Shruti Haasan: సౌత్ స్టార్ బ్యూటీ శృతి హాసన్ మరోసారి ప్రేమలో విఫలమైన సంగతి తెలిసిందే. డూడుల్ ఆర్టిస్ట్ అండ్ ఇల్లుస్ట్రేటర్ శాంతాను హజారికాకు శృతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. దాదాపు నాలుగేళ్ల నుంచి రిలేషన్ లో ఉన్న ఈ జంట.. గత నెలలో తమ బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. శాంతానుతో విడిపోవడానికి శృతి హాసన్ పరోక్షంగా కన్ఫార్మ్ చేసింది. ప్రియుడితో ఉన్న ఫొటోలు, వీడియోలన్నింటినీ శ్రుతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసి పడేసింది. పైగా ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో కూడా అయ్యారు.
రెండేళ్ల నుంచి లివ్ ఇన్ టుగెథర్లో ఉన్న శృతి హాసన్, శాంతాను ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవారు. తరచూ జంటగా మీడియాకు కండపడుతూ హెడ్ లైన్స్ లో నిలిచేవారు. కానీ గత నెల రోజుల నుంచి శృతి హాసన్, శాంతాను కలిసి కనిపించన సందర్భమే లేదు. ఈ పరిణామాలన్నీ శృతి హాసన్, శాంతాను విడిపోయినట్లు తేల్చేశాయి. అయితే నాలుగేళ్లు కలిసి ఉన్న ఈ జంట తమ రిలేషన్ ను బ్రేక్ చేసుకోవడానికి కారణం ఏంటి..? అన్న ప్రశ్నలో అందరిలోనూ ఉంది.
ఇలాంటి తరుణంలో ఓ ప్రముఖ వెబ్ సైట్ శృతి హాసన్ బ్రేకప్ కు కారణం ఇదే అంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు పెళ్లి పీటలెక్కేస్తున్నారు. 38 ఏళ్ల వయసులో ఉన్న శృతి హాసన్ కూడా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని ఆశపడింది. శాంతానుతో ఏడడుగులు వేయాలని ముచ్చటపడింది. ప్రియుడిని పెళ్లి చేసుకుందామని కోరింది. కానీ శాంతాను మాత్రం శృతి హాసన్ పెట్టిన పెళ్లి ప్రపోజల్ ను తిరస్కరించాడట.
మ్యారేజ్ చేసుకునే ఇంట్రెస్ట్ తనకు లేదని.. సహజీవనం తోనే తమ రిలేషన్ ను కొనసాగిద్దామని చెప్పాడట. దాంతో శృతి హాసన్, శాంతాను మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. అవి పెరిగి పెరిగి చివరకు బ్రేకప్ కు దారి తీసిందని సదరు వెబ్ సైట్ పేర్కొంది. దీంతో ఇప్పుడీ న్యూస్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది. పెళ్లికి ఒప్పుకోనందుకే శృతి హాసన్ శాంతానుతో విడిపోయిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.
కాగా, శాంతాను హజారికా కంటే ముందు శృతి హాసన్ లండన్ కుర్రాడు మైఖేల్ కర్సెల్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ కూడా నాలుగేళ్లు రిలేషన్ లో ఉన్నారు. మైఖేల్ తో శృతి హాసన్ పెళ్లి ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శృతి హాసన్ మైఖేల్ తో బ్రేకప్ చేసుకుంది. ఇప్పుడు శాంతానుతో మరో నాలుగేళ్ల ప్రేమాయణం నడిపించి విడిపోవడంతో శృతి హాసన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సినిమాల విషయానికి వస్తే.. వాల్తేరు వీరయ్య, వీరి సింహా రెడ్డి, సలార్ 1 చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్న శృతి హాసన్.. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ 2లో నటిస్తోంది. అలాగే టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ కు జోడిగా డెకాయిట్ అనే సినిమా చేస్తోంది.