Child Artist Rohan Roy: చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ గురించి పరిచయాలు అక్కర్లేదు. 90’స్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో రోహన్ రాయ్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆదిత్య హాసన్ నిర్మించి, రచించి, దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో శివాజీ కొడుకుగా రోహన్ చెలరేగిపోయారు. ఆదిత్య పాత్రలో నటించాడు అనడం కంటే జీవించేశాడు అనడం చాలా కరెక్ట్. సాంప్రదాయనీ.. సుప్పినీ.. సుద్దపూసనీ అంటూ రోహన్ వేరె లెవల్ లో నవ్వులు పూయించాడు.
సుద్దపూస కుర్రాడిగా సూపర్ పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నాడు. అయితే 90’స్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ కంటే ముందే రోహన్ పలు సినిమాలు, సీరియల్స్ లో నటించాడు. కళ్యాణ వైభోగమే సీరియల్ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇందులో చారు కేశ పాత్రలో అలరించారు. మెల్లగా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.
వినయ విధేయ రామ చిత్రంలో చిన్నప్పటి రామ్ చరణ్ గా నటించి మెప్పించాడు. ఆపై ఓవైపు సీరియల్స్, మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న రోహన్ కు 90’స్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ స్టార్ట్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ బుడ్డోడి చేతిలో రెండు వెబ్ సిరీస్‌లతో పాటు నాలుగైదు సినిమాలు కూడా ఉన్నాయట. వరుస అవకాశాలు వస్తుండటంతో రోహన్ రెమ్యునరేషన్ విషయంలో హీరోలనే మించి పోతున్నాడు.
ఈ సుద్దపూస కుర్రాడి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకైపోతారు. ఇంతకు ముందు ఒక రోజుకు రూ. 5 వేల రేంజ్లో పారితోషికం అందుకున్న రోహన్.. ఇప్పుడు ఏకంగా రూ. 30 వేలు చొప్పున ఛార్జ్ చేస్తున్నాడట. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలనటుల్లో రోహన్ కూడా చేరాడని అంటున్నారు. ఇక మరో విషయం ఏంటంటే.. రోహన్ తెలుగు కుటుంబానికి చెందిన వాడే అయినా తల్లిదండ్రులుతో బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. దీంతో రోహన్ ని తమ చిత్రాల్లో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు రెమ్యునరేషన్ ఇవ్వడంతో పాటు అతడి ఫ్లైట్ టికెట్ ఖర్చులు సైతం భారిస్తున్నారట.