NewsOrbit
Cinema Entertainment News OTT న్యూస్ సినిమా

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

Siddharth Roy: సిద్ధార్థ్ రాయ్.. అర్జున్ రెడ్డి షర్ట్స్ ఉండటం వల్ల విడుదలకు ముందు ఈ చిత్రం ఎలాంటి హైప్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వి. యశస్వి డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌పై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించారు. అత‌డుతో స‌హా తెలుగులో అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న దీపక్‌ సరోజ్‌ సిద్ధార్థ్ రాయ్ మూవీతో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. అలాగే ఈ రొమాంటిక్ డ్రామాలో తన్వి నేగి హీరోయిన్ గా చేసింది.

నందిని, ఆనంద్, మాథ్యూ వర్గీస్, కీర్తన త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించ‌గా.. రధన్ సంగీతం అందించాడు. ఫిబ్రవరి 23న థిట‌యేర్స్ లో విడుదలైన సిద్ధార్థ్ రాయ్ ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న సొంతం చేసుకుంది. లాజిక్స్ ను న‌మ్మే హీరో, ఎమోష‌న్స్ ను విశ్వ‌సించే హీరోయిన్ మ‌ధ్య సంఘ‌ర్ష‌ణే ఈ చిత్రం. టీజర్, ట్రైలర్ లో బోల్డ్ సీన్లు, డైలాగ్స్, హీరో క్యారెక్టరైజేషన్ చూసి మంచి అంచ‌నాల‌తో థియేట‌ర్స్ ఆడియెన్స్ వెళ్లారు. కానీ వారి అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో సిద్ధార్థ్ రాయ్ మూవీ విఫ‌లం అయింది.

టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద సిద్ధార్థ్‌ రాయ్ మూవీ అనుకున్న స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది. అయితే ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా న‌టించిన దీప‌క్ స‌రోజ్‌, తన్వి నేగి త‌మ‌ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకున్నారు. హీరోగా దీప‌క్ స‌రోజ్ కు డెబ్యూ మూవీ అయిన‌ప్ప‌టికీ త‌నదైన న‌ట‌న‌తో సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాడు. అలాగే త‌న్వి గ్లామ‌ర‌స్ గా క‌నిపిస్తూనే.. న‌ట‌న‌కు ప్ర‌ధాన్య‌త ఉన్న స‌న్నివేశాల్లో అద్భుతంగా మెప్పించింది.

అయితే థియేట‌ర్స్ లో విడుద‌లైన రెండు నెల‌ల‌కు సిద్ధార్థ్‌ రాయ్ ఓటీటీలో సంద‌డి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ బోల్డ్ మూవీ డిజిట‌ల్ రైట్స్ ను ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. సిద్ధార్థ్ రాయ్ మూవీ మే 3వ తేదీన ఆహా లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆహా క‌న్ఫార్మ్ చేసింది. `పేరు సిద్ధార్థ్ రాయ్. ఈ క్లిష్టమైన మనిషిని చూసేందుకు సిద్ధం అవ్వండి. సిద్ధార్థ్ రాయ్ మే 3న ప్రీమియర్ కానుంది` అంటూ ఆహా ట్వీట్ చేసింది.

కాగా కొన్ని చిత్రాలు థియేట‌ర్స్ లో ఫ్లాప్ అయినా కూడా ఓటీటీ వేదిక‌గా హిట్ అవుతున్నాయి. ఇటీవ‌ల రిలీజ్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ స్టార్ థియేట‌ర్స్ లో డిజాస్ట‌ర్ అయింది. కానీ ఓటీటీలో మాత్రం భారీ వ్యూస్ తో నెం.1 స్థానంలో నిలిచింది. అందువ‌ల్ల బోల్డ్ కంటెంట్ మ‌రియు మాస్ మ‌సాలా ఉన్న‌ సిద్ధార్థ్‌ రాయ్ మూవీ కూడా డిజిట‌ల్ ల‌వ‌ర్స్ ను ఆక‌ట్టుకునే అంశాలు ఎక్కువ‌గా కనిపిస్తున్నాయి. మరి ఓటీటీలో సిద్ధార్థ్‌ రాయ్ ఎలాంటి విజ‌యాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే మ‌రికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Related posts

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?