NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 1st Episode: పారు.. దీప దగ్గరికి వచ్చి కొంత డబ్బు ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెబుతుంది. ఇంకెప్పుడూ ఈ ఇంటి చాయలకు కూడా రావద్దని హెచ్చరిస్తుంది. సుమిత్ర లోపల కూతురు దగ్గర కూర్చుని ఏడుస్తుందని తెలుపుతుంది. దీప డబ్బులు పారు చేతిలో పెట్టి వెళ్లిపోమ్మని చెప్తుంది. శౌర్య రాగానే ఊరు వెళ్తామని అంటుంది. సైకిల్ తెచ్చుకోవడానికి ఊరు వెళ్తున్నానని చెప్పేసరికి శౌర్య చాలా సంతోషపడుతుంది. కూతురు మెడలో శివ నారాయణ వేసిన చైన్ కూడా తీసి అక్కడే పెట్టేస్తుంది దీప. ఎలా వచ్చాము అలాగే వెళ్ళిపోవాలని అనుకుంటున్నామని సుమిత్రాకు మనసులోనే క్షమించమని చెబుతుంది దీప. ఇక దీపా మరియు శౌర్య రోడ్డుమీద నడుస్తూ వెళ్లడం కార్తీక్ చూస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారని శౌర్యని కార్తీక్ అడుగుతాడు. సైకిల్ తెచ్చుకోవడానికి వెళ్తున్నామని శౌర్య అంటే మరి నాకు చెప్పలేదే అని కార్తీక్ అంటాడు. అమ్మమ్మకి చెప్పామని అనేసరికి కార్తీక్.. దీప వైపు చూస్తాడు.

Karthika Deepam 2 May 1st Episode
Karthika Deepam 2 May 1st Episode

ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్తున్నారని అర్థమయింది. టీవీలో వచ్చిన న్యూస్ గురించి మిమ్మల్ని ఎవరైనా అన్నారా అని అడుగుతాడు కార్తీక్. నేను ఊరు వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోతున్నానని చెబుతుంది దీప. పాప దృష్టిలో నాన్న ఇంకా దొరకలేదు కదా. ఆ నాన్న ఎప్పటికీ దొరకడు.. ఎందుకంటే అలాంటి నాన్న కూడా లేడు. అది కోరుకునే మంచి నాన్నని తీసుకురాలేను. అలాగనే ఆ నీచుడిని నాన్న అని చెప్పలేను. ఏదో ఒక రోజు నాన్న ఎక్కడ అని అంటే ఏం చెప్తారని అడుగుతాడు. మీ నాన్న చచ్చిపోయాడని చెప్తానని అంటుంది దీప. నాన్న చేతిలో పెరిగి నాన్న తప్ప ఎవరు లేకుండా ఉన్న నేను నా కళ్ళ ముందే మీరు నాన్నని చంపేస్తే ఆయనతో పాటు నేను చనిపోలేదు కదా. నేనే తట్టుకున్న అది తట్టుకోలేదా? దాని కళ్ళ ముందుకు వచ్చిన బూచోడు నాన్న అని చెప్తే అది నాన్న అనే పిలుపుని అసహ్యించుకుంటుంది.

నన్ను ఎవరో ఏదో అన్నారని కాదు.. నా గురించి నేను ఆలోచించుకుని దొంగలా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతున్నానని అంటుంది దీప. అంత అవసరం ఏంటని అడుగుతాడు కార్తీక్. కారణం మీరే బాబు. మీరు పాపకు ఎంత దూరంగా ఉండమని చెప్తే అంత దగ్గరవుతున్నారు. అది నా దగ్గర ఉన్న మీ గురించి మాట్లాడుతూ ఉంటుంది. నిజం దానికి తెలియదు కదా మీరు దానిమీద చూపించే ప్రేమ నటన అని. నా కూతురు ద్వారా నా దృష్టిలో మంచివాడు అనే ప్రయత్నం చేస్తున్నారు. నాకు అవసరం లేదు. నా తండ్రి తిరిగి రాడు అనేది ఎంత నిజమో నా తండ్రిని చంపేసిన మిమ్మల్ని కూడా క్షమించలేను. నేను ఇక్కడే ఉంటే మీరే దాని తండ్రిని చూపిస్తారు ఏమో లేదంటే అది నా గురించి ఏమైనా అనుకుంటుంది. కార్తీక్ నిజం చెప్పడానికి చూస్తుంటే దీప చెప్పనివ్వకుండా ఆపేస్తుంది. కార్తీక్ వడ్డీ మహేష్ దగ్గర ఉన్న అప్పు గురించి మాట్లాడుతాడు.

వాడు మీ ఇంటి దగ్గర గొడవ చేస్తుంటే దారిలో హ్యాపీ మీ ఇంటి అడ్రస్ అడిగాను. మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. లాగిపెట్టి కొట్టానని చెబుతాడు. ఆరోజే నాకు అర్థం అయింది ఊర్లో మీ పరిస్థితి ఏంటోనని అంటాడు. దీప కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను ఒక మాట అన్నాడని చంప మీద కొట్టారు. కానీ వాడు నా గుండెల మీద కొట్టాడు నా ఆడతనాన్ని పంచాయితీ పెట్టాడు. ఏ తోడు లేని నేను దిక్కు తోచని స్థితిలో కూతురిని తీసుకుని తెలియని ఊరికి మొగడిని వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది. మీరు మల్లేష్ ని కొట్టిన చంప దెబ్బ నన్ను నడి రోడ్డుమీద నిలబెట్టింది. నేను అడక్కుండానే ఎంతో సాయం చేశారు. ఇది మంచిదే కొన్ని నిజాలు తెలిసాయి. ఇక్కడే ఉంటే మీరు నా కూతురుని కూడా దూరం చేస్తారు. మేము మీకు కనిపించిన విషయం మీరు ఎవరితో చెప్పకండి అంటూ శౌర్యను తీసుకుని దీప వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పేది విన్న తర్వాత నాకు క్షమించమని అడిగే అర్హత కూడా లేదని అర్థం అయింది. ఇక ఈ బాధని జీవితాంతం మోయాల్సిందేనని అనుకుంటాడు. పోలీసులు ఇంటికి వచ్చి సుమిత్ర మీద దాడి చేసిన వాళ్లని పట్టుకున్నామని ఐడెంటిఫేషన్ కోసం దీపని రమ్మని చెబుతాడు.

Karthika Deepam 2 May 1st Episode
Karthika Deepam 2 May 1st Episode

 

దీపని పిలవమని జ్యోత్స్న కి చెప్తారు. ఇల్లు గడి పెట్టి ఉండటం, బట్టలు కూడా లేకపోవడం చూసి దీప వెళ్ళిపోయిందని అర్థం చేసుకుంటుంది జ్యోత్స్న. దీప వెళ్ళిపోయిందని సుమిత్ర వాళ్లకి చెబుతుంది. కబోర్డ్ లో చైన్ దొరికిందని చెప్పి ఇస్తుంది. దీప ఊరు వదిలి వెళ్ళిపోయిందని తెలిసి పారు సంతోషపడుతుంది. ఎస్సై సుమిత్ర వాళ్లని నిందిస్తాడు. తాను వెళ్ళిపోయిందా లేదా మీరే సైలెంట్ గా పంపించేసారా? అడుగుతాడు. సుమిత్ర గారి మీద ప్రమాదం కేసు, జ్యోత్స్న యాక్సిడెంట్ కేసులో ప్రధాన సాక్షి దీప. మొదటి కేసు మీకు అవసరం కాబట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. రెండో కేసు మీకు ప్రమాదం కాబట్టి సాక్షాన్ని మాయం చేశారని ఎస్ఐ నిందిస్తాడు. దీప బాధ్యత మీరే తీసుకున్నారు కదా మీ కూతురు దాకా వచ్చేసరికి పంపించేశారా? అని నోటికొచ్చినట్లు మాట్లాడుతాడు. ఇంతలోగా కార్తీక్ వచ్చి తనని ఆపుతాడు. దేపని ఎవరు పంపించలేదని తానే వెళ్లిపోయిందని చెబుతాడు. దీప ఎక్కడ ఉందో తెలుసా అని ఎస్ఐ అంటే తెలుసని అంటాడు. మీరు ఎవరిమీద నిందలు వేయాల్సిన అవసరం లేదు దీపని తీసుకొస్తానని కార్తీక్ సిఐతో చెబుతాడు. అక్కడితో కార్తీకదీపం 2 మే ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar