Malli Nindu Jabili: సోషల్ మీడియా వచ్చిన తర్వాత అటు ఇన్స్టాగ్రామ్ ఇటు ఫేస్బుక్ అంటూ చాలామంది సెలబ్రిటీలు వీటిని ఫాలో అవుతూ.. తమకు కాస్త ఖాళీ సమయ దొరికితే చాలు ట్రెండింగ్ లో ఉన్న పాటలకు రీల్స్ చేస్తూ బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పాటలు విషయానికి వస్తే.. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా,విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాలోని ఆరాధ్య సాంగ్ మొదటగా వినిపిస్తుంది. ఈ సినిమాలో ఈ పాట ఎంత ట్రెండీ గా మారిందో అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటకు రీల్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మల్లి సీరియల్ ద్వారా భారీ గుర్తింపు తెచ్చుకున్న మాలిని, గౌతమ్ కూడా ఆరాధ్య పాటకు స్టెప్పులేసి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు.ఇకపోతే ఇందులో మాలిని అలియాస్ దీప జగదీష్ , గౌతమ్ అలియాస్ ఆర్యన్ దిర్ కుమార్ ఇద్దరు కూడా హీరో అరవింద్ కి యాంటీనా నటిస్తున్నట్టే ఉన్న మంచి మనస్తత్వం కలిగిన క్యారెక్టర్లలో వీరిద్దరూ నటిస్తున్నారు.

ఈ సీరియల్ లో అరవింద్ క్యారెక్టర్ కు భార్య పాత్రలో నటించిన మాలిని అలియాస్ దీప జగదీష్ ఇప్పుడు తన డాన్స్ పెర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. నిన్న ఉన్నటువంటి వరకు దుబాయ్లో తన భర్తతో కలిసి సైమా అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆర్యన్ దిర్ కుమార్ తో కలిసి ఆరాధ్య పాటకు రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

మొత్తానికైతే ఈ పాట సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఈ వీడియో అభిమానులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఒకవైపు సీరియల్స్ లో అలరిస్తున్న వీరు ఇలా ఇన్స్టాగ్రామ్ లో కూడా అలరిస్తూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.