NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ప‌వ‌న్‌కు కాపు నేతే ముద్దు… జ‌న‌సేన‌లో బీసీ నేత బ‌లి…!

జ‌న‌సేన పొత్తులో భాగంగా మొత్తం 25 సీట్ల‌లో పోటీ చేస్తుంద‌ని అంటున్నారు. అయితే ఈ సీట్ల‌లో మెజార్టీ కాపు నేత‌లే జ‌న‌సేన సీట్ల కోసం పోటీప‌డుతున్నారు. మెజార్టీ కూడా కాదు జ‌న‌సేన 25 సీట్ల‌లో పోటీ చేస్తుంది అనుకుంటే 20 సీట్ల‌లో కాపు నేత‌లే సీట్ల రేసులో ఉన్నారు. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీలో కూడా కాపు సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్న చోట ఆ వ‌ర్గానికే చిరంజీవి ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఈ వ‌ర్గం నుంచే ప్రజారాజ్యంపార్టీ త‌ర‌పున ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అలాగే ఈ వ‌ర్గానికే ఎక్కువ సీట్లు ఇవ్వ‌డం వ‌ల్ల కూడా పార్టీ బాగా న‌ష్ట‌పోయింది.

ఇప్పుడు జ‌న‌సేన‌లోనూ అదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న రాజాన‌గ‌రం, రాజ‌మండ్రి రూర‌ల్‌, తాడేప‌ల్లిగూడెం, భీమ‌వ‌రం, గాజువాక‌, య‌ల‌మంచిలి, పెందుర్తి, విశాఖ నార్త్, నెల్లిమ‌ర్ల‌తో పాటు పిఠాపురం, భీమిలితో పాటు అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు, కాకినాడ పార్ల‌మెంటు స్థానాలు ఇలా ఎక్క‌డ చూసుకున్నా కాపు నేత‌లే ఆశావాహులుగా క‌నిపిస్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీలో బీసీలు సీట్లు ఆశిస్తోన్న చోట కూడా కాపు నేత‌లు ఆ సీటు లాగేసుకునేందుకు రెడీ అవుతుండ‌డం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉంది.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో నరసాపురం నియోజకవర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి బీసీ మ‌త్స్య‌కార వ‌ర్గానికి చెందిన బొమ్మిడి నాయ‌క‌ర్ పోటీ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న రెండో స్తానంలో నిల‌వ‌డంతో పాటు వైసీపీకి గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఇక్క‌డ జ‌న‌సేన దెబ్బ‌కు టీడీపీకి డిపాజిట్ కూడా రాలేదు. ఈ సారి కూడా నాయ‌క‌ర్‌కు సీటు ఇవ్వ‌డం న్యాయం. ఆయ‌న పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. అయితే ఇప్పుడు అదే నియోజ‌క‌వ‌ర్గంలో ఒక వెలుగు వెలిగిన కీలక నేత, కాపు సామాజికవర్గానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారట‌.

సుబ్బారాయుడు తిర‌గ‌ని పార్టీ అంటూ లేదు. టీడీపీ, ప్ర‌జారాజ్యం, కాంగ్రెస్‌, వైసీపీ, టీడీపీ తిరిగి వైసీపీ ఇప్పుడు జ‌న‌సేన వైపు చూస్తున్నారు. ఇక్క‌డ బీసీ వ‌ర్గానికి చెందిన బొమ్మ‌డి నాయ‌క‌ర్‌ను కాద‌ని కొత్త‌ప‌ల్లికి సీటు ఇస్తే జ‌న‌సేన ప‌ట్ల బీసీల్లో ఎంత వ్య‌తిరేక భావం పెరుగుతుందో చెప్ప‌క్క‌ర్లేదు. పైగా న‌ర‌సాపురం మెగా ఫ్యామిలీకి సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలోని మొగ‌ల్తూరు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మెగా సోద‌రుల స్వ‌గ్రామం.

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కోసం క‌మిట్‌మెంట్‌తో ప‌నిచేస్తోన్న బీసీ నేత‌ను కాద‌ని.. త‌న సామాజిక వ‌ర్గానికే చెందిన‌.. అందులోనూ త‌న రాజ‌కీయ స్వ‌లాభం కోసం ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీలు మారే నేత‌కు అవ‌కాశం ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగానే బీసీల్లో జ‌న‌సేన ప‌ట్ల బాగా వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రి ప‌వ‌న్ నాయ‌క‌ర్‌కు న్యాయం చేస్తాడా ? లేదా త‌న కులానికి చెందిన కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు వైపే మొగ్గు చూపుతారా ? అన్న‌ది చూడాలి.

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N