Indraja: జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో కార్యక్రమాలకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈమె కాకుండా హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్ లాంటి వారు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం నవ్విస్తున్నారు. లేటెస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ సరికొత్త మలుపులతో ఉంది. మే 12న మదర్స్ డే కావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ని ఆ విధంగా రూపొందించారు. ఇక తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో సరదాగా ఉంటూనే ఎమోషన్ రేపెట్టింది.
ఫైమా, అంజలి లాంటి వారంతా వారి తల్లులతో శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి హాజరయ్యారు. ఇక గెటప్ శ్రీను తాను నటిస్తున్న రాజు యాదవ్ చిత్ర ప్రమోషన్స్ కి హాజరయ్యాడు. రష్మీ ఈ షోలో మమ్మీ వర్సెస్ డాటర్స్ అనే గేమ్ నిర్వహించింది. ఈ గేమ్ సరదాగా సాగింది కూడా. మదర్స్ డే సందర్భంగా బుల్లెట్ భాస్కర్, ఇమాన్యుయల్, నూకరాజు, పొట్టి నరేష్ లాంటి జబర్దస్త్ కమెడియన్ అంతా తాము అమ్మగా భావించే ఇంద్రజని నవ్వించారు. ఆక ఇంద్రజాకి ఒక్కొక్కరు ఒక్కో గిఫ్ట్ కూడా ఇచ్చారు. నూకరాజు ఆమెకి మంచి చేరని బహుమతిగా ఇచ్చాడు. వారందరి ప్రేమకి ఇంద్రజ ఎమోషనల్ అయింది. అయితే పేరెంట్స్ డే కావడంతో ఇంద్రజ కూడా తన తల్లిని గుర్తు చేసుకున్నారు.
తన జీవితంలో ఎన్ని రిలేషన్స్ ఉన్నా సరే తల్లి మరియు తండ్రి లేకుంటే అనాధల లెక్కే అని ఇంద్రజా తెలిపింది. కన్న తల్లిదండ్రులకు చేయకుండా ఊరంతా వెళ్లి చేసి ప్రయోజనం లేదు. తాను కూడా ఆ విధంగా చాలా తప్పులు చేశానంటూ ఎమోషనల్ అయింది. తన తల్లి చివరి కోరిక నెరవేర్చలేకపోయారని ఇంద్రజ ఒక్కసారిగా గొక్క పెట్టి ఏడ్చింది. రష్మీ వచ్చి ఓదార్చినప్పటికీ ఇంద్రజ గుండెలో బాధని మొత్తం బయటపెట్టింది. ఆమె బాధ చూసి అక్కడ ఉన్న వారంతా కంటతడి పెట్టారు కూడా. మా అమ్మ ఉన్నప్పుడు ఓ గుడికి తీసుకెళ్లామని చాలాసార్లు అడిగింది. ఆమె కోరిక తీర్చలేకపోయాను.
ఒకసారి మా అమ్మ కనిపిస్తే ఆమె కోరిక నెరవేర్చాలని ఉంది అంటూ బోరుమని ఏడ్చింది ఇంద్రజ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈమె వ్యాఖ్యలను చూసిన పలువురు..” తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారి ప్రాధాన్యత ఎవరికి అర్థం కాదు. అయినా అప్పుడు మీది తప్పు కాదు. తీర్చలేని స్థాయిలో మీరు ఉన్నారు. బట్ ఇప్పుడు ఏడ్చి ఎటువంటి లాభం లేదు. వారి పేరు పై మరికొందరిని ఆక్కున చేర్చుకోండి. వారి పేరుపై అన్నదానం వంటివి చేయండి. ఆ రూపంలో మీ తల్లిదండ్రులు మీతోనే ఉంటారు. మిమ్మల్ని తల్లిగా భావించే జబర్దస్త్ కమెడియన్స్ మీరు ఇలా ఏడవడంతో వారు కూడా కృంగిపోయారు. మీరు స్ట్రాంగ్ గా ఉంటే వారు కూడా మిమ్మల్ని చూసి స్ట్రాంగ్ గా ఉంటారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు