NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

విశాఖ పార్ల‌మెంటు వేదిక‌గా ఈ సారి మంచి ర‌స‌వత్త‌ర పోరు చూడ‌బోతున్నాం అని ఆశ‌ప‌డిన పొలిటిక‌ల్ ప్రియుల‌కు ఎన్నిక‌లు దగ్గ‌ర ప‌డుతోన్న కొద్ది ఆ మ‌జా ద‌క్క‌డం లేదు. ఇక్క‌డ వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ పేరు ప్ర‌క‌టించ‌న‌ప్పుడు బాల‌య్య చిన్న‌ల్లుడు, టీడీపీ క్యాండెట్ శ్రీ భ‌ర‌త్ గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కే అనుకున్నారు. క‌ట్ చేస్తే ఎన్నిక‌ల‌కు ఆరు రోజులు మాత్ర‌మే టైం ఉన్న నేప‌థ్యంలో ఝాన్సీ విశాఖ పార్ల‌మెంట్ వార్ వ‌న్‌సైడ్ చేసేస్తే.. భ‌ర‌త్ ఎన్నిక‌ల‌కు ముందు తేలిపోతున్నాడా ? అన్న చ‌ర్చ‌లు, సందేహాలు న‌డుస్తున్నాయి.

ఇటు గ‌తంలో రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఝాన్సీకి పార్ల‌మెంటులో విశాఖ స‌మ‌స్య‌ల‌పై చేసిన పోరాటాలు.. సంధించిన ప్ర‌శ్న‌లు, ఉన్న‌త విద్యావంతురాలిగానే కాకుండా.. జ‌డ్పీచైర్‌ప‌ర్స‌న్‌గా ప‌నిచేసిన అనుభ‌వంతో ఆమెకు క్షేత్ర‌స్ధాయి నుంచే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఎలా ? ఉంటాయో ? క్లారిటీగా తెలుస్తోంది. అందుకే ఆమె ప్ర‌తి స‌మ‌స్య‌పై సూటిగా, స్ప‌ష్టంగా మాట్లాడుతున్నారు. అస‌లు భ‌ర‌త్‌కు ప్ర‌జా స‌మ‌స్య‌లు ఎలా ఉంటాయో ? వాటి గురించి ఎలా మాట్లాడాలో తెలియ‌ని ప‌రిస్థితి.

ఝాన్సీకి గ‌తంలో జ‌డ్పీచైర్‌ప‌ర్స‌న్‌గా, రెండుసార్లు ఎంపీగాను, ఇటు త‌న కుటుంబం చేసిన అభివృద్ధితో పాటు విశాఖ ఇన్‌చార్జ్ మినిస్ట‌ర్‌గా బొత్స చేసిన డెవ‌ల‌ప్‌మెంట్ గురించి చెప్పుకోవ‌డానికి చాలా ఉంది. అటు భ‌ర‌త్‌కు చెప్పుకోవ‌డానికే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న‌ట్టుగా త‌ప్పా ఏమీ లేదు. విశాఖ‌ప‌ట్నం ఆడ‌ప‌డుచు అన్న సెంటిమెంట్‌తోనూ ఝాన్సీ ఓట‌ర్ల‌తో పాటు ఇక్క‌డ మ‌హిళా ఓట‌ర్ల మ‌న‌స్సుల్లోకి చొచ్చుకుపోతున్నారు. ఇక ఆమె గ‌తంలోనే పార్ల‌మెంటులో విశాఖ గురించి చేసిన ప్ర‌సంగాలు పార్ల‌మెంటుతో పాటు న‌గ‌ర ప‌రిధిలోని మేథావుల‌ను ఆలోచింప చేసేలా చేస్తున్నాయి.

ఇక విశాఖ ఎంపీ సీటును చాలా యేళ్ల త‌ర్వాత గెలుచుకోవాల‌న్న‌ది కాపుల క‌ల‌. అయితే ప్ర‌ధాన ప‌క్షాలేవి ఈ సామాజిక వ‌ర్గానికి సీటు ఇవ్వ‌లేదు. అయితే ఈ సారి వైసీపీ కాపుల్లో అందులోనూ తూర్పు కాపు నుంచి మ‌హిళ‌కు సీటు ఇవ్వ‌డం ఆ వ‌ర్గాల్లో ఐక్య‌త కొట్టొచ్చిన‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఇక జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు విశాఖ రాజ‌ధాని ప్ర‌భావం ఈ సారి ఇక్క‌డ బ‌లంగా క‌నిపిస్తోంది. ఇలా ఝాన్సీకి కావాల్సిన‌న్ని ప్ల‌స్‌లు ఉంటే.. అటు టీడీపీ అభ్య‌ర్థి శ్రీభ‌ర‌త్‌కు చెప్పుకోవ‌డానికి ఒక్క ప్ల‌స్సూ స‌రైంది లేదు. పేరుకు గీతం విద్యాసంస్థ‌ల చైర్మ‌న్‌, ఉన్న‌త విద్యావంతుడు అంటున్నా.. ఆ దిశ‌గా విశాఖ‌లో యువ‌త‌కు చేసిన సేవ‌లు లేవు.. స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న లేదు.. ప్ర‌జా పోరాటాలు క‌న‌ప‌డ‌డం లేదు.. క‌నీసం ఆక‌ట్టుకునే స్పీచ్‌లు లేవు. మ‌రి రేసులో సీనియ‌ర్ ఝాన్సీ ముందు పూర్తిగా వెన‌క‌ప‌డిపోయిన భ‌ర‌త్ రేప‌టి ఎన్నిక‌ల్లో ఏం చేస్తాడో ? చూడాలి.

Related posts

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

sharma somaraju

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

sharma somaraju

Fire Accident: గేమ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం ..24 మంది మృతి

sharma somaraju