NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దెందులూరు Vs పిఠాపురం… త‌ప్పు ఎవ‌రిది.. ఏం జ‌రిగింది..!

రాజ‌కీయాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క ర‌కంగా మారిపోతున్నాయి. ఉమ్మ‌డి కూట‌మి పార్టీల మ‌ధ్య ఐక్య‌త ఉందా? లేదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన కేడ‌ర్ ఆశ‌ల‌కు మాత్రం కొంత భంగ‌పాటు త‌ప్ప‌డం లేదు. టికెట్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. స‌హ‌జంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఊపు రావాలి. పైగా.. మూడు పార్టీల కూట‌మి(టీడీపీ-జన‌సేన‌-బీజేపీ) కార్య‌క‌ర్త‌లతో హోరెత్తిపోవాలి. కానీ, అలాంటి ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీనికి ఎవ‌రు బాధ్యులు అనేది ప్ర‌శ్న‌.

స‌రే.. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. చంద్ర‌బాబు నాయుడు టికెట్లు ఎనౌన్స్ చేసిన త‌ర్వాత‌.. దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో దీపావ‌ళి పండుగ వ‌చ్చిన‌ట్టు అయింది. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నారు. దెందులూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల త‌ర్వాత‌.. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కే కేటాయించారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. టీడీపీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

క‌ట్ చేస్తే.. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఈ త‌ర‌హా వాతావ‌ర‌ణం జ‌న‌సేన‌లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఎం దుకంటే.. ఈ సీటు నుంచి తానే పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ చెప్పారు. దీంతో వాస్త‌వానికి పిఠాపురంలో సంబ‌రా లు అంబ‌రాన్నంటాలి. పైగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ ఇక్క‌డ నుంచి రంగంలోకి దిగుతాన‌ని చెప్పాక‌.. ఇక‌, ఆయ న అభిమానుల ఆనందం క‌ట్ట‌లు తెగాలి. ఉవ్వెత్తున సంబ‌రాలు ఎగిసి ప‌డాలి. ప‌వ‌న్‌.. ప‌వ‌న్ నినాదాల‌తో నియోజ‌క‌వ‌ర్గం హోరెత్తిపోవాలి.

అయితే.. ఇలాంటివేవీ క‌నిపించ‌లేదు. పైగా.. మిత్ర‌ప‌క్షం టీడీపీ నుంచి కార్య‌క‌ర్త‌లు రోడ్డెక్కారు. తీవ్ర నిర స‌న వ్య‌క్తం చేశారు. జెండాలు, బ్యాన‌ర్లు త‌గ‌ల‌బెట్టారు. కట్ చేస్తే.. వివాదం ఇప్పుడు చంద్ర‌బాబు చెంత‌కు చేరింది. ఏదో ఒక ర‌కంగా ప‌రిష్కారం అయితే చూపుతారు. కానీ, ఈ ప‌రిష్కారం.. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్తల ను ముందుకు న‌డిపిస్తుందా? ప‌వ‌న్‌కు జేజేలు కొట్టేలా చేస్తుందా? అనేది మౌలిక ప్ర‌శ్న‌.

ఎలా చూసుకు న్నా.. ముందు నుంచి ప్లాన్ లేక‌పోవ‌డం.. త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు.. వేచి ఉండ‌డాలు ఇలా అనేక అంశాలు.. ఇలాంటి వివాదాల‌కు దారితీయ‌డం గ‌మ‌నార్హం. దీనికి ఎవ‌రు బాధ్యులు అంటే.. ప‌వ‌నే బాధ్యుడ‌ని చెప్పాలి. కేడ‌ర్ను ఏర్పాటు చేసుకోకుండా చోద్యం చూడ‌డం ఆయ‌న చేసిన ప్ర‌ధ‌మ త‌ప్పిద‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N