Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. తనదైన ప్రతిభ, స్టైల్, మ్యానరిజమ్స్ తో భారీ స్టార్డమ్ సంపాదించుకున్నాడు. పవర్ స్టార్ గా గుర్తింపు పొందాడు. అన్నను మించిన తమ్ముడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రజాసేవ కోసం ఏపీ రాజకీయాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఎన్డీఏ కూటమిలో భాగమైన పవన్ కళ్యాణ్.. జగన్ ను ఇంటికి పంపించడమే లక్ష్యంగా పోరాడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఈ సంగతి పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మరుసటి ఏడాదే ఆయన వైవాహిక జీవితంలోకి కూడా అడుగు పెట్టారు. 1997లో నందిని అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన కొంత కాలానికి మనస్పర్థలతో వీరిద్దరూ దూరం అయ్యారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తన కోస్టార్ రేణు దేశాయ్ తో ప్రేమలో పడ్డాడు.
నందినితో విడాకులు తీసుకోకుండానే రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ సహజీవనం స్టార్ట్ చేశారు. వీరికి 2004లో అకీరా నందన్ జన్మించాడు. దాంతో నందిని కోర్టును ఆశ్రయించింది. 2008లో నందినికి రూ. 5 కోట్లు భరణంగా ఇచ్చి పవన్ కళ్యాణ్ ఆమె నుండి విడాకులు తీసుకున్నాడు. 2009లో రేణు దేశాయ్ ను వివాహం చేసుకుని ఆధ్యకు జన్మనిచ్చారు. అయితే 2012లో వీరి బంధం విడాకులతో ముగిసింది. 2013లో పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడోసారి వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు.
2011లో తీన్ మార్ సినిమా షూటింగ్ సమయంలో పరిచయం అయిన రష్యా నటి అన్నా లెజ్నెవాను పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు, పోలేనా అంజనా పవనోవా అనే కూతురు సంతానంగా జన్మించారు. ఫారెన్ అమ్మాయి అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత అన్నా లెజ్నెవా ఇక్కడి సాంప్రదాయాలకు విలువనిస్తూ మెగా ఫ్యామిలీతో చాలా తొందరగా కలిసిపోయారు. అలాగే వివాహం అనంతరం యాక్టింగ్ కు పులిస్టాప్ పెట్టి సంపూర్ణ గృహిణిగా మారారు.
అయితే పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత రోజుల్లో పెళ్లి చేసుకునే వధూవరులు మధ్య వయసు వ్యత్సాసం అనేది చాలా తక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. కానీ సినీ తారలు మాత్రం ఏజ్ కు పెద్దగా ప్రధాన్యత ఇవ్వరు. ఇండస్ట్రీకి చెందిన ఎందరో హీరోలు తమకంటే వయసులో చాలా చిన్నవారిని పెళ్లి చేసుకున్నారు. తమకంటే వయసులో పెద్దవారిని చేసుకున్న వారు కూడా ఉన్నారు. పవన్ మాత్రం ఫస్ట్ కేటగిరీకే చెందుతారు. పవన్ కళ్యాణ్ 1968లో జన్మించారు. ఆయన ఏజ్ 55 కాగా.. అన్నా లెజ్నెవా వయసు 44. ఆమె 1980లో పుట్టారు. ఏజ్ పరంగా పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా మధ్య ఏకంగా 12 ఏళ్లు గ్యాప్ ఉంది. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.