిత్ షా ఇచ్చిన లిస్టులో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు చూసి చంద్ర‌బాబుకు చ‌లీ, జ్వ‌రం వ‌చ్చేలా ఉంద‌న్న గుస‌గుస‌లు టీడీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

ఏపీ బీజేపీ నేత‌లు చెపుతున్న దాని ప్ర‌కారం 26 అసెంబ్లీ, 7 పార్ల‌మెంటు సీట్లు ఇవ్వాల‌ని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల పేర్ల‌తో స‌హా అమిత్ షా చంద్ర‌బాబు ఎదుట ప్ర‌తిపాద‌న‌లు చేసిన‌ట్టు స‌మాచారం. అంత‌కు మించి త‌క్కువ అయితే త‌మ‌కు పొత్తు అవ‌స‌రం లేద‌ని కూడా అమిత్ షా బాబు ఎదుట కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారంటున్నారు. చంద్ర‌బాబుకు షా ఇచ్చిన లిస్టులో రాయ‌ల‌సీమ‌లో ధ‌ర్మ‌వ‌రం, శ్రీకాళ‌హ‌స్తి ఉన్నాయ‌ట‌.

అలాగే సీమ‌లోనే ఆళ్ల‌గ‌డ్డ‌, ప్రొద్దుటూరు, మ‌ద‌న‌ప‌ల్లె కోస్తాలో రాజ‌మండ్రి రూర‌ల్‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, గుంటూరు వెస్ట్‌, ఏలూరు, విశాఖ నార్త్ సీట్లు ఉన్నాయంటున్నారు. ఈ లిస్టు నుంచి బీజేపీ మ‌హా అయితే ఓ 20 సీట్లు మాత్ర‌మే త‌గ్గించుకోవ‌చ్చు.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 20 సీట్ల‌కు మించి బీజేపీ త‌గ్గ‌ద‌ని అంటున్నారు. అలాగే పార్ల‌మెంటు సీట్లలో 5 సీట్లు కావాల‌న్న‌ది మెయిన్ కండీష‌న్ అట‌. ఈ లిస్టులో ఏలూరు, విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, హిందూపురం, చిత్తూరు, అర‌కు త‌దిత‌ర స్థానాలు ఉన్నాయ‌ట‌.

ట్విస్ట్ ఏంటంటే ఇప్ప‌టికే జ‌న‌సేన, టీడీపీ మ‌ధ్య గొడ‌వ‌లు న‌డుస్తోన్న కొన్ని సీట్ల‌ను బీజేపీ కూడా ఆశిస్తోంది. ఓవ‌రాల్‌గా జ‌న‌సేన‌కు + బీజేపీకి క‌లిపి 45 – 50 అసెంబ్లీ, 7- 10 పార్ల‌మెంటు సీట్లు పోతే చాలా మంది టీడీపీ నేత‌లు త్యాగాలు చేయాలి. అది అంతిమంగా పార్టీలో పెద్ద సంక్షోభం, తిరుగుబాటుకు కార‌ణ‌మ‌వ్వ‌వ‌చ్చు. ఈ డైల‌మాలోనే చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి వ‌చ్చాక సైలెంట్ అయిపోయార‌ని టాక్ ?

Related posts

ష‌ర్మిల గెలిస్తే క‌ష్ట‌మే… వైసీపీలో ఇదో కొత్త‌ టెన్ష‌న్‌…!

హిందూపురంపై బెట్టింగులు.. బాల‌య్య‌పై కాదు బ్రో..?

గ‌న్న‌వ‌రం ‘ వంశీ ‘ మాస్ట‌ర్ ప్లాన్‌.. ఇంత పెద్ద స్కెచ్ వేసుకుని రెడీ అయ్యారా ?

వైసీపీలో తండ్రి – త‌నయుల ఫైట్‌.. ఎవరు గెలుస్తారు? ఎవ‌రు ఓడతారు?

BSV Newsorbit Politics Desk

వైసీపీ ఆశ‌లు.. మ‌హిళ‌లు + అవ్వాతాత‌లు = గెలిచేనా.. ?

CM Revanth Reddy: కీరవాణి స్టూడియోకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి .. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు

sharma somaraju

Poll Violence In Tadipatri: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీపై వేటు

sharma somaraju

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N