Karthika Deepam Jan 20 Today Episode: కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా ముందుకు సాగుతూ పోతుంది.ప్రకృతి ఆశ్రమంలో అత్తమామల్ని చూసిన దీప అదే ఆలోచనతో ఇంటికి చేరుకుంటుంది.సీన్ కట్ చేస్తే మన గురించి ఆరా తీసింది ఎవరా అయి ఉంటుందని డిస్కస్ చేసుకుంటారు సౌందర్య, ఆనందరావు. ప్రశాంతతని వెతుక్కుని ఇక్కడకు వచ్చాం అయినా ప్రశాంతత మనసులో ఉండాలి కదా..కార్తీక్ పిల్లలు ఎలా ఉన్నారో అన్న ఆనందరావు ప్రశ్నకి…ఆ ఆలోచన వద్దు దీప వాళ్లని ఓడిపోనివ్వదని మీరన్నారు కదా అని సౌందర్య అంటే మరి దీపకు సపోర్ట్ ఎవరిస్తారని ప్రశ్నిస్తాడు ఆనందరావు.
Devatha Serial: ఒక్కటైనా తండ్రీ కూతురు.. మాధవ్ ఏం చేశాడంటే..!?
కట్ చేస్తే ఇంటికి చేరుకున్న దీప అత్తయ్య, మామయ్య ఇక్కడే ఉన్న విషయం పిల్లలకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. దీప దగ్గరకు వచ్చిన పిల్లలు వచ్చినప్పటి నుంచి ఏమీ మాట్లాడటం లేదేంటమ్మా అని అడుగుతారు.నీకు పని ఎక్కువ అవుతోంది కదా అలసిపోయావా అంటారు. ఏమైంది..డాడీ కూడా డల్ గానే కనిపించారని చెబుతారు. వచ్చి సిలిండర్ ఫిక్స్ చేసి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లారంటారు. అత్తయ్య, మామయ్య, మేము అంతా ఒకే ఊర్లో ఉన్నప్పటికీ దూరం నుంచి చూసుకోవాల్సి వస్తోందని కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప.వాళ్లెందుకు వచ్చారో అనే ఆలోచనలో పడుతుంది దీప.
Case On Kanna Family: గృహహింస కేసులో నెగ్గిన కన్నా కోడలు!కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు
డాక్టర్ బాబు సిలిండర్ ఎలా తీసుకోచ్చాడనే ఆలోచనలో దీప :
అదే సమయంలో డాక్టర్ బాబు సిలిండర్ తీసుకొచ్చారని అన్నారు..ఎక్కడినుంచి తెచ్చారు..ఇప్పుడెక్కడికి వెళ్లారని అనుకుంటుంది. మరో వైపు ప్రకృతి ఆశ్రమంకు వెళ్లి అక్కడ ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి వాళ్లెందుకు వచ్చారని అడుగుతాడు. మీరెవరు అంటే తెలిసిన వాళ్లు అని అబద్ధం చెప్పేస్తాడు. ఆ పెద్దాయనకు ప్రాబ్లెం ఏంటి అని అడిగితే… మీరు కలుస్తానంటే మీ పేరు చెప్పండి, లేదంటే వెళ్లిపోండి అంటాడు. మాటిమాటికీ వచ్చి ఇబ్బంది పెడితే బాగోదంటాడు. చేసేదిలేక కార్తీక్ వెనుతిరుగుతాడు.
Case On Kanna Family: గృహహింస కేసులో నెగ్గిన కన్నా కోడలు!కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు
బాబు కోసం వేట మొదలుపెట్టిన మోనిత :
మరోపక్క మోనిత ఫోన్లో బాబుని ఎత్తుకెళ్లిన కోటేష్ ఫొటో చూస్తూ..ఎవడ్రా నువ్వు నా ఆనందరావుని ఎత్తుకెళ్లావ్ అనుకుంటుంది. ఒకవేళ ఏదైనా జరిగి మావయ్యగారు పైకి పోతే..కార్తీక్ రాక తప్పదు. అప్పుడు కార్తీక్ ని నేను కలవకా తప్పదు. ఈ లోగా బుల్లి ఆనందరావుని వెతకాలి.ఇందుకు నా ఆస్తి మొత్తం ఖర్చైనా పర్వాలేదు అనుకుంటుంది. ప్రకృతి ఆశ్రమంలో ఉన్న ఆనందరావు…కాసేపు బయటకు వెళ్లి నడుద్దామా అని అడిగితే..వాతావరణం చల్లగా ఉంది వద్దులెండి అంటుంది సౌందర్య.
అబద్దాలతో బతుకుతున్న కార్తీక్, దీప:
ఈలోగా ఆశ్రమానికి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చి మీగురించి అడిగిన ఆవిడ మళ్లీ ఏమైనా వచ్చిందా అని అడిగి..మీరు కొట్టినావిడ అంత మంచిదేం కాదని చెప్పి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఇంట్లో అన్నం తింటూ…మమ్మీ-డాడీ విషయం దీపకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాడు. దీప కూడా అత్తయ్య మావయ్య విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. మీరు పిల్లలతో మనసు బాలేదు అన్నారట ఎక్కడికి వెళ్లారు అంటే రుద్రాణి దగ్గరకు వెళ్లి పిల్లలకు భోజనం పంపించొద్దని వార్నింగ్ ఇవ్వడానికి వెళ్లాను అని చెప్తాడు కార్తీక్. అలాగే రుద్రాణిని ఆశ్రమంలో ఎవరో కొట్టారంట తెలుసా అంటుంది దీప.నువ్వు ఆశ్రమానికి వెళ్లావా..నీకేం పని అంటాడు కార్తీక్. రుద్రాణిని కొట్టిన ఆవిడను చూసేందుకు వెళ్లాను అంటుంది. మరి చూశావా అంటే కార్తీక్ లేదని సమాధానం చెబుతుంది దీప.
This post was last modified on January 20, 2022 11:25 am
YSRCP: ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.… Read More
Madhuranagarilo April 27 2024 Episode 349: రుక్మిణి ఆలోచిస్తూ ఉండగా శ్యామ్ గోడ దూకి లోపలికి వస్తాడు. శ్యామ్… Read More
Trinayani April 27 2024 Episode 1224: ఎందుకు అందరూ భయపడుతున్నారు అని నైని అడుగుతుంది. ఇక్కడ ఒక మూట… Read More
Aamani: 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తారల్లో ఆమని ఒకటి. బెంగళూరులో జన్మించిన ఆమని..… Read More
Ramayana: హిందువుల పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఇప్పటికే ఎందరో దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు. ఈసారి నితేష్ తివారీ వంతు వచ్చింది.… Read More
Karthika Deepam 2 April 27th 2024 Episode: దీప సాక్ష్యం చెప్పడంతో పోలీసులు జ్యోత్స్న అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు.… Read More
EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.… Read More
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈ ఆరడుగుల అందాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన… Read More
Manipur: మణిపూర్ లో మరో సారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు… Read More
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైస్ చిత్రం… Read More
Jagadhatri April 27 2024 Episode 216: కేదార్ భయపడిపోయి జగదాత్రి చెయ్యి తన నెత్తి నుంచి తీసేస్తాడు. ఎందుకు… Read More
Paluke Bangaramayenaa April 27 2024 Episode 213: ఎలుక ఉందని భయపడిపోయిన స్వర పరిగెత్తుకొచ్చి అభి పక్కన బెడ్… Read More
Brahmamudi April 27 2024 Episode 395: దుగ్గిరాల ఇంట్లో రోజుకో రచ్చ జరుగుతూనే ఉంది. నిన్న కావ్య మీడియా… Read More
Naga Panchami: గరుడ రాజు తన గరుడ శక్తిని ఖరాలికి ఆవాహన చేస్తాడు. కరాలి ధన్యోస్మి గరుడ రాజా అంటుంది.… Read More
Mamagaru: అవును వదిన ఇక్కడ ఉంటున్నామనే కానీ తింటే తినబుద్ది అవదు పడుకుంటే పడకో బుద్ధి కాదు అక్కడ ఉంటే… Read More