NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మైల‌వ‌రం టీడీపీ సీటు కోసం మూడో కృష్ణుడు వ‌చ్చేశాడు.. భోరుమన్న దేవినేని ఉమా…?

కృష్ణా జిల్లా మైల‌వ‌రం టీడీపీ రాజ‌కీయాలు బాగా వేడెక్కేశాయి. ఇక్క‌డ నిన్న‌టి వ‌ర‌కు టీడీపీ సీటు విష‌యంలో పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు తిరుగులేదు. 20 ఏళ్ల నుంచి కృష్ణా టీడీపీలో ఉమా అంటేనే వ‌న్ మ్యాన్ షో. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉమా చెప్పినోళ్ల‌కే పార్టీ టిక్కెట్ ఇచ్చేంత స‌త్త ఉమాకు ఉండేది. కాలం ఎల్ల‌ప్పుడు ఒకేలా ఉండ‌దు క‌దా..! ఉమా త‌న నియంతృత్వ‌, ఏక‌ప‌క్ష పోడ‌ల‌తో పార్టీకి తీవ్ర న‌ష్టం జ‌రిగింది.

చంద్ర‌బాబు ఏమోగాని.. లోకేష్ అయితే ఉమాకు మ‌రీ అంత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఇష్టంగా లేర‌ని పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నాయి. అందుకే ఉమాకు కాకుండా ఉమాకు చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న‌.. ప్ర‌స్తుత మైల‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ను పార్టీలోకి తీసుకుని ఆయ‌న‌కే మైల‌వ‌రం సీటు ఇవ్వ‌డంతో పాటు ఉమాను పెన‌మ‌లూరు పంపాల‌ని లోకేష్‌, రాబిన్‌శ‌ర్మ టీం ప్ర‌తిపాద‌న‌గా పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇది అబ‌ద్ధ‌మో, అవాస్త‌వ‌మో అయితే ఉమా లైట్ తీస్కొంటాడు. కానీ నిజం అన్న‌ది తేలిపోవ‌డంతో ఉమా బావురుమంటోన్న ప‌రిస్థితి. వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. ఇటు వ‌సంత టీడీపీలోకి వ‌చ్చినా తాను నియోజ‌క‌వ‌ర్గం మారే ప్ర‌శ‌క్తే లేద‌ని.. తాను ఇక్క‌డ నుంచే పోటీ చేస్తాన‌ని చెపుతున్నారు. ఉమా మాత్రం తాను మైల‌వ‌రం నుంచి మారే ప్ర‌శ‌క్తే లేద‌ని.. ఇక్క‌డే పోటీలో ఉంటాన‌ని చెపుతున్నారు.

ఈ సీటు టీడీపీలో ఇద్ద‌రు క‌మ్మ నేత‌ల మ‌ధ్య వార్ జ‌రుగుతుంటే.. ఇప్పుడు మూడో కృష్ణుడు కూడా సీటు నాదే అని రెడీ అయిపోతున్నారు. ఆయ‌న బీసీ నేత కావ‌డం విశేషం. ఆ మూడో కృష్ణుడు ఎవ‌రో కాదు బొమ్మ‌సాని సుబ్బారావు. బ‌ల‌మైన బీసీ గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన బొమ్మ‌సాని గ‌త 20 ఏళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన బీసీ నేత‌గా ఉండ‌డంతో పాటు టీడీపీ ప‌టిష్టం కోసం త‌న వంతుగా ప్ర‌య‌త్నిస్తూ వ‌స్తున్నారు.

పైగా దేవినేని ఉమాను రెండుసార్లు గెలిపించ‌డంలో బొమ్మ‌సాని కృషి కూడా ఉంది. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న‌కు ఎలాంటి గుర్తింపు లేద‌ని ఎన్నోసార్లు బొమ్మ‌సారి వాపోయారు. ఈ సారి మాత్రం బీసీ కోటాలో మైల‌వ‌రం టిక్కెట్ త‌న‌కే ఇవ్వాల‌ని ఆయ‌న పంతంతో ఉన్నారు. మ‌రి ఈ ముగ్గురు కృష్ణుల‌లో మైల‌వ‌రం టీడీపీ టిక్కెట్ ఎవ‌రికి ద‌క్కుతుందో ? చూడాలి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N