ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లోనే ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. గ్రౌండ్ స్థాయిలో ప్రచారం చేస్తూ తమ విజయాలను ఖరారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుకు అడుగులు వేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలోనే ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు డేంజర్ బెల్స్ మోగుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈసారి అంబటి రాంబాబుకు ఎదురీత తప్పదని గ్రౌండ్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. గత ఐదు సంవత్సరాల పాలనలో… వైసిపి పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. అలాగే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చే ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా తమ సంక్షేమ పథకాల కింద ఇంటికి లక్ష రూపాయలు అందించింది వైసీపీ సర్కార్.
అలాగే ఏపీ వ్యాప్తంగా ఉన్న చాలా ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రయత్నం కూడా చేసింది. ఇక ఇవి తప్పితే… వైసీపీ పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని గ్రౌండ్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. వైసిపి పార్టీ తరఫున ఎలాంటి బలమైన నాయకుడు రంగంలో ఉన్నా కూడా… గెలుపు కష్టమే అని చెబుతున్నారు. మంత్రి అంబటి రాంబాబుకు కూడా అదే పరిస్థితి నెలకొందని సమాచారం అందుతోంది.
సత్తనపల్లి నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా అంబటి రాంబాబు రంగంలో ఉంటే… కూటమి తరఫున మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రంగంలో ఉన్నారు. దీంతో అందరికన్నా సత్తెనపల్లి నియోజకవర్గం పైన పడింది. అయితే ఈ ఇద్దరు నాయకులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అందుకే సత్తెనపల్లి నియోజకవర్గంలో టైట్ ఫైట్ నడుస్తోంది. ఏపీ మంత్రి రాంబాబు… నియోజకవర్గానికి ఏం పనులు చేయలేదని ఓ వాదన ఉంది. అలాగే సంక్రాంతి సంబరాలు వస్తే డ్యాన్సులు తప్ప ఆయన వల్ల నియోజకవర్గానికి ఒరిగిందేది లేదని కొంతమంది చెబుతున్నారు.
దానికి తగ్గట్టుగానే అంబటి రాంబాబుకు బలమైన ప్రత్యర్థి గా కన్నా లక్ష్మీనారాయణ రంగంలోకి దిగాడు. ఆయన స్థానికేతరుడు అయినప్పటికీ… గతంలో అనేక పదవులు చేపట్టి.. చాలా కార్యక్రమాలు చేశారు. అలాగే కూటమి వేవు ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి వేవ్ కారణంగా… సత్తనపల్లి లో కన్నా లక్ష్మీనారాయణకు కాస్త అడ్వాంటేజ్ ఉన్నదని చెబుతున్నాయి రిపోర్ట్స్. కొంతమంది తెలుగుదేశం అసంతృప్తి నాయకులు… కన్నాను వ్యతిరేకించినప్పటికీ… అంబటి రాంబాబు పై ఉన్న వ్యతిరేకతతో ఆయన గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మరి సత్తనపల్లిలో ఏం జరగబోతుందో త్వరలోనే క్లారిటీగా పోతుంది.