NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

Krishna Mukunda Murari Today Episode April 25 2024 Episode 454 highlights

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: కృష్ణ కి హాస్పిటల్లో జరిగిన విషయాన్ని దాచిపెడతాడు మురారి. ముకుంద కృష్ణని నువ్వు మీ అత్తయ్య కోరిక నెరవేర్చే పనిలో ఉండమని, రెండు బొమ్మల్ని తీసుకువెళ్లి కృష్ణ కి ఇస్తుంది. కృష్ణా మురారి దగ్గరికి వెళ్లి ఇంట్లో అందరూ కూడా అని చూపిస్తుంది. అప్పటికే మురారి చాలా కోపంగా ఉంటాడు కృష్ణకి నిజం చెప్పలేక సతమతమవుతూ ఉంటాడు. కృష్ణ ఏం చెప్తున్నా కానీ వినిపించుకోకుండా ఉంటాడు సార్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. ఏమైంది ఏసీపీ సార్ మీరు నిన్నటి నుంచి అదోలా అంటున్నారు. మాట్లాడిస్తుంటే మాట్లాడట్లేదు నాకు దూరంగా ఉంటున్నారు ఏమైంది అని అడుగుతుంది అయినా సైలెంట్ గా ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode April 25 2024 Episode 454 highlights
Krishna Mukunda Murari Today Episode April 25 2024 Episode 454 highlights

ఉదయ్ కృష్ణ కోపంగా ఏంటి మీరు తాగొచ్చారా ఏంటి అయినా ఎప్పుడూ తాగేటప్పుడు నాతో చెప్తారు కదా ఈసారి తాగరాలని నాకు చెప్పకుండా చేశారా ఏంటి ఆయన ఎందుకు ఉంటే ఇలా బిహేవ్ చేస్తున్నారు అని గట్టిగా అడుగుతుంది దాంతో ఒకసారిగా మురారి తాగాను అయితే ఏంటి బాధ భరించలేక తాగాను, వెంటనే కృష్ణ అంత బాధ భరించలేకుండా ఏముంది అంత టెన్షన్ పడాల్సిన విషయం ఏంటి నాకు చెప్పలేకుండా మీకు మీరే బాధపడే అంత పెద్ద విషయం ఏమైంది అని అడుగుతుంది కృష్ణ వెంటనే మురారి నిజం చెప్పి ప్రిపేర్ చేద్దామంటే నేనే భయపడి తన దగ్గర ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కృష్ణకు ధైర్యం చెప్పి ఆ తర్వాత నిజం చెప్పాలి ముందు నాకు ధైర్యం తెచ్చుకోవాలి అని అనుకుంటాడు. మరి ఏం లేదు కృష్ణ నీకు కడుపులో నొప్పి వచ్చింది అని నువ్వు బాధపడిన విషయం గుర్తుకు వస్తే నాకు ఇప్పటికీ భయం వేస్తుంది నీకేమైనా అయితే నేను చూస్తూ ఊరుకోలేను అని అంటాడు నాకేం అవుతుంది అయినా నాకేం కాలేదు కదా అని అంటుంది. అదేం లేదులే కృష్ణా నది ఒకటే బాధ అని కృష్ణ మురారి ఇద్దరు కిందకి మేడ దిగి వస్తూ ఉంటారు. అప్పుడే ఆదర్శం ముకుందతో మాట్లాడాలని పిలిపిస్తాడు ఆదర్శ దగ్గరికి వచ్చిన ఏంటి నన్ను పిలిచారట ఏం చెప్పాలి అని అంటుంది. ఒక ఆదర్శ్ ముకుందా మాట్లాడుకోవడం కృష్ణ మురారి దూరం నుంచి చూస్తూ ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode April 25 2024 Episode 454 highlights
Krishna Mukunda Murari Today Episode April 25 2024 Episode 454 highlights

ఇక ఆదర్శ్ ముకుందతో నేను నా మనసులో వున్నా మాటను నీకు చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు. చెప్పండి అని అంటుంది ముకుంద ఆ తర్వాత నువ్వు ఎలా ఫీలవుతావా అని భయంగా ఉంది అని అంటాడు. నాకు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు మీ ఇంట్లో నేను ఉంటున్నాను అలాంటప్పుడు నేనేం అనుకోను చెప్పండి అని అంటుంది ముకుంద. మీరేం చెప్పినా వినడం తప్ప, ఏమనుకోను అని అంటుంది. చెప్పడానికి ఆలోచిస్తున్నాను అని అంటాడు ఆదర్శ. చూడు ముకుందా నేను నీకు చెప్పాల్సింది చెప్పాక, నేను ఇంట్లో ఉన్నాను అని అలుసుగా తీసుకొని ఇలా మాట్లాడుతున్నారు అని నువ్వు అనకూడదు అని అంటాడు. మీరు అంత అలుసుగా మాట్లాడే వారే అయితే ఇంతలా ఆలోచించరు అని అంటుంది. ఆలోచిస్తున్నారంటే కచ్చితంగా నా ఆత్మ అభిమానం కి విలువ ఇచ్చినవారు మీరేం చెప్పాలనుకుంటున్నా నిర్భయంగా చెప్పొచ్చు అని అంటుంది ముకుంద. కృష్ణ మురారి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు.ఇక ఆదర్శ్ గులాబీలు తీసుకొని ముకుంద కి ప్రపోజ్ చేస్తాడు. ఒకసారిగా ముకుంద షాక్ అవుతుంది. కృష్ణ మురారి కూడా షాక్ అవుతారు. ఐ లవ్ యు ముకుంద అని అంటాడు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. నన్ను వదిలి వెళ్ళిన ముకుంద నాకోసం వచ్చినట్టు అనిపించింది. ముకుంద పోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాతే నాలో తెలియని ఆశలు మొదలయ్యాయి. హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్న వాడిని నిన్ను చూసి ఆగిపోయాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వు వచ్చాక, నేను తిరిగి మామూలు మనిషిని అయ్యాను. అందుకే నాకు ఇష్టమైన ముకుంద పేరు పెట్టాను. నువ్వు లేకపోతే, మళ్లీ ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. నా మీద నాకే విరక్తి పుడుతుంది ఆదర్శ అలా మాట్లాడుతూ ఉంటే ముకుంద ఏం చెప్పాలో తెలీక ఆశ్చర్యంతో నిలబడి చూస్తూ ఉంటుంది దూరం నుంచి కృష్ణ మురారి కూడా చూస్తూ ఉంటారు. అప్పటికే కృష్ణకు చాలా కోపం వస్తుంది. ఆదర్శ్ నువ్వు నా దానివి కావాలి ముకుందా, నువ్వు సరే అంటే మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని అంటాడు. ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ ముకుందా అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 25 2024 Episode 454 highlights
Krishna Mukunda Murari Today Episode April 25 2024 Episode 454 highlights

ఇక ఆదర్శ ఎలా ప్రపోజ్ చేసేటప్పటికి కృష్ణకు చాలా కోపం వస్తుంది ముకుంద ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే కృష్ణ కోపంగా వెళ్లి ఆదర్శ్ చేతిలో ఉన్న గులాబీలు తీసి నేలకేసి కొడుతుంది. ఆదర్శ కి బాగా కోపం వస్తుంది అసలే కృష్ణ అంటే ఆదర్శకు పడదు ఇప్పుడు కృష్ణ ఇలా చేసేసరికి ఆదర్శ కోపంతో రగిలిపోతాడు. కృష్ణా అసలు ఏం చేసావో అర్ధం అవుతుందా అని అంటాడు. నువ్వేం చేసావో నీకు అర్థం అవుతుందా ఆదర్శాన్ని అంటుంది కృష్ణ. ముఖం అంటే నాకు ఇష్టం నా మనసులో మాటని దానికి చెప్తున్నాను అయితే నీకు ఏంటి అని అంటాడు. నాకు కాదు మీ కుటుంబానికి చాలా నష్టం అని అంటుంది. అసలు మీరాకి ముకుందా అని పేరు పెట్టడమే నువ్వు చేసిన పెద్ద తప్పు ఆదర్శ అని అంటుంది కృష్ణ. అది నా ఇష్టం నాకు నచ్చిన మనిషికి నాకు నచ్చిన పేరు పెట్టుకుంటాను మధ్యలో నీకేంటి అని అడుగుతాడు ఆదర్శ. అంత నీ ఇష్టం అని అనుకోవడానికి నువ్వు ఇప్పుడు హిమాలయాల్లో లేవు కుటుంబంలో ఉన్నావ్ అది గమనించు అని అంటుంది కృష్ణ. నువ్వు తీసుకునే ఏ నిర్ణయం అయినా కుటుంబానికి కీడు చేసేలా ఉండకూడదు అని అంటుంది కృష్ణ. ముకుంద నేను పెళ్లి చేసుకుంటే ఇంటికి కీడు చేసినట్టు అవుతుందా అని అడుగుతాడు ఆదర్శ. కృష్ణ ఏం చెప్పిందో ఒకసారి విను మురారి ఏంటి తను అలా మాట్లాడుతుంది అని అంటాడు ఆదర్శ్. తను చెప్పింది నిజమే కదా అని అంటాడు మురారి నువ్వు కూడా ఏంట్రా అని అంటాడు ఆదర్శ. నేను ముకుందని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు ఆదర్శ్ వీల్లేదు అని అంటుంది కృష్ణ. అసలు నువ్వు ముకుందని అదే మీరాని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు చేసుకోవాలి దానికి నీకు మీరా గురించి ఏం తెలుసు, ఒకవేళ నువ్వు చేసుకోవాలి అని అనుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని అడగాలి. వాళ్లకి ఇష్టం లేకపోతే వదిలేయాలి. అంతేకానీ నీ ఇష్టం అంటే కుదరదు అర్థమవుతుందా అని కృష్ణ గట్టిగా ఉంటుంది దాంతో ఒక్కసారిగా ఆదర్శ్ నిధుల్లో నుంచి మెలకువ వస్తుంది ఇదంతా కల అని అప్పుడే మనకు అర్థం అవుతుంది. ఆదర్శ్ ముకుంద కి ప్రపోజ్ చేస్తే కృష్ణ గొడవ చేస్తుందని కలగంటాడు. ఆదర్శ్ నిద్రలో నుంచి లేచి అయినా కృష్ణ ఎందుకు ఇలా అడ్డుకుంటుంది నేను సంతోషంగా ఉండడం తనకి ఎప్పుడు ఇష్టం ఉండదు కదా అని అనుకుంటాడు. మురారి కూడా కృష్ణ చెప్పింది వినుమంటున్నాడు. వాళ్ళు ఎలా అనుకుంటే నాకేంటి, ముకుందా ఏమనుకుంటుందో అదే నాకు ముఖ్యం ఇప్పుడే ముకుంద దగ్గరికి వెళ్తాను అని అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 25 2024 Episode 454 highlights
Krishna Mukunda Murari Today Episode April 25 2024 Episode 454 highlights

ఇక ముకుందా తన గదిలో డైరి రాసుకుంటూ ఉంటుంది. అందులో కృష్ణ కి ఇంకొక నాలుగు రోజుల్లో హాస్పిటల్ లో గర్భసంచి తీసేస్తారు ఆ తర్వాత కృష్ణ కి ఇక జీవితంలో పిల్లల పుట్టరు. తన గొడ్రాలు అన్న విషయం పదేపదే ఇంట్లో వాళ్లకి మనసులోకి వెళ్లేలా చేస్తాను ఇక ఆ తర్వాత కృష్ణ మీద ఇష్టం పుట్టించి నామీద ఇంట్లో వాళ్లకి ఇష్టం కలిగేలా చేస్తాను అదే నా ఎజెండా అని డైరీలో రాసుకొని అదే చదువుకొని ఆనందిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు నేను ఈ ఇంటి మనిషిని అవుతాను కాదు మురారి భార్యని అవుతాను అని రాసుకుంటుంది. ఈరోజు నుండి నా కార్యచరణ ప్రారంభమవుతుంది అని రాసుకుంటుంది. అప్పుడే ఆదర్శ రూమ్ లోకి వచ్చి ముకుందని చూస్తూ ఉంటాడు. ముకుంద ఆదర్శ చూసి డైరీ ని దిండు కింద దాచిపెడుతుంది. ఇదేంటి ఆదర్శి టైంలో వచ్చాడు అని మనసులో అనుకుంటుంది. ఏంటి ముకుందా నేను రావడం చూసి ఏదో దాచి పెడుతున్నావ్ అని అడుగుతాడు. అదేం లేదు నేను దాస్తుండగా మీరు వచ్చారు అంతే అని అంటుంది. ఇంత భద్రంగా దాస్తున్నావు అంటే ఏంటో అది అని అంటాడు ఆదర్శ. పద నా డైరీ అని అంటుంది. ఓహో నీకు డైలీ రాసే అలవాటు ఉందా డైరీ రాసే అమ్మాయిలకి అందమైన మనసు ఉంటుంది అంటారు. ఏంటి ఈ టైంలో వచ్చి నాకు పులిహోర కలుపుతున్నాడు అని అనుకుంటుంది. అవును టైం చాలా అవుతుంది మీరు ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. మీకు ఇంకా నిద్ర రాలేదా అని అడుగుతుంది కొన్ని ఆలోచనలు నిద్ర పట్టేలా ఉండటం లేదు అని అంటాడు. ముకుందా బాగా ఆలోచించి ఆలోచించి, నీకు ఒక విషయం చెబుదామని వచ్చాను అని అంటాడు. ముకుంద ఈ టెన్షన్ మొదలవుతుంది ఏం చెప్తాడు ఏంటో అని అనుకుంటుంది. ముకుంద కి ఆదర్శ్ రేవతి తో పెళ్లి గురించి మాట్లాడిన విషయం గుర్తుకు వస్తుంది అదంతా అప్పటికే ముకుంద చూసి ఉంటుంది దానితో కొంపతీసి ఇప్పుడు నా దగ్గర పెళ్లి టాపిక్ తీసుకొస్తాడా ఏంటి అని అనుకుంటుంది. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటుంది. ముకుందా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కూర్చొని మాట్లాడుకుందాం అని అంటాడు. నిజంగా ముఖ్యమైన విషయమా అని అంటుంది. అయితే ఇప్పుడు చెప్పద్దు అని అంటుంది ఎందుకు అని అడుగుతాడు ఆదర్శ. ఈరోజుకి నా డైరీ రాయడం అయిపోయింది మీరు చెప్పే విషయం ముఖ్యమైంది అయితే నేను నా ఆ విషయాన్ని డైరీలో రాయాలి కదా, ఈరోజు రాసేది నా డైరీ పేజీ నిండిపోయింది అందుకని మీరు ఆ విషయాన్ని రేపు చెబుతారు అని అంటుంది. అప్పుడు నేను కూడా ఫ్రెష్ గా ఆ విషయాన్ని డైరీలో రాసుకుంటాను అని అంటుంది. పైగా నాకు బాగా నిద్ర కూడా వస్తుంది అని అంటుంది. ఇంక నిద్ర మధ్యలో మీరు ఏదైనా చెప్తే నేను ఎలా రెస్పాండ్ అవుతానో నాకే తెలియదు అని అంటుంది. రేపు ఉదయం మీరు జాగింగ్ కి వెళ్తారు కదా అప్పుడు మీతో పాటు నేను వస్తాను అప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం అని అంటుంది. నిజంగా నువ్వు నాతో పాటు జాగింగ్ కి వస్తావా అని అడుగుతాడు ఆదర్శ. వై నాట్ నాకు జాయిన్ చేసి అలవాటు ఉంది అని అంటుంది. రోజు మీరు ఒక వైపు వెళ్తారు నేను ఒక వైపు వెళ్తాను రేపు ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటుంది. అయితే రేపు ఉదయమే వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదర్శ్. నేను వాడకం వయ్యారాలు చూస్తుంటే కచ్చితంగా ప్రపోజ్ చేయడానికి వచ్చాడు ఇప్పటికైతే తప్పించుకున్నాను. ఉదయాన్నే కూడా ఇలా తప్పించుకోవాలో ఆలోచించాలి అని అనుకుంటుంది. ఒంటరిగా ఎప్పుడు ఆదర్శ్ కి కనపడకూడదు అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 25 2024 Episode 454 highlights
Krishna Mukunda Murari Today Episode April 25 2024 Episode 454 highlights

ఇక మరోవైపు కృష్ణ, భవానీకి ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటూ ఉంటుంది వచ్చే జనవరి కల్లా మీ చేతిలో మన వలన మనవరాలు పెడతాను అని అన్న మాట గుర్తు చేసుకుంటుంది. ఇక మరోవైపు అప్పుడే కృష్ణ బాధపడడం మురారి తట్టుకోలేకపోవడం గుర్తుకొచ్చి కూడా బాధపడుతుంది నీకేమైనా అయితే నేను తట్టుకోలేను కృష్ణ అని మురారి చెప్పడం గుర్తుకు వచ్చి బాధపడుతుంది. ఇక ఉదయం తెల్లవారుజామునే ఆదర్శ్ జాగింగ్ కి బయలుదేరుతాడు ఇప్పుడు నేను ముకుందతో కలిసి జాగింగ్ కి వెళ్ళబోతున్నాను అని సంతోషిస్తూ బయటకు వస్తాడు. ఎలాగైనా సరే ఈరోజు ముకుందకి నా మనసులో మాట చెప్పేయాలి అని అనుకుంటాడు ముకుందకి నేనేం చెప్పబోతున్నాను ఆల్రెడీ తెలిసే ఉంటుంది అని అనుకుంటాడు. అందుకే ఎవరూ లేకుండా జాయిన్ కి వెళ్తూ మాట్లాడుకుందాం అని అంది అని మురిసిపోతూ కిందకి వస్తాడు. అప్పుడే ముకుంద కూడా తన రూమ్ లో నుంచి బయటికి వస్తే ఆదర్శ చూసి, వెంటనే తలపు వేసుకుంటుంది. రాత్రి ఏదో తప్పించుకోవడానికి రేపు ఉదయం జాయిన్ కి వెళ్దాం అని అంటే నిజంగానే ఆ మాట పట్టుకొని వచ్చేసాడు అని అనుకుంటుంది. ఆదర్శ్ ముకుంద గది దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. ముకుందా ముకుందా అని పిలుస్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ముకుంద గదిలోపల ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో కృష్ణ హాస్పిటల్ లో సెలైన్ పెడుతూ ఉంటారు మామూలు కడుపులో నొప్పి అని చెప్పారు కదా మరి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది కృష్ణ. అసలు నా రిపోర్ట్స్ లో ఏముంది ఒకసారి నా రిపోర్ట్స్ నాకు ఇవ్వండి అని వేరే డాక్టర్ నుంచి రిపోర్ట్స్ తీసుకొని చూస్తుంది ఆ డాక్టర్ కృష్ణ తో నీ గర్భసంచి పూర్తిగా డామేజ్ అయిపోయింది అని చెప్తుంది. నీకు మీదట పిల్లలు పుట్టాడు కృష్ణ అని నిజం చెప్తుంది డాక్టర్ ఇక దాంతో కృష్ణ ఒకసారి గా షాక్ అవుతుంది. అదంతా ముకుంద దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మురారి కృష్ణ ఏమైంది ఏడుస్తున్నావ్ అని అడుగుతాడు వెంటనే నాకు గర్భసంచి పూర్తిగా డామేజ్ అయిపోయింది నాకు ఇంకా పిల్లలు పుట్టారంటే ఏసీపి సార్ అని అంటుంది. నాగర్భ సంచి తీసేస్తారు అని ఏడుస్తూ ఉంటుంది. మురారి కృష్ణ నీ దగ్గరికి తీసుకొని ఓదారుస్తాడు అదంతా ముకుంద చూస్తూ ఉంటుంది.

Related posts

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Saranya Koduri

Yakshini OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ సిరీస్.. ఎక్కడ చూడవచ్చంటే..!

Saranya Koduri

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Saranya Koduri

Mammotty Turbo OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న ముమ్మట్టి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Family Star: థియేటర్లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో సూపర్ హిట్.. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..!

Saranya Koduri

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

bharani jella

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri