NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జనసేన క్యాండేట్ ఫోన్ స్విచ్ ఆఫ్.. పవన్ కే హుకుం జారీ చేశాడుగా..

ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు కొన్ని నియోజకవర్గాలలో తీవ్ర గందరగోళానికి కారణం అవుతుంది. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలలో అటు జనసేన నుంచి ఇటు టిడిపి నుంచి బలమైన అభ్యర్థులు రేసులో ఉండడంతో.. ఏం చేయాలో తెలియక అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఇప్పటికే తొలి జాబితాలో జనసేన 5 సీట్లకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈరోజు లేదా రేపు రిలీజ్ అయ్యే రెండో జాబితాలో మరో 10 స్థానాలకు పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. కొన్నిచోట్ల ఇప్పటికి అభ్యర్థులను ప్రకటించకపోవడంతో జనసేన అభ్యర్థులు తమకు సీటు వస్తుందా..? రాదా..? అన్న సందేహంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో.. జనసేన పోటీ చేసే దర్శి నియోజకవర్గంలో.. రాజకీయంగా గందరగోళం నెలకొంది.

Janasena candidate's phone switched off.
Janasena candidate’s phone switched off.

దర్శి నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎన్ఆర్ఐ గా ఉన్న గరికపాటి వెంకట్ పోటీ చేస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో.. చీరాల, దర్శి, గిద్దలూరు స్థానాలను జనసేన పరిశీలించింది. అయితే చీరాలకు చెందిన జ‌న‌సేన నేత ఆమంచి స్వాములు.. చీరాల లేదా గిద్దలూరు సీటు ఆశించారు. స్వాములకు సీటు వస్తుందా రాదా అన్న సందిగ్ధత నెలకొంది. అయితే దర్శి నుంచి ఎన్నారై గరికిపాటి ఢ‌పేరు రేసులో బలంగా ముందు నుంచి వినిపిస్తోంది. అయితే గత వారం రోజులుగా గరికపాటి వెంకట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆజ్ఞాతంలోకి వెళ్లినట్టు.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ తనకు సీటు ఇస్తేనే నియోజకవర్గంలోకి అడుగుపెడతానని.. లేకపోతే నియోజకవర్గంలోకి తాను ఎంటర్ కానని జనసేన రాష్ట్ర నాయకులు వెంకట్ సమాచారం చేరవేసి మరి ఎవరికి అందుబాటులోకి లేకుండా వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతుంది.

ఓవైపు దర్శిలో అధికార వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు కరారు అయింది. ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. చివరకు దర్శి సీటు జనసేనకు ఇస్తారా..? లేదా తెలుగుదేశం పోటీ చేస్తుందా..? అన్నది క్లారిటీ లేదు. జనసేన జిల్లాలో దర్శి లేదా గిద్దలూరులో ఏదో ఒక సిటీ నుంచి పోటీ చేస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. తనకు గ్యారంటీగా సీటు వస్తుంది అన్న నమ్మకం లేకపోవడంతో గరికపాటి వెంకట్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కచ్చితంగా పవన్ కళ్యాణ్ సీటు ఇస్తానంటేనే.. ఖర్చు పెట్టుకుంటానని.. లేకపోతే అనవసరంగా చేతి చమురు వదిలించుకోవడం ఎందుకు అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా జనసేన పోటీ చేసేది తక్కువ స్థానాలు అయినా.. బలమైన అభ్యర్థులు లేక టికెట్లపై స్పష్టమైన హామీలు రాక.. పలు నియోజకవర్గాలలో ఇలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఈ మూవీ మీదే!

kavya N

Road Accidents: ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు .. 11 మంది మృతి

sharma somaraju

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

ఏపీ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి

sharma somaraju

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Arvind Kejriwal: బెయిల్ పొడిగించాలంటూ కేజ్రీవాల్ పిటిషన్

sharma somaraju

ష‌ర్మిల గెలిస్తే క‌ష్ట‌మే… వైసీపీలో ఇదో కొత్త‌ టెన్ష‌న్‌…!

హిందూపురంపై బెట్టింగులు.. బాల‌య్య‌పై కాదు బ్రో..?

గ‌న్న‌వ‌రం ‘ వంశీ ‘ మాస్ట‌ర్ ప్లాన్‌.. ఇంత పెద్ద స్కెచ్ వేసుకుని రెడీ అయ్యారా ?

వైసీపీలో తండ్రి – త‌నయుల ఫైట్‌.. ఎవరు గెలుస్తారు? ఎవ‌రు ఓడతారు?

BSV Newsorbit Politics Desk

వైసీపీ ఆశ‌లు.. మ‌హిళ‌లు + అవ్వాతాత‌లు = గెలిచేనా.. ?

CM Revanth Reddy: కీరవాణి స్టూడియోకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి .. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు

sharma somaraju

Poll Violence In Tadipatri: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీపై వేటు

sharma somaraju

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju