NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Child Artist Rohan Roy: హీరోల‌నే మించి పోతున్న రోహన్ రాయ్.. ఈ సుద్దపూస కుర్రాడి ఒక్క రోజు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే!

Child Artist Rohan Roy: చైల్డ్ ఆర్టిస్ట్ రోహ‌న్ రాయ్ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 90’స్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో రోహ‌న్ రాయ్ ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆదిత్య హాసన్ నిర్మించి, రచించి, దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో శివాజీ కొడుకుగా రోహ‌న్ చెల‌రేగిపోయారు. ఆదిత్య పాత్ర‌లో న‌టించాడు అన‌డం కంటే జీవించేశాడు అన‌డం చాలా క‌రెక్ట్‌. సాంప్రదాయనీ.. సుప్పినీ.. సుద్దపూసనీ అంటూ రోహన్ వేరె లెవ‌ల్ లో నవ్వులు పూయించాడు.

సుద్ద‌పూస‌ కుర్రాడిగా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాడు. ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నాడు. అయితే 90’స్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ కంటే ముందే రోహ‌న్ ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్ లో న‌టించాడు. కళ్యాణ వైభోగమే సీరియల్ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాడు. ఇందులో చారు కేశ పాత్రలో అల‌రించారు. మెల్ల‌గా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

వినయ విధేయ రామ చిత్రంలో చిన్న‌ప్ప‌టి రామ్ చ‌ర‌ణ్ గా న‌టించి మెప్పించాడు. ఆపై ఓవైపు సీరియ‌ల్స్‌, మ‌రోవైపు సినిమాల‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న రోహ‌న్ కు 90’స్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్‌ స్టార్ట్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ప్ర‌స్తుతం ఈ బుడ్డోడి చేతిలో రెండు వెబ్ సిరీస్‌లతో పాటు నాలుగైదు సినిమాలు కూడా ఉన్నాయ‌ట‌. వ‌రుస అవ‌కాశాలు వ‌స్తుండ‌టంతో రోహ‌న్‌ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో హీరోల‌నే మించి పోతున్నాడు.

ఈ సుద్దపూస కుర్రాడి ఒక్క రోజు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకైపోతారు. ఇంత‌కు ముందు ఒక రోజుకు రూ. 5 వేల రేంజ్‌లో పారితోషికం అందుకున్న రోహ‌న్‌.. ఇప్పుడు ఏకంగా రూ. 30 వేలు చొప్పున ఛార్జ్ చేస్తున్నాడ‌ట‌. టాలీవుడ్ లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న బాల‌న‌టుల్లో రోహ‌న్ కూడా చేరాడ‌ని అంటున్నారు. ఇక మ‌రో విష‌యం ఏంటంటే.. రోహ‌న్ తెలుగు కుటుంబానికి చెందిన వాడే అయినా తల్లిదండ్రులుతో బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. దీంతో రోహన్ ని తమ చిత్రాల్లో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డంతో పాటు అతడి ఫ్లైట్ టికెట్ ఖ‌ర్చులు సైతం భారిస్తున్నార‌ట‌.

Related posts

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

sharma somaraju

Fire Accident: గేమ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం ..24 మంది మృతి

sharma somaraju

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు .. బహిరంగ క్షమాపణలు చెప్పాలని జవహర్ రెడ్డి డిమాండ్

sharma somaraju

Israel Strikes: అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు .. రఫాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

sharma somaraju

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Saranya Koduri

Yakshini OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ సిరీస్.. ఎక్కడ చూడవచ్చంటే..!

Saranya Koduri

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Saranya Koduri

Mammotty Turbo OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న ముమ్మట్టి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Family Star: థియేటర్లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో సూపర్ హిట్.. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..!

Saranya Koduri

Elon Musk: ఎలాన్ మస్క్ పై సంచలన కథనం .. నాడు మిత్రుడి భార్యతో అఫైర్ అంటూ..

sharma somaraju

VV Lakshmi Narayana: ఏపీ రాజధాని అంశంపై జేడీ లక్ష్మీనారాయణ కేంద్రానికి కీలక వినతి

sharma somaraju

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

sharma somaraju

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju