NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీని ఓడించేందుకు రెడీ అవుతోన్న గంటా శ్రీనివాస్‌..!

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత గంటా శ్రీనివాస‌రావు ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న ఏం చేయ‌నున్నారు? ఇదీ.. ఒక్క విశాఖ‌లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. రాజ‌కీయాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఓట‌మి ఎరుగ‌ని నాయ‌కుడిగా ఉన్న గంటా.. అనేక పార్టీలు మారారు. అయితే, ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా.. ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కుతూనే ఉన్నారు. ఇప్ప‌టికే నాలుగు పార్టీలు మారిన ఆయ‌న త‌న 25 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఉమ్మ‌డి విశాఖ జిల్లాలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాలు మారి వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్నారు.

ప్ర‌తి ఎన్నికకు పార్టీలు మారుతున్న‌ట్టుగానే గంటా ప్ర‌తి ఎన్నిక‌కు నియోజ‌క‌వ‌ర్గం కూడా మార‌డం అల‌వాటు గా చేసుకున్నారు. ఈ సారి టీడీపీ ఆయ‌న‌కు విజ‌యన‌గ‌రం జిల్లాలోని చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఇచ్చింది. ఇది మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు కంచుకోట‌. ఇక్క‌డ నుంచి గంటా ను బ‌రిలో నిలిపి.. వైసీపీకి షాకి వ్వాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే.. విశాఖ‌లో ఎక్క‌డ ఇచ్చినా.. తాను రెడీనేన‌ని, కానీ, జిల్లా మారి రాజ‌కీయాలు చేయ‌డం కేడ‌ర్ లేకుండా క‌త్తులు ప‌ట్టుకుని తిర‌గడం త‌న వ‌ల్ల‌కాద‌ని.. గంటా చెబుతు న్నారు.

ఇదే విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా మ‌రోసారి కూడా చంద్ర‌బాబుకు వివ‌రించారు. భీమిలి, అన‌కాప‌ల్లి, విశాఖలో ఏ చోటైనా స‌రే.. తాను సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం చీపురుప‌ల్లి త‌ప్ప‌.. మ‌రో ఆప్ష‌న్ వైపు మొగ్గు చూప‌లేదు. ప్ర‌స్తుతం ఎంతో బిజీగా ఉన్న చంద్ర‌బాబు గంటా కోసం సుమారు 30 నిమిషాల స‌మ‌యం కేటాయించారు. ఈ 30 నిమిషాల్లోనూ ఎలాంటిప‌రిష్కారం ల‌భించ‌క‌పోగా.. ఎవ‌రి వాద‌న‌ను వారు వినిపించారు. దీంతో గంటా వ్య‌వ‌హారం ముడి ప‌డ‌లేదు.

అయితే.. త‌న అనుచ‌రుల‌తో మాట్లాడి వ‌స్తాన‌ని చెప్పిన గంటా.. త‌న ప్ర‌య‌త్నాలు తాను ముమ్మ‌రం చేసుకుంటున్నారు. అయితే.. లోక‌ల్‌గానే త‌న‌కు టికెట్ ఇవ్వాల‌నేది ఆయ‌న ప్ర‌ధాన డిమాం డ్‌.
లేక‌పోతే.. పార్టీలు మారాల‌ని కూడా త‌న‌కు లేద‌ని గంటా శ్రీనివాస‌రావు తేల్చి చెబుతున్నారు. కాదు కూడ ద‌ని అంటే.. తాను స్వతంత్రంగా అయినా బ‌రిలో నిలిచేందుకు వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నట్టు స‌మాచారం.

ఇదే జరిగితే..ఆయ‌న ఎక్క‌డ నిల‌బ‌డినా.. టీడీపీ ఓటు బ్యాంకును ఆయ‌న త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అక్క‌డ టీడీపీ ఓట‌మి కూడా ఖాయం అవుతుంది. దీంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రోసారి గంటా విష‌యాన్ని తేల్చాల‌ని స్థానిక నేత‌లు కోరుతున్నారు. ఎందుకంటే.. గంటా పోటీకి దిగితే.. త‌మ సీట్ల‌కే ఎస‌రు వ‌స్తుంద‌నేది వారి భావ‌న‌. మ‌రి ఏం చేస్తారోచూడాలి.

Related posts

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

sharma somaraju

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?